iDreamPost

Thalapathy Vijay: దళపతి విజయ్ దాతృత్వం.. వరద బాధితులకు ఆర్థిక సాయం

ఇటీవల తమిళనాడుకు తుఫాన్, వర్షాలు కుదిపేశాయి. జన జీవనం అస్తవ్యస్థమైంది. అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఆస్థి, ప్రాణ నష్టం వాటిల్లింది. అయితే ఈ ఘటనకు చలించిపోయి.. అనేక మంది సినీ తారలు ఆర్థిక సాయాన్ని అందించారు. అయితే స్వయంగా రంగంలోకి దిగాడు దళపతి విజయ్

ఇటీవల తమిళనాడుకు తుఫాన్, వర్షాలు కుదిపేశాయి. జన జీవనం అస్తవ్యస్థమైంది. అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఆస్థి, ప్రాణ నష్టం వాటిల్లింది. అయితే ఈ ఘటనకు చలించిపోయి.. అనేక మంది సినీ తారలు ఆర్థిక సాయాన్ని అందించారు. అయితే స్వయంగా రంగంలోకి దిగాడు దళపతి విజయ్

Thalapathy Vijay: దళపతి విజయ్ దాతృత్వం.. వరద బాధితులకు ఆర్థిక సాయం

వెండితెరపై తమ నటనతో అలరించే హీరోలు.. నిజ జీవితంలో కూడా సామాజిక సేవ చేస్తూ రియల్ హీరోలు అవుతున్నారు. దాతృత్వాలు చేస్తూ అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటూ ఉంటారు. సాయం చేయడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు కోలీవుడ్ స్టార్స్. తమిళనాడులో ఏదైనా విపత్తు రానీ, రాష్ట్ర ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినా స్పందిస్తూ తగినంత సాయం చేస్తుంటారు. తాజాగా డిసెంబర్‌లో తమిళనాడును వర్షాలు, వరదలు ముంచెత్తాయి. మిచౌంగ్ తుఫాన్ దాటికి చెన్నైతో పాటు పలు ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం అస్తవ్యస్థమైంది. అలాగే ఇటీవల కురిసిన వర్షాలకు తూత్తుకుడి, తిరునల్వేలి, కన్యాకుమారి, తెన్ కాశీ బాగా ఎఫెక్ట్ అయ్యాయి.

ఆ వర్షాలతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్న కుటుంబాలకు ఈ రోజు ఆర్థిక సాయాన్ని అందించారు ఇళయ దళపతి విజయ్. తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాల నుండి 800 కుటుంబాలకు చెందిన సహాయ సామాగ్రిని అందించారు. నెల్లై వరదల్లో ప్రజల జీవనోపాధిపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఎంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు చూసి చలించిపోయిన విజయ్.. బాధితులకు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. విజయ్ తన అభిమానుల సంఘం (విజయ్ మక్కల్ ఇయక్కం) ద్వారా ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేశారు. తుఫాన్ కారణంగా ఇళ్లు కోల్పోయిన వ్యక్తులకు రూ. 10వేల నుండి రూ. 50 వేల వరకు అందించారు.

బాధితులందరితో చాలా చక్కగా మాట్లాడుతూ.. వారికి సామాగ్రి అందజేశారు విజయ్. అడిగిన వారికి కాదనకుండా సెల్ఫీలు ఇచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన సేవ నెట్టింట్లో వైరల్ అవుతుంది. సాయం పొందిన వాళ్లు సైతం ఆయనకు చేతులెత్తి మొక్కుతున్నాడు. ఇది చూస్తే నిజంగా అతడు ఎంత డౌన్ టు ఎర్త్ పర్సనో అర్థమౌతుంది. విజయ్ సామాజిక సేవ చేయడం ఇప్పుడేమీ కొత్త కాదూ.. గతంలో అనేక విద్యా సంస్థలకు సాయం చేశారు. మరణించిన రైతు కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందజేశారు. అలాగే ఈ ఏడాది 10,12 తరగతుల్లో టాప్ వచ్చిన విద్యార్ధులకు సత్కరించిన విషయం తెలిసిందే. మరీ విజయ్ చేస్తున్న ఈ సేవా గుణం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి