iDreamPost
android-app
ios-app

పుష్ప 2 విడుదలకు ముందే AP లో బన్నీ అరుదైన రికార్డ్

  • Published Nov 22, 2024 | 5:13 PM Updated Updated Nov 22, 2024 | 5:13 PM

Pushpa 2 Update: ఇప్పుడు అల్లు అర్జున్ కు వరల్డ్ వైడ్ గా ఉన్న ఫాలోయింగ్ కి.. ఒక్కొక్కరికి దిమ్మ తిరిగిపోతుంది. రీసెంట్ గా బీహార్ లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అది క్లియర్ గా కనిపించింది.తెలుగు స్టేట్స్ లో అంటే సరే అనుకోవచ్చు. కానీ అక్కడ అంత మంది జనం వచ్చారంటే అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. దీనితో ఇప్పుడు నార్త్ ఇండియా మొత్తం కూడా పుష్ప 2 గురించి రచ్చ జరుగుతుంది.ఇక ఇప్పుడు పుష్పరాజ్ ఏపీ లో సరికొత్త రికార్డ్ సృష్టించడానికి రెడీ అవుతున్నాడు.

Pushpa 2 Update: ఇప్పుడు అల్లు అర్జున్ కు వరల్డ్ వైడ్ గా ఉన్న ఫాలోయింగ్ కి.. ఒక్కొక్కరికి దిమ్మ తిరిగిపోతుంది. రీసెంట్ గా బీహార్ లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అది క్లియర్ గా కనిపించింది.తెలుగు స్టేట్స్ లో అంటే సరే అనుకోవచ్చు. కానీ అక్కడ అంత మంది జనం వచ్చారంటే అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. దీనితో ఇప్పుడు నార్త్ ఇండియా మొత్తం కూడా పుష్ప 2 గురించి రచ్చ జరుగుతుంది.ఇక ఇప్పుడు పుష్పరాజ్ ఏపీ లో సరికొత్త రికార్డ్ సృష్టించడానికి రెడీ అవుతున్నాడు.

  • Published Nov 22, 2024 | 5:13 PMUpdated Nov 22, 2024 | 5:13 PM
పుష్ప 2 విడుదలకు ముందే AP లో బన్నీ అరుదైన రికార్డ్

పుష్పరాజ్ ఆగమనానికి టైం దగ్గరపడింది. డిసెంబర్ 5 ఎక్కడ చూసినా పుష్ప పేరు మోతమోగిపోయే వైబ్స్ కనిపిస్తున్నాయి. పుష్ప 2 పోస్ట్ పోన్ అంటూ వస్తున్న వార్తలకు కూడా తాజాగా చెక్ పెట్టారు మేకర్స్. పుష్పరాజ్ తగ్గేదెలే అంటుంటే మేకర్స్ అసలు తగ్గేదే లే అంటూ.. మూవీపై నమ్మకాన్ని పెంచుతున్నారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉన్న మాట వాస్తవమే. కానీ చెప్పిన టైం కి చెప్పినట్లుగా సినిమా రిలీజ్ చేసే బాధ్యత సుక్కు దే. అందుకే ఏ ఈవెంట్స్ కు అటెండ్ అవ్వకుండా చాలా డెడికేటెడ్ గా, పకడ్బందీగా ఫినిషింగ్ వర్క్స్ చేస్తున్నాడు సుక్కు. వారం రోజులలోపే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కు వరల్డ్ వైడ్ గా ఉన్న ఫాలోయింగ్ కి.. ఒక్కొక్కరికి దిమ్మ తిరిగిపోతుంది. రీసెంట్ గా బీహార్ లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అది క్లియర్ గా కనిపించింది.

ఆ ఈవెంట్ కు ఏకంగా రెండున్నర లక్షల మంది అటెండ్ అయ్యారట. తెలుగు స్టేట్స్ లో అంటే సరే అనుకోవచ్చు. కానీ అక్కడ అంత మంది జనం వచ్చారంటే అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. దీనితో ఇప్పుడు నార్త్ ఇండియా మొత్తం కూడా పుష్ప 2 గురించి రచ్చ జరుగుతుంది. అసలు ఈ క్రేజ్ ఏంటి సామి అనుకుంటూ అంతా ముక్కు మీద వేలువేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు పుష్పరాజ్ ఏపీ లో సరికొత్త రికార్డ్ సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. కలెక్షన్స్ అవన్నీ సినిమా రిలీజ్ తర్వాత వచ్చే రికార్డ్స్ . ఇప్పుడు సృష్టించేది ఏ హీరోకి దక్కని రేర్ రికార్డ్. ఎపిలో అల్లు అర్జున్ కు అతి పెద్ద కటౌట్ పెట్టబోతున్నారు. ఇది చాలా అరుదైన గౌరవం అని చెప్పి తీరాల్సిందే. ఏకంగా 108 అడుగుల ఎత్తు ఉండే కటౌట్ ను ఫ్యాన్స్ నెలకొల్పబోతున్నారు. ఇప్పటివరకు ఎపిలో ఈ రేంజ్ కటౌట్ ను ఎవరు ఏర్పాటు చేయలేదని సమాచారం. 108 అడుగుల ఎత్తు , 16 అడుగుల వెడల్పు గల బన్నీ కటౌట్ ను.. వైజాగ్‌లోని సంగం శరత్‌ థియేటర్‌ వద్ద అభిమానులు ఏర్పాటు చేస్తున్నారు. సినిమా రిలీజ్ కు ఒక 10 రోజుల ముందు నుంచే సంగం థియేటర్ దగ్గర ఈ కటౌట్ ప్రత్యేక్షం కానుందట.

అలాగే చెన్నైలో జరిగే ఈవెంట్ కు సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఈవెంట్ లో ఐటెం సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఆ తర్వాత తెలుగు స్టేట్స్ లో కూడా పలు ఈవెంట్స్ , ఇంటర్వ్యూ లను ప్లాన్ చేసింది పుష్ప టీం. ఎంత సినిమా షూట్ కంప్లీట్ అవ్వకపోయినా కానీ.. ఈవెంట్స్ విషయంలో మాత్రం తగ్గేదే లే అంటూ దూసుకుపోతుంది. ఇక సినిమా కనుక బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకుంటే.. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరిగిన అన్ని ప్లేసెస్ లో సక్సెస్ మీట్ జరిగినా ఆశ్చర్యం లేదు. ఇక రిలీజ్ తర్వాత పుష్ప 2 మూవీ ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom