iDreamPost
android-app
ios-app

మహిళల కోసం LIC సూపర్ స్కీం.. రోజుకు రూ. 58 పొదుపుతో రూ.8 లక్షల లాభం

LIC Aadhaar Shila Yojana: మహిళల కోసం ఎల్ ఐసీ అద్భుతమైన స్కీమ్ ను తీసుకొచ్చింది. రోజుకు రూ. 58 పొదుపుతో ఏకంగా 8 లక్షలు అందుకోవచ్చు.

LIC Aadhaar Shila Yojana: మహిళల కోసం ఎల్ ఐసీ అద్భుతమైన స్కీమ్ ను తీసుకొచ్చింది. రోజుకు రూ. 58 పొదుపుతో ఏకంగా 8 లక్షలు అందుకోవచ్చు.

మహిళల కోసం LIC సూపర్ స్కీం.. రోజుకు రూ. 58 పొదుపుతో రూ.8 లక్షల లాభం

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా దేశ ప్రజల కోసం సరికొత్త పథకాలను తీసుకొస్తున్నది. జీవిత బీమా సంస్థగా విశేషమైన ఆదరణ పొందింది. కోట్లాది మంది కస్టమర్లతో దూసుకెళ్తున్నది. ఎల్ఐసీ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి లాభాలను పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వార్యంలో పనిచేస్తుంది కాబట్టి ఎలాంటి రిస్క్ ఉండదు. పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. గ్యారంటీ రిటర్న్స్ అందుకోవచ్చు. ఎల్ఐసీ పథకాల ద్వారా పాలసీ హోల్డర్లకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తున్నది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అందుకోవచ్చు. అయితే ఎల్ఐసీ లైఫ్ ఇన్సూరెన్స్ పథకాలతో పాటు సేవింగ్ స్కీమ్స్ ను కూడా అందిస్తున్నది. దీనిలో భాగంగా మహిళల కోసం మతిపోగొట్టే పథకాన్ని తీసుకొచ్చింది.

అదే ఎల్ఐసీ ఆధార్ శిలా యోజన. ఈ పథకంలో మహిళలు ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలను అందుకోవచ్చు. మహిళల కోసమే ప్రత్యేకంగా ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకానికి మహిళల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. మీరు కూడా పెట్టుబడి పెట్టి లాభాలను అందుకోవాలని భావిస్తే ఎల్ఐసీ ఆధార్ శిలా యోజన బెస్ట్ స్కీమ్ అంటున్నారు నిపుణులు. ఈ పథకంలో రోజుకు రూ. 58 పొదుపు చేస్తే మెచ్యూరిటీ నాటికి ఏకంగా రూ. 8 లక్షలు మీ సొంతం చేసుకోవచ్చు. ఆధార్ శిలా యోజన అనేది సేవింగ్స్-కమ్-ప్రొటెక్షన్ ప్లాన్. ఆధార్ కార్డు కలిగిన మహిళలు ఈ పాలసీలో చేరొచ్చు. 8 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయసు గల మహిళలు ఈ స్కీమ్‌లో చేరవచ్చు. ఈ స్కీమ్‌లో కనీసం రూ.75,000, గరిష్ఠంగా రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు.

ఈ స్కీమ్ కనీస మెచూరిటీ టైమ్ 10 ఏళ్లుగా ఉండగా.. గరిష్ఠ వ్యవధి 20 ఏళ్లు. మెచ్యూరిటీ సమయంలో పెట్టుబడి మొత్తాన్ని, బోనస్‌‌తో కలిపి తిరిగి చెల్లిస్తుంది. బోనస్ ఏడాదికి 4.5 శాతం వడ్డీ రేటు ఆధారంగా లెక్కిస్తారు. ఎల్ఐసీ ప్రవేశపెట్టిన ఆధార్ శిలా యోజన పథకంలో 30 ఏళ్ల వయసు ఉన్న మహిళ 20 ఏళ్ల పాటు రోజుకు రూ.58 పెట్టుబడి పెడితే.. అప్పుడు మీ మొదటి సంవత్సరంలో మొత్తం రూ. 20,880 డిపాజిట్ చేయబడుతుంది. ఆ తర్వాత రెండో సంవత్సరంలో మీరు రూ. 21,446 చెల్లించాలి. ఈ విధంగా, మీరు ఈ ప్రీమియాన్ని నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం లేదా వార్షిక ప్రాతిపదికన జమ చేస్తారు. మీరు ప్రతి సంవత్సరం ప్రీమియం చెల్లిస్తే 20 సంవత్సరాలకు రూ. 4,29,392 డిపాజిట్ చేస్తారు. మెచ్యూరిటీ సమయంలో మీరు మొత్తం రూ. 7,94,000 చేతికి వస్తాయి. ఎల్ఐసీ ఆధార్ శిలా యోజన పథకం పూర్తి వివరాల కోసం ఎల్ఐసీ అధికారిక వెబ్ సైట్ లేదా సమీప బ్రాంచ్ ను సంప్రదించాల్సి ఉంటుంది.