iDreamPost
android-app
ios-app

Game Changer: గేమ్ ఛేంజర్ ఆటకు పోతారు మొత్తం పోతారు! హైప్ తో చంపేస్తున్న SJ సూర్య

  • Published Nov 22, 2024 | 1:20 PM Updated Updated Nov 22, 2024 | 1:20 PM

Game Changer: రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాపై ఓ రేంజిలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Game Changer: రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాపై ఓ రేంజిలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

  • Published Nov 22, 2024 | 1:20 PMUpdated Nov 22, 2024 | 1:20 PM
Game Changer: గేమ్ ఛేంజర్ ఆటకు పోతారు మొత్తం పోతారు! హైప్ తో చంపేస్తున్న SJ సూర్య

ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాపై అంచనాలు ఒక రేంజిలో ఉన్నాయి. ఆ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా దాదాపు మూడేళ్లుగా ఈ సినిమాని చెక్కుతూనే ఉన్నారు డైరెక్టర్ శంకర్. శంకర్ చెక్కిన తీరుని బట్టి గేమ్ ఛేంజర్ షేప్ మామూలుగా రాలేదని తెలుస్తుంది. పక్కా అదిరిపోతుందని టాక్ వినిపిస్తుంది.. ఇక ఈ సినిమాకి తిరుగేలేదంటూ కామెంట్స్ విపిస్తున్నాయి. రామ్ చరణ్ సినిమా కావడంతో అంచనాలు ఉండటం కామన్. పైగా ఆ అంచనాలకు ఇటీవల విడుదల అయిన టీజర్ బూస్ట్ ఇచ్చింది. టీజర్ కట్ అదిరిపోయిందంటూ కామెంట్స్ వైరల్ అయ్యాయి. సోషల్ మీడియా దద్దరిల్లిపోయింది. రామ్ చరణ్ చేసిన రెండు పాత్రల వేరియేషన్స్.. శంకర్ లెవల్ గ్రాండియర్‌తో టీజర్ కేవలం ఫ్యాన్స్‌కి మాత్రమే కాదు ఎంటైర్ మూవీ లవర్స్ కే ఊపునిచ్చింది. అయితే ఆ ఊపును మరో రేంజ్‌లో ఊపేసే జోష్ ఇచ్చారు ఫేమస్ యాక్టర్ ఎస్‌జే సూర్య. తాజాగా ఆయన గేమ్ ఛేంజర్ సినిమా గురించి ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ అంచనాలను తారా స్థాయికి చేర్చింది.

“హాయ్ ఫ్రెండ్స్.. గేమ్ ఛేంజర్‌ సినిమాలో రెండు ముఖ్యమైన సీన్లకి ఇప్పుడే డబ్బింగ్ ఫినిష్ చేశాను. (అందులో ఒకటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారితో కాగా మరొకటి శ్రీకాంత్ గారితో చేశాను). ఈ రెండు సీన్లకి డబ్బింగ్ చెప్పడానికి మూడు రోజులు టైమ్ పట్టింది. దాని ఔట్ పుట్ చూస్తే “దీనమ్మ దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది”.. రేపు థియేటర్లో కూడా ఈ సీన్లు చూసి మీరంతా పిచ్చెక్కిపోవాడం పక్కా.. పోతారు.. మొత్తం పోతారు.. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన శంకర్ సార్‌కి, నిర్మాత దిల్ రాజు గారికి, మూవీ టీమ్ మొత్తానికి థాంక్యూ. కచ్చితంగా ఈసారి మాత్రం ‘రామ్’పింగ్ ‘శంకర్’ఆంతి (RAM’PING SHANKAR’ANTHI)” అంటూ ఎస్‌జే సూర్య ట్వీట్ చేశారు.

మనకు తెలిసిందే SJ సూర్య కేవలం నటుడు మాత్రమే కాదు.. గొప్ప డైరెక్టర్ కూడా.. అంతటి గొప్ప డైరెక్టర్ ఈ రేంజిలో ఒక సినిమా గురించి ట్వీట్ చేశాడంటే మామూలు విషయం కాదు. కచ్చితంగా ఈ సినిమాకి సూపర్ అవుట్ పుట్ వచ్చిందని క్లారిటీ వచ్చేసింది. కచ్చితంగా థియేటర్లు తగలడిపోవడం పక్కా అని తెలుస్తుంది. ప్రస్తుతం SJ సూర్య చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మెగా ఫ్యాన్స్ అయితే ఈ ట్వీట్ చూసి పండగ చేసుకుంటున్నారు. ఈ ట్వీట్ ని రీ ట్వీట్ చేస్తూ లైక్స్ కొడుతూ తెగ వైరల్ చేస్తున్నారు. కచ్చితంగా గేమ్ ఛేంజర్‌తో బాక్సాఫీస్‌ను ఊచకోత కోస్తాం.. రెడీగా ఉండండి అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ మాత్రం కాన్ఫిడెన్స్ చాలు థియేటర్లు తగలడిపోతాయ్ అంటూ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే గేమ్ చేంజర్ నుంచి ఇప్పటిదాకా వచ్చిన పాటలు, అప్ డేట్లు ఇంకా టీజర్ కంటే ఎక్కువ హైప్ ఎస్‌జే సూర్య తన మాటలతోనే ఇచ్చారు. మరి చూడాలి ఈ సినిమా విడుదల అయ్యాక ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో. ఇక గేమ్ చేంజర్ సినిమా గురించి, SJ సూర్య చేసిన ట్వీట్ గురించి మీరేమి అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetartemisbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş