iDreamPost
android-app
ios-app

17 ఏళ్ళ తర్వాత ఆ స్టార్ హీరోయిన్ తో రాజాసాబ్

  • Published Nov 22, 2024 | 1:26 PM Updated Updated Nov 22, 2024 | 1:26 PM

Rajasaab Movie Updates: సాధారణంగా స్పెషల్ సాంగ్స్ అంటే ఇప్పుడు ట్రెండ్ లో ఉన్న యంగ్ హీరోయిన్స్ ను సెలెక్ట్ చేయాలనీ చూస్తూ ఉంటారు మేకర్స్. కానీ రాజాసాబ్ మేకర్స్ మాత్రం కాస్త వెనక్కు వెళ్ళి 17 క్రితం ప్రభాస్ కు జోడిగా నటించిన హీరోయిన్ ను రంగంలోకి దించుతున్నారు. ఆ హీరోయిన్ ఎవరో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే. ఈ కాంబో అసలు ఎవరు ఊహించి ఉండరు.

Rajasaab Movie Updates: సాధారణంగా స్పెషల్ సాంగ్స్ అంటే ఇప్పుడు ట్రెండ్ లో ఉన్న యంగ్ హీరోయిన్స్ ను సెలెక్ట్ చేయాలనీ చూస్తూ ఉంటారు మేకర్స్. కానీ రాజాసాబ్ మేకర్స్ మాత్రం కాస్త వెనక్కు వెళ్ళి 17 క్రితం ప్రభాస్ కు జోడిగా నటించిన హీరోయిన్ ను రంగంలోకి దించుతున్నారు. ఆ హీరోయిన్ ఎవరో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే. ఈ కాంబో అసలు ఎవరు ఊహించి ఉండరు.

  • Published Nov 22, 2024 | 1:26 PMUpdated Nov 22, 2024 | 1:26 PM
17 ఏళ్ళ తర్వాత ఆ స్టార్ హీరోయిన్  తో రాజాసాబ్

రెబెల్ స్టార్ ప్రభాస్ లైన్ అప్ గురించి అంతా కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. వీటిలో ముందుగా రిలీజ్ కు రెడీగా ఉన్న మూవీ ‘ది రాజా సాబ్’. ఈ సినిమా మీద అందరికి చాలానే అంచనాలు ఉన్నాయి. మునుపెన్నడూ చూడని విధంగా ప్రభాస్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. రొమాంటిక్ హర్రర్ టచ్ జోనర్ లో ఈ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలు.. వాటిలో ఒకటి రీమిక్స్ సాంగ్ కూడా ఉంటుందని తెలిపారు. అయితే ఆ సాంగ్స్ లిస్ట్ లో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందంట. దానికోసం ఓ స్టార్ హీరోయిన్ ను దించే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఆ హీరోయిన్ ఎవరో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే. ఈ కాంబో అసలు ఎవరు ఊహించి ఉండరు. సాధారణంగా స్పెషల్ సాంగ్స్ అంటే ఇప్పుడు ట్రెండ్ లో ఉన్న యంగ్ హీరోయిన్స్ ను సెలెక్ట్ చేయాలనీ చూస్తూ ఉంటారు మేకర్స్. కానీ రాజాసాబ్ మేకర్స్ మాత్రం కాస్త వెనక్కు వెళ్ళి 17 క్రితం ప్రభాస్ కు జోడిగా నటించిన హీరోయిన్ ను రంగంలోకి దించుతున్నారు.

ఆ హీరోయిన్ మరెవరో కాదు. 40 ఏళ్ళు వచ్చినా ఇప్పటికి డిమాండ్ ఏమి తగ్గని నయనతార. ప్రస్తుతం నయన తార చేతిలో అర డజన్ కు పైగా సినిమాలు ఉన్నాయి. స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ అయితే నయన తార బావుంటుందని అనుకుంటున్నారట. కానీ ఇప్పుడు ఆమెకు వరుసగా లీడ్ రోల్స్ లోనే ఆఫర్స్ వస్తున్నాయి. అలాంటిది స్పెషల్ సాంగ్ చేయడానికి నయన్ ఒప్పుకుంటుందా లేదా అనేది అందరికి అనుమానంగా ఉంది. ప్రభాస్ , నయన్ కాంబో చూసేందుకు ఎలా ఉంటుందో ఆల్రెడీ యోగి సినిమాలో అంతా చూశారు. అయితే గతంలో మారుతి డైరెక్షన్ లో ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ మ్యాటర్ లో.. నయన్ నో చెప్పిందట. మరి అలాంటిది ఇప్పుడు రాజాసాబ్ కు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా! అంటే ఎవరికీ నమ్మశక్యం కావడం లేదు. ప్రస్తుతానికైతే స్పెషల్ సాంగ్ కోసం నయన్ ను కన్సిడర్ చేస్తున్నట్లు ఓ రూమర్ వినిపిస్తుంది. మరి మేకర్స్ దీనిని ఎంత వరకు నిజం చేస్తారన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ కాంబో కనుక వర్కౌట్ అయితే వింటేజ్ పెయిర్ ను మరోసారి ప్రేక్షకులు ఎక్స్పీరియెన్స్ చేసే ఛాన్స్ ఉంది.

ఇప్పటికే రాజాసాబ్ లో ప్రభాస్ లుక్స్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. పాన్ ఇండియా గ్లిమ్ప్స్ , మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సంక్రాంతికి ఫస్ట్ సింగల్ ను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందట. ఇక ఇది చిన్న సినిమా కాదని.. ఎవరు ఊహించని విధంగా ఉంటుందని నిర్మాత తెలిపారు. దీనితో ఈ సినిమా మీద భారీగా అంచనాలు పెరిగిపోయాయి. కథ , కథనం , VFX అన్ని కూడా భారీగా ఉంటాయని తెలిపారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే మాత్రం ఏప్రిల్ 10 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తెలుగు, హిందీ , తమిళం , మలయాళం , కన్నడ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss