iDreamPost
android-app
ios-app

అమరన్ కు అనుకోని కష్టం.. రూ.కోటి ఇవ్వాలంటూ స్టూడెంట్ డిమాండ్

  • Published Nov 22, 2024 | 5:09 PM Updated Updated Nov 22, 2024 | 5:09 PM

Amaran Movie: రీసెంట్ గా అమరన్ రూ.300 కోట్ల పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానిపై చాలా రకాల కాంట్రవర్సీలు కూడా నడిచాయి. రిలీజ్ కు ముందు సాయి పల్లవి ఫోటో వాడారని.. కానీ సక్సెస్ తర్వాత మాత్రం పట్టించుకోవడం లేదని ట్రోల్ చేశారు. కానీ చివరకు అది ఫ్యాన్ మేడ్ పోస్టర్ అని తెలియడంతో.. సైలెంట్ అయ్యారు. ఇక ఇప్పుడు అమరన్ కు  మరో కష్టం వచ్చి పడింది.

Amaran Movie: రీసెంట్ గా అమరన్ రూ.300 కోట్ల పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానిపై చాలా రకాల కాంట్రవర్సీలు కూడా నడిచాయి. రిలీజ్ కు ముందు సాయి పల్లవి ఫోటో వాడారని.. కానీ సక్సెస్ తర్వాత మాత్రం పట్టించుకోవడం లేదని ట్రోల్ చేశారు. కానీ చివరకు అది ఫ్యాన్ మేడ్ పోస్టర్ అని తెలియడంతో.. సైలెంట్ అయ్యారు. ఇక ఇప్పుడు అమరన్ కు  మరో కష్టం వచ్చి పడింది.

  • Published Nov 22, 2024 | 5:09 PMUpdated Nov 22, 2024 | 5:09 PM
అమరన్ కు అనుకోని కష్టం.. రూ.కోటి ఇవ్వాలంటూ స్టూడెంట్ డిమాండ్

మేజర్ ముకుంద్ వరదరాజన్ లైఫ్ స్టోరీకి అద్దం పట్టిన అమరన్ సినిమాకు.. ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.సాయి పల్లవి , శివ కార్తికేయన్ కు ఈ సినిమా మంచి సక్సెస్ ను తీసుకుని వచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికే మూడు వారాలు కంప్లీట్ అయింది. అయినా సరే ఇంకా డీసెంట్ వసూళ్లను రాబడుతూనే ఉంది. సినిమా రిలీజ్ అయిన సమయంలో రూ.100 కోట్లు రాబడితే చాలా గొప్ప విషయం అని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా రాబట్టింది. ఇక మూవీ లాంగ్ రన్ లో మరో 50 నుంచి 100 కోట్ల వరకు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికి కూడా ఈ సినిమా ఎదో ఒక విధంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇక రీసెంట్ గా రూ.300 కోట్ల పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానిపై చాలా రకాల కాంట్రవర్సీలు కూడా నడిచాయి. రిలీజ్ కు ముందు సాయి పల్లవి ఫోటో వాడారని.. కానీ సక్సెస్ తర్వాత మాత్రం పట్టించుకోవడం లేదని ట్రోల్ చేశారు. కానీ చివరకు అది ఫ్యాన్ మేడ్ పోస్టర్ అని తెలియడంతో.. సైలెంట్ అయ్యారు.

ఇక ఇప్పుడు అమరన్ కు  మరో కష్టం వచ్చి పడింది. ఈ సినిమా వలన తన ప్రైవసీ దెబ్బ తిందంటూ.. ఓ స్టూడెంట్ అమరన్ టీం ను కోటి రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ విషయం అమరన్ టీం సభ్యులకు పెద్ద తలనొప్పిగా మారిందని సమాచారం. అసలు మ్యాటర్ ఏంటంటే.. అమరన్ సినిమా కథలో ఓ ఫోన్ నెంబర్ ను చెప్తారు. ఆ ఫోన్ నెంబర్ ఏ ఇప్పుడు మూవీ టీమ్ కు ఈ తంటాలు తెచ్చిపెట్టింది. ఆ ఫోన్ నెంబర్ ఓ ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్ దని తెలుస్తుంది. సినిమా రిలీజ్ అయిన దగ్గరనుంచి ప్రతి రోజు అతనికి చాలా కాల్స్ వచ్చేవట. దీనితో తన సమయం వృధా అవుతుందని.. దానితో పాటు తన ప్రైవసీ దెబ్బ తింటుందని ఆ స్టూడెంట్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికే మూవీ టీమ్ కు లీగల్ నోటీసులు పంపాడట ఆ స్టూడెంట్. తనకు ఎలా అయినా న్యాయం చేయాల్సిందేనని.. నష్టపరిహారంగా రూ.కోటి చెల్లించాలని ఆ స్టూడెంట్ తెలియజేశాడు. అయితే అమరన్ మేకర్స్ నుంచి మాత్రం ఈ విషయం గురించి ఎలాంటి స్పందన లేదు.

ధారణంగా ఫోన్ నెంబర్స్ వాడే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం కాస్త పొరపాటు జరగడంతో విషయం ఇంతవరకు వచ్చింది. మరి ఈ వివాదం ఎంత వరకు దారి తీస్తుంది.. అతను కోరినట్లుగా అమరన్ మేకర్స్ నష్టపరిహారం చెల్లిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఇలాంటి ఓ వివాదం తెరపైకి రావడం ఇదే మొదటి సారెమో. సోషల్ మీడియాలో కూడా ఈ మ్యాటర్ పై డిస్కషన్ జరుగుతుంది. అమరన్ సినిమా మాత్రం యూత్ తో పాటు అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా బాగా మెప్పించింది .ఇక థియేట్రికల్ ఎండ్ లోపు ఎంత కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobetjojobet girişJojobet Casino Sitesicasibomjojobetmarsbahis