iDreamPost
android-app
ios-app

నిద్రపోతున్న కొడుకును గొడ్డలితో నరికి చంపిన తండ్రి

  • Published Aug 01, 2023 | 4:09 PM Updated Updated Aug 01, 2023 | 4:09 PM
  • Published Aug 01, 2023 | 4:09 PMUpdated Aug 01, 2023 | 4:09 PM
నిద్రపోతున్న కొడుకును గొడ్డలితో నరికి చంపిన తండ్రి

తెలంగాణలో మరో దారుణం చోటు చేసుకుంది. నిద్రలో ఉన్న కొడుకును తండ్రి గొడ్డలితో నరికి చంపాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకు తండ్రి కొడుకుని ఎందుకు దారుణంగా హత్య చేశాడు? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటంటే?

పోలీసుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గౌతమ్‌నగర్ కాలనీలో జమ్ముల రాజయ్య అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి శంకర్ అనే కుమారుడు ఉన్నాడు. ఇతడు పనిపాట లేకుండా జులాయిగా తిరుగుతూ ఉండేవాడు. ఇంతే కాకుండా మద్యానికి అలవాటు పడి రోజూ తల్లిదండ్రులను హింసించేవాడు. బుద్దిగా ఉండమని తల్లిదండ్రులు ఎన్నో సార్లు చెప్పి చూశారు. కానీ, ఇవేం పట్టించుకోని శంకర్.. రోజూ తల్లిదండ్రులను కొట్టేవాడట. దీంతో తండ్రి రాజయ్య కొడుకు ఆగడాలపై విసిగిపోయాడు. ఇలా అయితే కాదని భావించిన రాజయ్య.. ఎలాగైనా కొడునును హత్య చేయాలని అనుకున్నాడు.

ఇందులో భాగంగానే మంగళవారం తెల్లవారుజామున కొడుకు రూంలోకి వెళ్లాడు. అతడు నిద్రపోతున్నది చూసిన తండ్రి రాజయ్య.. ఇంట్లో గొడ్డలితో నరికాడు. తండ్రి దాడిలో శంకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో భయంతో రాజయ్య అటు నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

ఇది కూడా చదవండి: మంచి బోధించాల్సిన టీచరమ్మే ఇలా చేస్తుందని అనుకోలేదు!

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabet