iDreamPost

అలుపెరగని సైనికులు , నిబద్ధత కలిగిన శ్రామికులు ఈ వాలంటీర్లు .

అలుపెరగని సైనికులు , నిబద్ధత కలిగిన శ్రామికులు ఈ వాలంటీర్లు .

విలేజ్, వార్డ్ వలంటీర్ పధకంలో పల్లెటూరి యువతకి వారి గ్రామాల్లోనే ఉద్యోగాలు ఇవ్వటానికి జగన్ సంకల్పించినప్పుడు భిన్న స్వరాలు వినిపించటమే కాదు , ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి కూడా , చంద్రబాబు అయితే ఏకంగా వలంటీర్స్ కి ఎవరూ పిల్లనివ్వరు అని వ్యాఖ్యానించారు .

కానీ వారు తమకప్పజెప్పిన ప్రతి బాధ్యత క్షేత్ర స్థాయి నుండీ విజయవంతంగా పూర్తి చేస్తూ వచ్చారు . ఈ రోజు కరోనా వైరస్ వ్యాపిస్తున్న అత్యంత క్లిష్ట దశలో అడ్డుకట్ట వేయటానికి వారే ఆపద్బాంధవులు అయ్యారు .

అనంతపురం జిల్లాకురాకులపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ అనే ఈ వలంటీర్ కృషిని చూడండి .తన పిల్లల్ని ఒక చెట్టు కింద దూరంగా కూర్చోపెట్టి కర్ణాటక వైపున్న బి.కె.హళ్ళి గ్రామం నుండి ఎవరు తమ గ్రామంలోకి రాకుండా కాపలా కాస్తుంది. ఆ వాలంటీర్న్ పర్యవేక్షించే వారు ఎవరు లేరు.. తాను ఊరి బయట ఎండలో పిల్లలను చెట్టు కింద కూర్చోబెట్టి కాపలా కాయాక పోయినా తనను ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండరు… ఒళ్ళోకి ఏ అధికారి రావాలన్న లేక వొచ్చిన ముందు తెలిసేది వీరికే …. అందుకే అంటుంది వాలంటీర్లు ఐదువేల జీతం కోసం పనిచేసే ఉద్యోగుల కాదు… వారిలో బాధ్యతల పట్ల కమిట్మెంట్ ఉంది .

లాక్ డౌన్ సమయంలో తమకప్పజెప్పిన యాభై కుటుంబాల్లోకి ఎవరైనా విదేశాల నుండి వస్తే గుర్తించి వారితో మాట్లాడి సమాచారం ఇస్తుంది ఈ వాలంటీర్లే. ఆ యాభై కుటుంబాల్లో ఎవరికైనా అనారోగ్యం కలిగితే వెంటనే ఆరోగ్య శాఖ సిబ్బందికి సమాచారమిచ్చి పరీక్షలకు సిద్ధపరిచేది ఈ వాలంటీర్లే ,లాక్ డౌన్ సమయంలో వారికి ఆ యాభై కుటుంబాలకు సంక్షేమ పథకాల ప్రతిఫలాలు అందుకునేందుకు తగు సహాయం చేస్తోందీ ఈ వాలంటీర్లే. 

ఇంతా చేసేది వారు కేవలం ఐదు వేల జీతానికి కాదు , తమ గ్రామం పై ప్రేమతో , అభిమానంతో చేస్తున్న కృషికి ఈ ఐదు వేల నామమాత్రపు జీతం ఓ గుర్తింపు మాత్రమే .

మరో చోట చూస్తే తూర్పు గోదావరి జిల్లా కి చెందిన నరేష్ అనే వ్యక్తి విదేశాన్నుండి తన ఊరు వచ్చిన మర్నాటి ఉదయానికి లోకల్ సబ్ ఇంస్పెక్టర్ అతని తమ్ముడికి కాల్ చేసి మీ అన్నయ్య ఇలా ఫలానా దేశం నుండి రాత్రి వచ్చాడట కదా , అతను , తనతో పాటు ఇంట్లో వాళ్ళు వైరస్ టెస్టులు ఐపోయేవరకూ హోమ్ ఐసోలేషన్ లో ఉండండి నేను వైద్య సిబ్బందిని పంపి టెస్ట్లకు ఏర్పాటు చేస్తాను అని చెబితే ఆశ్చర్యపోవడం సదరు nri వంతు అయ్యింది .

సర్ నేను రాత్రి వచ్చిన దగ్గర్నుండీ ఇంట్లోనుండి బయటికి వెళ్ళలేదు ఉదయానికి మీకు ఈ సమాచారం ఎలా తెలిసింది అంటే విలేజ్ వలంటీర్ సిస్టం గురించి వివరించాడు ఆ సబ్ ఇన్స్పెక్టర్ గారు .

క్షేత్రస్థాయిలో ఇలాంటి కట్టుదిట్టమైన వ్యవస్థని ఏర్పాటు చేసుకొన్నందునే , రాష్ట్రంలోకి వచ్చిన విదేశీయుల్ని , కరోనా వైరస్ లక్షణాలున్న వారినీ సత్వారమే గుర్తించి వైరస్ వ్యాపించకుండా ఆంధ్ర రాష్ట్ర యంట్రాంగం సమర్థంగా కృషి చేయగలుగుతుంది . అందుకే రాష్ట్రంలోనే కాదు దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా AP విలేజ్ వలంటీర్ వ్యవస్థ పనితీరుని మెచ్చుకొని తమ రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నిస్తున్నాయి .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి