iDreamPost

గామి ట్రైలర్ రిలీజ్.. అఘోరా మాత్రమే కాదు.. అంతకు మించి!

Gaami Trailer Review In Telugu: విశ్వక్ సేన్- విద్యాధర్ కాంబోలో వస్తున్న గామి చిత్రంపై భారీగానే అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ విడుదల చేశారు.

Gaami Trailer Review In Telugu: విశ్వక్ సేన్- విద్యాధర్ కాంబోలో వస్తున్న గామి చిత్రంపై భారీగానే అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ విడుదల చేశారు.

గామి ట్రైలర్ రిలీజ్.. అఘోరా మాత్రమే కాదు.. అంతకు మించి!

టాలీవుడ్ లో గత కొద్ది రోజులుగా.. కాదు గత కొన్ని సంవత్సరాలుగా గామి గురించి చర్చ జరుగుతోంది. అసలు ఆ సినిమా ఎలా ఉండబోతోంది? విశ్వక్ సేన్ అఘోరాగా ఎలా చేయబోతున్నాడు అంటూ చాలానే ప్రశ్నలు వచ్చాయి. ఎనిమిదేళ్లుగా కథతో ప్రయాణం.. నాలుగేళ్ల పాటు షూటింగ్.. చివరికి మార్చి 8న థియేటర్లలో విడుదల కాబోతోంది. అయితే ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్స్ జోరు పెంచేశారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. మరి.. గామి ట్రైలర్ ఎలా ఉంది? సినిమా కథకు సంబంధించి ఏమైనా రివీల్ చేశారా? అఘోరాగా విశ్వక్ సేన్ ఎలా చేశాడు? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

గామి సినిమా ట్రైలర్ చూస్తే.. కథ మొత్తం చెప్పేశారు అనిపిస్తోంది. ఎక్కడా ఏ ఒక్క పాయింట్ ని కూడా దాచిపెట్టినట్లు అనిపించలేదు. అయితే వారి టేకింగ్, కథ చెప్పిన విధానం మీద ఉన్న నమ్మకంతో ఈ విధంగా ట్రైలర్ కట్ చేసి ఉండచ్చు. లేదంటే సస్పెన్స్ లో పెట్టి థియేటర్ కు తీసుకొచ్చే బదులు.. ఒక క్లారిటీతో తీసుకురావాలి అనుకుని కూడా ఉండచ్చు. కాగిత విద్యాధర్ ఈ స్టోరీ మీద ఇన్నేళ్లుగా ఎందుకు ఉన్నాడో? విశ్వక్ సేన్ నాలుగేళ్లు పట్టినా ఎందుకు ఈ మూవీ చేశాడో.. ట్రైలర్ చూసిన తర్వాత క్లారిటీ వస్తుంది.

ఈ గామి మూవీ కేవలం అఘోరాకి సంబంధించింది కాదు. టైటిల్ ని ఎలా అయితే కనెక్టెడ్ గా చూపిస్తున్నారో.. అలాగే ఒక ఊరు, ఒక వ్యక్తి, ఒక సైన్స్ లేబరేటరీ అన్నీ కనెక్టెడ్ గా కథ ముందుకు సాగుతోంది. ఈ అన్నింటికీ ఎక్కడో ఒక దగ్గర కనెక్టింగ్ పాయింట్ ఉండచ్చు. మనిషి గనుక విశ్వన్ ను తాకితే.. అతని పారలైజ్ అవ్వడమే కాకుండా శరీరం మొత్తం నీలంగా మారిపోతుంది. ఆ సమస్యకు పరిష్కారం కోసమే విశ్వక్ తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. అందుకు ఎంతో ప్రమాదకరమైన హిమాలయాల మీదకు వెళ్తాడు. 36 సంవత్సరాలకు ఒకసారి దొరికే అద్భుతమైన మాలి పత్రాల కోసం తన ప్రయాణం ప్రారంభిస్తాడు. వాటితో అతని సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలుసుకుంటాడు. తన ప్రయాణానికి చాందినీ చౌదరి తోడుగా ఉంటుంది.

మరోవైపు ఒక గ్రామంలో దేవదాసీ వ్యవస్థ ఉంటుంది. ఇంకో దగ్గర ఒక ల్యాబ్ లో మనుషుల మీద వింత ప్రయోగాలు చేస్తున్నారు. ఇలా అన్ని అంశాలను విడివిడిగా చూపించారు. వీటన్నింటికి కనెక్టింగ్ పాయింట్ విశ్వక్ సేన్ పాత్ర కావచ్చు అనేలా అనిపిస్తోంది. టేకింగ్ విషయానికి వస్తే.. ఈ మూవీ విజువల్ వండర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి సీన్, ప్రతి షాట్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. గ్రాఫిక్స్ కూడా ఎంతో న్యాచురల్ గా చూపించారు. ప్రతి డీటెయిలింగ్ మీద డైరెక్టర్ తీసుకున్న జాగ్రత్తకు కళ్లకు కనిపిస్తుంది. మొత్తానికి ఈ సినిమాని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది తెలియాలంటే మార్చి 8 వరకు ఆగాల్సిందే. మరి.. విశ్వక్ సేన్ గామి ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి