iDreamPost
android-app
ios-app

Gaami: బాక్సాఫీస్​ను షేక్ చేస్తున్న ‘గామి’.. డే2 వసూళ్లు ఎంతంటే..!

  • Published Mar 10, 2024 | 12:10 PM Updated Updated Mar 10, 2024 | 12:10 PM

యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ "గామి". విశ్వక్ కెరీర్ లోనే వన్ అఫ్ ది బెస్ట్ ఫిల్మ్ గా ఈ సినిమా వుండబోతుందనే టాక్ జోరుగా వినిపిస్తుంది. మరి ఈ సినిమా రెండవ రోజు ఎన్ని కోట్లను వసూలు చేసిందో చూద్దాం.

యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ "గామి". విశ్వక్ కెరీర్ లోనే వన్ అఫ్ ది బెస్ట్ ఫిల్మ్ గా ఈ సినిమా వుండబోతుందనే టాక్ జోరుగా వినిపిస్తుంది. మరి ఈ సినిమా రెండవ రోజు ఎన్ని కోట్లను వసూలు చేసిందో చూద్దాం.

  • Published Mar 10, 2024 | 12:10 PMUpdated Mar 10, 2024 | 12:10 PM
Gaami: బాక్సాఫీస్​ను షేక్ చేస్తున్న ‘గామి’..  డే2 వసూళ్లు ఎంతంటే..!

మాస్ కా దాస్ విశ్వక్ నటించిన లేటెస్ట్ ఫిలిం “గామి” . ఇప్పుడు అంతటా ఈ సినిమా గురించి హిట్ టాక్ నడుస్తుంది. మహా శివరాత్రి సంధర్బంగా ఈ సినిమాను మార్చి 8న .. గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల చేశారు. ఈ సినిమాకు విద్యాధర్ రావు కగిత దర్శకత్వం వహించారు. కాగా, ఈ సినిమాలో చాందినీ చౌదరి, దయానంద్ రెడ్డి ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుని.. భారీ ఓపెనింగ్స్ ని రాబట్టింది. మొదట ఈ సినిమాపైన ఎటువంటి భారీ అంచనాలు లేకపోయినా .. విడుదల తర్వాత మాత్రం “గామి” సినిమా టాలీవడ్ ఇండస్ట్రీలో తన సత్తా చూపిస్తోంది. ప్రస్తుతం గామి సినిమాపై కోట్ల వర్షం కురుస్తోంది. మరి, “గామి” సినిమా రెండవ రోజు ఎంత వసూళ్లను రాబట్టిందో చూద్దాం.

“గామి” సినిమా విడుదలైన మొదటి రోజునే .. హిట్ టాక్ తో దూసుకుపోయింది. అయితే, ఈ సినిమా బడ్జెట్ మొత్తంగా రూ.24 కోట్లు అయినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్​తో కలుపుకొని ఓవరాల్​గా ఈ సినిమాకు రూ.11 కోట్ల మేర ప్రీ రిలీజ్ జరిగింది. ఇక గామి విడుదలైన మొదటి రోజు రూ. 9.07 కోట్ల కలెక్షన్స్ ను వసూళ్లు చేసింది. ఈ రకంగా చూస్తే.. మొదటి వారంలోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అవ్వడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ సినిమా రెండవ రోజుల గ్రాస్ ఈవెన్ కలెక్షన్స్ అక్షరాలా రూ.15.1 కోట్లు. దీనిని బట్టి చూస్తుంటే .. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యే లోపే బ్రేక్ ఈవెన్ ను దాటేస్తుందని అనిపిస్తోంది. ఫలితంతో సంబంధం లేకుండా విశ్వక్ పడిన ఆరేళ్ళ కష్టానికి ఫలితంగా .. ‘గామి’ నిదర్శనంగా నిలువనుంది. ఇక రానున్న రోజుల్లో గామి కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ వసూళ్లను కోళ్లగొట్టనుందనే టాక్ వినిపిస్తోంది.

ఇక విశ్వక్ సేన్ విషయానికొస్తే.. విశ్వక్ సినీ హిస్టరీలోనే అత్యధిక కలెక్షన్స్ ను రాబట్టిన మూవీగా గామి నిలిచిపోయింది. ప్రస్తుతం విశ్వక్ నెక్స్ట్ ఫిల్మ్ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో విశ్వక్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఇప్పుడు గామి భారీ హిట్ టాక్ సంపాదించుకోవడంతో.. ఆ ఎఫెక్ట్ విశ్వక్ నెక్ట్ ఫిల్మ్స్ పై పడుతుంది . దీనితో అతని రాబోయే ప్రాజెక్ట్స్ మీద అందరికి అంచనాలు పెరిగిపోయాయి. ఇక గ్యాంగ్ ఆఫ్ గోదావరితో పాటు .. విశ్వక్ కు లైన్ అప్ లో మరో రెండు సాలిడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మరి, గామి సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom