iDreamPost

Vijayakanth: నల్లగా ఉన్నాడని అవకాశాలు రాని విజయకాంత్.. ఏడాదిలో 18 చిత్రాలతో రికార్డు!

తమిళ సీనియర్ నటుడు, డీఎండీకె అధినేత విజయ్ కాంత్ అనారోగ్య సమస్యలతో గురువారం ఉదయం చెన్నైలోని ఆసుపత్రిలో కన్నుమూశారు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన ఆయన.. ఆ తర్వాత వరుస హిట్ మూవీలతో టాప్ హీరోగా ఎదిగారు.

తమిళ సీనియర్ నటుడు, డీఎండీకె అధినేత విజయ్ కాంత్ అనారోగ్య సమస్యలతో గురువారం ఉదయం చెన్నైలోని ఆసుపత్రిలో కన్నుమూశారు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన ఆయన.. ఆ తర్వాత వరుస హిట్ మూవీలతో టాప్ హీరోగా ఎదిగారు.

Vijayakanth: నల్లగా ఉన్నాడని అవకాశాలు రాని  విజయకాంత్.. ఏడాదిలో 18 చిత్రాలతో రికార్డు!

తమిళ టాప్ స్టార్.. దేశీయ ముర్పొక్కు ద్రావిడ కళగం (డీఎండీకె) అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ కరోనాతో గురువారం ఉదయం కన్నుమూసిన సంగతి విదితమే. ఇటీవలే తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆయన.. కోలుకుని ఇంటికి చేరుకున్నారు. అంతలోనే మళ్లీ కరోనా ఎటాక్ అయ్యి.. చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో కోలీవుడ్ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. టాలీవుడ్ ప్రముఖులు సైతం ఆయనకు సంతాపం వ్యక్తం చేశారు. అయితే విజయ్ కాంత్ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు వారికి సుపరిచితమే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి టాప్ స్టార్ అయ్యారు.

విజయ్ కాంత్ అసలు పేరు నారాయణన్ విజయ్ రాజ్ అళగర స్వామి. ఆయన 1952 ఆగస్టు 25న తమిళనాడులోని మధురై జిల్లా తిరుమంగళంలో జన్మించారు. ఆయన తండ్రి అళగర స్వామి రైస్ మిల్లు యజమాని. విజయ్ కాంత్ బాగా చదువుకోవాలని తండ్రి ఆశిస్తే.. అతడికి మాత్రం సినిమాల్లో నటించాలని కోరిక ఉండేది. ఎంజీఆర్ సినిమాలను చూసి పెరిగిన ఆయన.. అతడిలా వెండితెరపై స్టార్ అవ్వాలని అనుకున్నాడు. ఇక ఈ ప్రయత్నాల్లో భాగంగా మధురై నుండి చెన్నైకి మకాం మార్చారు విజయ్. ఇక సినిమా అవకాశాల కోసం విశ్వ ప్రయత్నాలు చేశారట. అయితే శరీరం నల్లగా ఉండటంతో నువ్వు యాక్టర్ అవుతావా అంటూ తనను రిజెక్ట్ చేసినట్లు పలు మార్లు ఇంటర్వ్యూల్లో చెప్పారు కెప్టెన్.

వరుస ప్రయత్నాలు తర్వాత 1979లో ఇనిక్కమ్ ఇళమైతో సినిమాల్లోకి వచ్చారు. అప్పుడు రజనీ కాంత్ హవా నడుస్తుండటంతో.. విజయ్ రాజ్ కాస్తా.. విజయ్ కాంత్‌గా మార్చేశారు ఆ సినిమా దర్శకుడు. కొన్ని సినిమాలు బోల్తా కొట్టిన.. ఆ తర్వాత వచ్చిన దూరతు ఇడి ముళక్కం, సత్తం ఓరు ఇరుత్తర్లై వంటి పలు సినిమాలు హిట్ కొట్టడంతో అక్కడి నుండి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు ఆయనకు. వరుస హిట్లతో కోలీవుడ్ టాప్ హీరోగా మారిపోయారు. ఇక తెలుగు వారికి కూడా డబ్బింగ్ సినిమాలతో సుపరిచితమయ్యారు. కెప్టెన్ ప్రభాకర్ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

అయితే ఈయనకు తెలుగు మూలాలతో సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. తండ్రి, తాతలు ఏపీ నుండి తమిళనాడుకు వలస వెళ్లారని తెలుస్తోంది. ఇక ఆయన చేసిన సినిమాలను మన టాప్ హీరోలైన చిరంజీవి, వెంకటేశ్ రీమేక్ చేసి హిట్లు కొట్టారు. 1984లో సినిమాల్లో నటించి రికార్డు నెలకొల్పారు. మొత్తం 150 చిత్రాల్లో నటించారు. విజయ్ కాంత్ ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005లో డీఎండీకె స్థాపించారు. ఆయన సినిమాలు చూసి ఉంటే.. మీకు ఏ మూవీ ఇష్టమో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి