iDreamPost
android-app
ios-app

పుష్ప 2 టికెట్స్ రేట్స్ విషయంలో అవన్నీ ఫేక్..!

  • Published Nov 22, 2024 | 5:13 PM Updated Updated Nov 22, 2024 | 5:13 PM

Pushpa2 Ticket Cost: సోషల్ మీడియాలో రకరకాల ర్యూమర్స్ వస్తూ స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. అభిమానులు చేస్తున్న ప్రమోషన్స్ ఒక సైడ్ హైప్ పెంచుతుంటే. మరి కొన్ని పోస్ట్స్ అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. సుక్కు ఇంకా షూటింగ్ పనిలోనే ఉన్నాడు కాబట్టి.. సినిమా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందనే న్యూస్ విపరీతంగా స్ప్రెడ్ అయింది. మరో వైపు సినిమా టికెట్స్ రేట్లు పెరిగాయని. దాని వలన మిడిల్ క్లాస్ వాళ్లకు చాలా ఇబ్బంది అంటూ రకరకాల మీమ్స్ వస్తున్నాయి.

Pushpa2 Ticket Cost: సోషల్ మీడియాలో రకరకాల ర్యూమర్స్ వస్తూ స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. అభిమానులు చేస్తున్న ప్రమోషన్స్ ఒక సైడ్ హైప్ పెంచుతుంటే. మరి కొన్ని పోస్ట్స్ అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. సుక్కు ఇంకా షూటింగ్ పనిలోనే ఉన్నాడు కాబట్టి.. సినిమా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందనే న్యూస్ విపరీతంగా స్ప్రెడ్ అయింది. మరో వైపు సినిమా టికెట్స్ రేట్లు పెరిగాయని. దాని వలన మిడిల్ క్లాస్ వాళ్లకు చాలా ఇబ్బంది అంటూ రకరకాల మీమ్స్ వస్తున్నాయి.

  • Published Nov 22, 2024 | 5:13 PMUpdated Nov 22, 2024 | 5:13 PM
పుష్ప 2 టికెట్స్ రేట్స్ విషయంలో అవన్నీ ఫేక్..!

ఓ వైపు బన్నీ ప్రమోషన్స్ బాధ్యత మీద వేసుకుని.. హడావిడిగా ఆ స్టేట్ ఈ స్టేట్ అంటూ తిరుగుతున్నాడు. మరో వైపు లెక్కల మాస్టారు సినిమాకు ఇంకా కొసమెరుపులు దిద్దుతూనే ఉన్నాడు. తనతో పాటు టీం ను కూడా పరిగెత్తిస్తున్నాడు. అయినా సరే ఇవ్వాల్సిన అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాడు. కానీ ఈలోపే సోషల్ మీడియాలో రకరకాల ర్యూమర్స్ వస్తూ స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. అభిమానులు చేస్తున్న ప్రమోషన్స్ ఒక సైడ్ హైప్ పెంచుతుంటే. మరి కొన్ని పోస్ట్స్ అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. సుక్కు ఇంకా షూటింగ్ పనిలోనే ఉన్నాడు కాబట్టి.. సినిమా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందనే న్యూస్ విపరీతంగా స్ప్రెడ్ అయింది. దీనితో వీటికి చెక్ పెట్టడానికి మూవీ టీం ఒక పోస్టర్ విడుదల చేసింది. ఇక ఆ పోస్టర్ తో పుష్ప తగ్గేదే లే అంటూ డిసెంబర్ 5 కు రావడం ఖాయం అనే మాట స్పష్టమైంది.

మరో వైపు సినిమా టికెట్స్ రేట్లు పెరిగాయని. దాని వలన మిడిల్ క్లాస్ వాళ్లకు చాలా ఇబ్బంది అంటూ రకరకాల మీమ్స్ వస్తున్నాయి. అటు మేకర్స్ కూడా ఈ విషయంలో భారీ ప్లానింగ్ లో ఉన్నారనే.. ఊహాగానాలు చెక్కర్లు కొడుతున్నాయి. పుష్ప 1 విషయంలో టికెట్స్ రేట్స్ పెంచడం వర్క్ అవుట్ అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు దాని కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారనే గుస గుసలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ కేవలం సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ మాత్రమే. అటు మేకర్స్ నుంచి ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. సో దీనిలో ఏ మాత్రం వాస్తవం లేదని సమాచారం. రీసెంట్ గా వచ్చిన భారీ సినిమాల టికెట్స్ రేట్స్ లానే పుష్ప 2 రేట్స్ కూడా ఉంటాయని తెలుస్తుంది. పనికట్టుకుని కొంతమంది ఈ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నట్లు సమాచారం.

ఒకవేళ టికెట్స్ రేట్స్ విషయంలో వస్తున్న నిజం కాకపోతే మాత్రం.. ఆడియన్స్ కు పండగే. ఎందుకంటే సినిమా చూడాలని చాలా మందికి ఉన్నా సరే.. టికెట్స్ రేట్స్ చూసి ఆగిపోతూ ఉంటారు. వాస్తవానికి మల్టిప్లెక్స్ లో టికెట్ ధర ఎక్కువే. కానీ సింగిల్ స్క్రీన్ లో రేట్స్ తక్కువగా ఉంటాయి. దీనితో చాలా మంది సింగిల్ స్క్రీన్స్ లోనే సినిమా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇప్పుడు వాటి ధరలు కూడా పెంచేస్తే చాలా మంది ఇబ్బంది పడాల్సి ఉంటుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. దాదాపు మేకర్స్ కూడా టికెట్ రేట్స్ పెంచరనే అభిప్రాయ పడుతున్నారు. ఇక ఏమౌతుందో చూడాలి. టీమ్ మాత్రం మొదటి పార్ట్ కు వచ్చిన రెస్పాన్స్ ను దృష్టిలో ఉంచుకుని.. సిక్వెల్ కు సంబంధించిన ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సౌత్ లో ఎలాగూ హైప్ బాగానే ఉంటుంది.. దీనితో ఇప్పుడు నార్త్ పై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇప్పుడు అటు నార్త్ , ఇటు సౌత్ అభిమానులు పోటా పోటీగా సినిమాకు భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomvbetjojobetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetin