Nidhan
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. కోహ్లీ గొప్ప క్రికెటర్ అంటూనే సచిన్ టెండూల్కర్‌తో అతడ్ని పోల్చాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. కోహ్లీ గొప్ప క్రికెటర్ అంటూనే సచిన్ టెండూల్కర్‌తో అతడ్ని పోల్చాడు.
Nidhan
ఎవరు గొప్ప? అనే చర్చ ప్రతి రంగంలోనూ ఎప్పుడూ జరిగే డిస్కషనే. క్రికెట్లో కూడా ఇది సాధారణమే. ఏ బ్యాటర్ గొప్ప? ఏ బౌలర్ గ్రేట్? ఏ కెప్టెన్ బెస్ట్? అనే విషయాలపై నిరంతరం వాదోపవాదాలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా బ్యాటింగ్‌లో ఎవరు గొప్ప అనే డిస్కషన్ జరగడం చాలా కామన్. అయితే గత దశాబ్దం కింద వరకు దీనికి ఆస్కారం లేదు. ఎందుకుంటే సచిన్ టెండూల్కర్ రూపంలో క్రికెట్ వరల్డ్ మీద భారత్ ఫుల్ డామినేషన్ చూపించింది. సచిన్ ఉన్నన్ని రోజులు ఈ చర్చ జరగలేదు. అతడే గొప్ప అని అందరూ ముక్తకంఠంతో ఒప్పుకున్నారు. కానీ క్రికెట్ గాడ్ రిటైర్మెంట్ తర్వాత ఎవరు ఆ స్థాయికి చేరుకుంటారనేది ఆసక్తిని సంతరించుకుంది. అయితే టీమిండియా నుంచి విరాట్ కోహ్లీ రూపంలో మరో బ్యాటింగ్ డైమండ్ వచ్చింది. పదిహేనేళ్లుగా క్రికెట్‌ను ఏలుతున్నాడు కింగ్. సచిన్ సృష్టించిన ఎన్నో రికార్డులను అతడు బ్రేక్ చేశాడు. అలాంటి కోహ్లీపై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
కోహ్లీ గొప్ప బ్యాట్స్‌మన్ అని మెచ్చుకున్నాడు అక్తర్. విరాట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూనే.. అతడ్ని సచిన్‌తో పోలుస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తమ తరంతో పోటీ పడే ప్లేయర్ ఒక్క కోహ్లీ మాత్రమేనని అన్నాడు. ‘మా తరంలో సచిన్ టెండూల్కర్ బెస్ట్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. వాళ్లు సంధించిన రివర్స్ స్వింగ్ బాల్స్‌ను సూపర్బ్‌గా ఆడాడు. ఈ తరంలో టెండూల్కర్ బ్యాటింగ్ చేసి ఉంటే మరింత భారీగా పరుగులు చేసేవాడు. మేం ఆడిన సమయంలో సచిన్‌తో పాటు రికీ పాంటింగ్, బ్రియాన్ లారా బెస్ట్ బ్యాట్స్‌మెన్. బౌలింగ్‌లో వసీం అక్రమ్, షేన్ వార్న్‌లు అత్యుత్తమం. మా తరంతో పోటీపడే సత్తా ఉన్న ప్రస్తుత ఆటగాడు అంటే కోహ్లీ పేరు మాత్రమే చెబుతా. కానీ అతడు మా తరంలో ఆడి ఉంటే ఇబ్బందులు ఎదుర్కొనేవాడు. ప్రస్తుతంలా ఇంత ఈజీగా రన్స్ చేసేవాడు కాదు. పాక్ బౌలింగ్‌ను చీల్చి చెండాడినా.. వసీం అక్రమ్‌ను మాత్రం ఎదుర్కోలేకపోయేవాడు. అతడ్ని ఫేస్ చేయడం అంత సులువు కాదు’ అని అక్తర్ చెప్పుకొచ్చాడు.
విరాట్ కోహ్లీ నెక్స్ట్ లెవల్ ప్లేయర్ అని.. ఈ తరం అత్యుత్తుమ ఆటగాడు అతడేనని అక్తర్ పేర్కొన్నాడు. విరాట్‌కు హ్యాట్సాఫ్ అని.. అతడు 100 సెంచరీలు సాధించాలని తాను కోరకుంటున్నానని తెలిపాడు. ఇక, ఇవాళ కోహ్లీ హైదరాబాద్‌కు చేరుకున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25లో భాగంగా సొంతగడ్డ మీద ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో ఆడనుంది టీమిండియా. జనవరి 25వ తేదీన జరిగే ఫస్ట్ మ్యాచ్‌తో ఈ సిరీస్ స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం భాగ్యనగరానికి చేరుకున్నాడు విరాట్. ఈ సిరీస్‌కు ముందు జరిగే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్వహించే యానువల్ అవార్డ్స్ ఫంక్షన్లో అతడు పాల్గొననున్నాడు. కరోనా తర్వాత భారత బోర్డు నిర్వహిస్తున్న తొలి వార్షిక పురస్కారాల వేడుక ఇదే కానుంది. ఈ ఫంక్షన్‌కు కోహ్లీతో పాటు మిగిలిన టీమిండియా క్రికెటర్స్, ఇంగ్లండ్ ప్లేయర్స్ కూడా అటెండ్ కానున్నారు. మరి.. కోహ్లీని సచిన్‌తో పోలుస్తూ అక్తర్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Shoaib Akhtar hails Virat Kohli as the greatest batsman of this era 🐐#IndianCricket #ShoaibAkhtar #ViratKohli #CricketTwitter pic.twitter.com/8uxaWF6q1v
— InsideSport (@InsideSportIND) January 21, 2024