iDreamPost

అత్యంత విషమంగా విజయ్​కాంత్ ఆరోగ్యం.. డాక్టర్లు ఇచ్చిన రిపోర్టు ఇదే..!

  • Author singhj Updated - 09:17 PM, Wed - 29 November 23

తమిళ స్టార్ యాక్టర్, పొలిటీషియన్ విజయ్​కాంత్ ఆరోగ్యంపై ఆయనకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రి ఒక బులెటిన్ విడుదల చేసింది. డాక్టర్లు ఇచ్చిన రిపోర్టులో ఏముందంటే..!

తమిళ స్టార్ యాక్టర్, పొలిటీషియన్ విజయ్​కాంత్ ఆరోగ్యంపై ఆయనకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రి ఒక బులెటిన్ విడుదల చేసింది. డాక్టర్లు ఇచ్చిన రిపోర్టులో ఏముందంటే..!

  • Author singhj Updated - 09:17 PM, Wed - 29 November 23
అత్యంత విషమంగా విజయ్​కాంత్ ఆరోగ్యం.. డాక్టర్లు ఇచ్చిన రిపోర్టు ఇదే..!

ప్రముఖ నటుడు విజయ్​కాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. యాక్టర్​గా ఎంతో పేరు గడించిన ఆయన.. డీఎండీకే అధినేతగా రాజకీయాల్లోనూ యాక్టివ్​గా ఉన్నారు. పలు హిట్ ఫిల్మ్స్ ద్వారా తమిళంతో పాటు తెలుగులోనూ ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. పవర్​ఫుల్ యాక్టింగ్​తో అందర్నీ అలరించిన విజయ్​కాంత్ హెల్త్ కండీషన్ సరిగ్గా లేదని మళ్లీ వార్తలు తెరమీదకు వచ్చాయి. ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని సోషల్ మీడియాలోనూ న్యూస్ వచ్చింది. దీంతో ఈ హీరో అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆందోళన చెందుతున్నారు. విజయ్​కాంత్​కు ఏమైందని అందరూ టెన్షన్ పడుతున్నారు.

అనారోగ్యంతో బాధపడుతున్న విజయ్​కాంత్ నవంబర్ 18 తేదీన చెన్నైలోని మయత్ ఆస్పత్రిలో చేరారు. దగ్గు, జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్న ఆయనకు సాధారణ వైద్య పరీక్షల కోసమే తీసుకొచ్చామని డీఎండీకే నాయకులు అప్పట్లో తెలిపారు. అయితే సుమారు 10 రోజుల నుంచి ఆయన అక్కడే ట్రీట్​మెంట్ పొందుతున్నారు. ఈ విషయంపై వాళ్లు ఓ పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేశారు. విజయ్​కాంత్ సాధారణ హెల్త్ టెస్టుల కోసమే హాస్పిటల్​కు వెళ్లారని.. ఒకట్రెండు రోజుల్లో ఇంటికి తిరగొస్తారని చెప్పారు. ఎలాంటి వదంతులను నమ్మొద్దని ఆయన సన్నిహితులు తెలిపారు. కానీ విజయ్​కాంత్​కు ఇప్పటికీ హాస్పిటల్​లోనే చికిత్స అందిస్తుండటంతో ఫ్యాన్స్​లో అనుమానం పెరిగిపోయింది.

విజయ్​కాంత్ ఇంకా ఆస్పత్రితోనే ఉండటంతో డాక్టర్లు ఏమైనా దాస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై మయత్ హాస్పిటల్ డాక్టర్లు బులెటిన్ రిలీజ్ చేశారు. విజయ్​కాంత్ ఆరోగ్యం మెరుగుపడిందని అందులో తెలిపారు. నిన్నటిదాకా ఆయన బాగానే ఉన్నారని.. కానీ 24 గంటల నుంచి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా లేదని తెలిపారు. ప్రస్తుతం ఆయనకు పల్మనరీ చికిత్స అందిస్తున్నామని మయత్ ఆస్పత్రి డాక్టర్లు బులెటిన్​లో తెలిపారు. విజయ్​కాంత్ త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నామని చెప్పుకొచ్చారు. డాక్టర్ల సూచన ప్రకారం మరో 14 రోజులు ఆస్పత్రిలో ఆయనకు నిరంతరం చికిత్స అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

కాగా, లివర్ సమస్యతో బాధపడుతున్న విజయ్​కాంత్​కు ప్రత్యేక వైద్యుల బృందం చికిత్స అందిస్తోందట. డయాబెటిస్ కారణంగా ఇప్పటికే ఆయన మూడు వేళ్లను డాక్టర్లు తొలగించారని తెలుస్తోంది. ఇక, విజయ్​కాంత్ నటించిన సినిమాలు తెలుగు, కన్నడ భాషల్లో డబ్ అయి మంచి పేరు తెచ్చుకున్నాయి. ఆయన యాక్ట్ చేసిన ‘కెప్టెన్ ప్రభాకర్’ చిత్రం సంచలన విజయం నమోదు చేసింది. అయితే నటుడిగా తిరుగులేని ఇమేజ్​ను సొంతం చేసుకున్న ఆయన.. డీఎండీకే అనే పార్టీని స్థాపించి 2006, 2011లో రెండుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు.

ఇదీ చదవండి: రేషన్ కార్డు దారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి