P Venkatesh
BEL Engineer Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఇంజినీర్ జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు లక్షన్నర జీతం పొందొచ్చు.
BEL Engineer Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఇంజినీర్ జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు లక్షన్నర జీతం పొందొచ్చు.
P Venkatesh
నిరుద్యోగ సమస్య రోజు రోజుకు పెరిగిపోతున్నది. పట్టా భద్రులైన ప్రతి ఒక్కరికి జాబ్ ఇవ్వడం ఏ గవర్నమెంట్ కి కూడా సాధ్యమయ్యే పనికాదు. అందుకే నిరుద్యోగ యువత కోసం స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్స్ ను ఏర్పాటు చేస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. స్వయం ఉపాధి కోసం లోన్స్ అందిస్తున్నాయి. ఇటీవల కేంద్రం నిరుద్యోగుల కోసం పీఎం ఇంటర్న్ షిప్ స్కీమ్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. దీని ద్వారా దేశంలోని టాప్ కంపెనీల్లో ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. స్టేట్ కంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కు ఫుల్ క్రేజ్ ఉంటుంది.
రైల్వేలు, ఆయిల్ కంపెనీలు, రక్షణ సంస్థలు, ఇలా ఏ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా లక్షలాది మంది పోటీపడుతుంటారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని తీవ్రంగా శ్రమిస్తుంటారు. మరి మీరు కూడా జాబ్ లేకుండా ఖాళీగా ఉన్నారా? జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? ఉద్యోగం కోసం వెతికి అలసిపోయారా? అయితే డోంట్ వర్రీ. మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. తాజాగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 229 ఇంజినీర్ ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఈ ఖాళీలు భర్తీకానున్నాయి.
ఈ పోస్టులకు అప్లై చేసుకోదలిచిన అభ్యర్థులు బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత ఉండాలి. అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలు మించకూడదు. ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.40 వేల నుంచి రూ.1 లక్ష 40 వేల వరకు ఉంటుంది. ఏడాదికి సుమారుగా రూ.12 లక్షల నుంచి రూ.12.5 లక్షల వరకు వస్తుంది.
జాబ్ పొందిన వారు బెంగళూరు కాంప్లెక్స్, అంబాలా, జోధ్‌పుర్, బటిండా, ముంబయి, వైజాగ్, ఢిల్లీ, ఇందౌర్, ఘజియాబాద్ తదితర ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.400+ జీఎస్టీ చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 10 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అధికారిక వెబ్ సైట్ bel-india.in ను సందర్శించాల్సి ఉంటుంది.