iDreamPost
android-app
ios-app

చరణ్ సైకిల్ సెంటిమెంట్ రిపీట్.. గేమ్ ఛేంజర్ హిట్ పక్కా!

  • Published Nov 22, 2024 | 5:19 PM Updated Updated Nov 22, 2024 | 5:19 PM

Game Changer : నిన్న మొన్నటివరకు సోషల్ మీడియాలో సెంటిమెంట్ అంటే.. అందరికి రాజమౌళి గుర్తొచ్చాడు. ఎందుకంటే దేవరతో ఎన్టీఆర్ కొన్నేళ్లుగా వస్తున్న రాజమౌళి ప్లాప్ సెంటిమెంట్ ను బ్రేక్ చేసాడు కదా. ఇక ఇప్పుడు అది చరణ్ వంతు.అదంతా సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. కానీ ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అనడానికి అభిమానులకు ఓ పాయింట్ దొరికింది.

Game Changer : నిన్న మొన్నటివరకు సోషల్ మీడియాలో సెంటిమెంట్ అంటే.. అందరికి రాజమౌళి గుర్తొచ్చాడు. ఎందుకంటే దేవరతో ఎన్టీఆర్ కొన్నేళ్లుగా వస్తున్న రాజమౌళి ప్లాప్ సెంటిమెంట్ ను బ్రేక్ చేసాడు కదా. ఇక ఇప్పుడు అది చరణ్ వంతు.అదంతా సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. కానీ ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అనడానికి అభిమానులకు ఓ పాయింట్ దొరికింది.

  • Published Nov 22, 2024 | 5:19 PMUpdated Nov 22, 2024 | 5:19 PM
చరణ్ సైకిల్ సెంటిమెంట్ రిపీట్.. గేమ్ ఛేంజర్ హిట్ పక్కా!

కొంతమంది పైకి కనిపించరు కానీ.. సెంటిమెంట్స్ బాగానే ఫాలో అవుతూ ఉంటారు . అలా కనిపించని వారిలో హీరోలు ముందుటారు. ఇక సినిమాలలో సెంటిమెంట్స్ చాలా కామన్. ఏదైనా ఒక సినిమాలో ఓ సెంటిమెంట్ వర్కౌట్ అయితే. నెక్స్ట్ సినిమాలో కూడా అదే కంటిన్యూ అవుతుంది. నిన్న మొన్నటివరకు సోషల్ మీడియాలో సెంటిమెంట్ అంటే.. అందరికి రాజమౌళి గుర్తొచ్చాడు. ఎందుకంటే దేవరతో ఎన్టీఆర్ కొన్నేళ్లుగా వస్తున్న రాజమౌళి ప్లాప్ సెంటిమెంట్ ను బ్రేక్ చేసాడు కదా. ఇక ఇప్పుడు అది చరణ్ వంతు. చరణ్ కూడా గేమ్ ఛేంజర్ తో హిట్ కొట్టేస్తే.. ఆ సెంటిమెంట్ పూర్తిగా తుడిచిపెట్టుకు పోతుంది. అదంతా సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. కానీ ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అనడానికి అభిమానులకు ఓ పాయింట్ దొరికింది.

రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ రేంజ్ లో ఎదిగాడు. చాలా కాలం తర్వాత సోలోగా వస్తున్న మూవీ ఇది. సో సాధారణంగా అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. దీనితో అభిమానులు గేమ్ ఛేంజర్ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ను డీకోడ్ చేస్తున్నారు. ఆ మధ్య టీజర్ ను డీకోడ్ చేసి.. కథ ఇదే అని గెస్ చేశారు. ఇక ఇప్పుడు రీసెంట్ గా సినిమా రిలీజ్ కు ఇంకా 50 రోజుల టైం ఉన్నట్లు ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో రామ్ చరణ్ సైకిల్ మీద వెళ్తూ కనిపిస్తాడు. ఇప్పుడు ఈ ఒక్క ఫోటోని పట్టుకుని హిట్ పక్కా హిస్టరీ రిపీట్ అంటున్నారు అభిమానులు. ఇంతకు ఆ హిస్టరీ మరేదో కాదు.. సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ రంగస్థలం సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో చరణ్ దాదాపు సైకిల్ మీదే తిరుగుతూ కనిపిస్తాడు. ఆ మూవీ ఎంత పెద్ద హిట్ అందుకుందో తెలియనిది కాదు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ లో కూడా అదే సీన్ పెట్టారు. కాబట్టి ఈ మూవీ కూడా పెద్ద హిట్ అవుతుందని సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు ఫ్యాన్స్. ఒకవేళ అదే కనుక వర్క్ అవుట్ అయితే అభిమానులకు దానికి మించిన ఆనందం మరొకటి ఉండదు.

జనవరి 10 న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సంక్రాంతికి భారీ పోటీ ఉన్నా సరే ఇప్పటివరకు అయితే.. అందరి చూపు గేమ్ ఛేంజర్ మీదే ఉంది. ఈ సినిమాతో ఎలా అయినా సరే హిట్ కొట్టాలని అటు చరణ్ , ఇటు దర్శకుడు శంకర్ కంకణం కట్టుకుని కూర్చున్నారు. సినిమా రావడం లేట్ అయినా కానీ లేటెస్ట్ గా ఉంటూ అందరిని మెప్పిస్తే అదే చాలని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ కు ముందే భారీ బడ్జెట్ సినిమాలన్నీ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి.. టార్గెట్ కూడా చాలా క్లియర్ గా ఉంటుంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ముగించుకునే పనిలో ఉంది. అలాగే త్వరలోనే భారీ రేంజ్ లో ఈవెంట్స్ ను కూడా ప్లాన్ చేస్తుంది. టీజర్ తర్వాత ఇప్పుడిప్పుడే ఈ సినిమా మీద బజ్ ఊపందుకుంటుంది. ఇక జరగబోయే ఈవెంట్స్ , రాబోయే అప్డేట్స్ ఎలాంటి అంచనాలు క్రియేట్ చేస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbet