iDreamPost
android-app
ios-app

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. అతి త్వరలో వందే భారత్ మెట్రో రైళ్లు

రోజు రైలులో ప్రయాణీస్తున్నారా.. కాస్త దూరానికే గంటలు గంటలు ప్రయాణం చేయాల్సి వస్తుందా.. అయితే ఈ వార్త మీకోసమే.. రోజువారీ ప్రయాణీకుల అవసరాలను తీర్చడం లక్ష్యంగా కొత్త రైళ్లు రాబోతున్నాయి.

రోజు రైలులో ప్రయాణీస్తున్నారా.. కాస్త దూరానికే గంటలు గంటలు ప్రయాణం చేయాల్సి వస్తుందా.. అయితే ఈ వార్త మీకోసమే.. రోజువారీ ప్రయాణీకుల అవసరాలను తీర్చడం లక్ష్యంగా కొత్త రైళ్లు రాబోతున్నాయి.

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. అతి త్వరలో వందే భారత్ మెట్రో రైళ్లు

దేశంలో అతి పెద్ద రవాణా వ్యవస్థ రైల్వే. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు రైల్వే వేగవంతంగా అభివృద్ది చెందుతోంది. సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్ల నుండి వందే భారత్ ఎక్స్ ప్రెస్, బుల్లెట్ ట్రైన్ల ఆవిష్కరణ వరకు పరుగులు పెడుతోంది భారత్. తక్కువ సమయంలో వేగవంతమైన ప్రయాణాన్ని రైల్వేలు అందిస్తున్నాయి. సుఖవంతమైన, వేగవంతమైన ప్రయాణం కోసం ప్రయాణీకులు కూడా ఈ ట్రైన్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఈ ట్రైన్లకు ప్రజల నుండి బాగా ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో మరిన్ని కొత్త రైళ్లను తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది ఇండియన్ రైల్వే. ఇప్పుడు కొత్త శకానికి నాంది పలకనుంది. వందే భారత్ రైళ్లకు దీటుగా వందే భారత్ మెట్రో రైళ్లను తీసుకు వస్తుంది.

ఇప్పటికే తొలి వందే భారత్ మెట్రో రైలు తయారైంది. పంజాబ్‌లోని కపుర్తరాలోని ఫ్యాక్టరీ వందే భారత్ మెట్రో తొలి రైలును తయారు చేసింది. జులైలో దీన్ని పరీక్షించనున్నారు. 100 కి.మీ నుండి 250 కిమీల మధ్య ప్రయాణించేందుకు వీలుగా ఈ రైలును తయారు చేస్తున్నారు. ఇందులో 12 భోగీలు ఉండనున్నాయి. భవిష్యత్తులో 16 కోచ్‌ల వరకు విస్తరించుకునే అవకాశం ఉంది. కాగా, తొలుత 50 రైళ్లను తయారు చేస్తామని, వాటిని 400కి పెంచుతామని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ప్రధాన నగరాలను కలుపుతూ ట్రాకులపై ఈ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ప్రస్తుతం జనాభా పెరుగుదల, ప్రయాణీకుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని ఈ రైళ్లను తీసుకు వస్తుంది కేంద్ర ప్రభుత్వం.

మొత్తం 124 నగరాల్లో విస్తరించేందుకు ప్రణాళిలకు చేపడుతున్నారు. ఇందులో అత్యాధునిక సదుపాయాలు కూడా ఉన్నాయి. విశాలవంతమైన సీటింగ్, నిల్చొని ప్రయాణం చేసే వారికి స్పేషియస్ ప్లేస్, అత్యాదునిక బాత్రూమ్ సదుపాయలు ఉన్నాయి. ఇప్పుడున్న ట్రాకులపైనే ఇవి పరుగులు పెట్టనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వందే భారత్ మెట్రో రైళ్లు రాబోతున్నాయి. లక్నో-కాన్పూర్, ఆగ్రా-మథుర, తిరుపతి-చెన్నై నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. అలాగే హైదరాబాద్ కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. తక్కువ సమయంలో వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి. జులైలో ట్రయల్ రన్ అయిపోయాక.. వెంటనే వీటిని తీసుకు రానున్నారు. ముఖ్యంగా రోజువారీ ప్రయాణీకుల అవసరాలను తీర్చడం లక్ష్యంగా ఈ రైళ్లను తీసుకు వస్తున్నారు. అంటే ఉద్యోగాలు, కాలేజీలు, వ్యాపారాలు నిమిత్తం ప్రయాణించే వారికి ఈ రైళ్లు వరంగా మారనున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి