iDreamPost

సలార్ చుట్టూ ఎన్నో చిక్కుముడులు

సలార్ చుట్టూ ఎన్నో చిక్కుముడులు

కెజిఎఫ్ లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ మీద మాములు అంచనాలు లేవు. అందులోనూ ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్ కావడంతో ఇంకా బిజినెస్ మొదలుకాకుండానే ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పర్యవేక్షించిన నిర్మాత విజయ్ కిర్గన్ దూర్ తమ బ్యానర్ లో వచ్చిన అన్ని రికార్డులను ఇది బ్రేక్ చేస్తుందని, యాక్షన్ కంటెంట్ ఎక్స్ ట్రాడినరీగా వచ్చిందని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ సలార్ రెండు భాగాల్లో రాబోతోంది. దానికి తగ్గట్టే నీల్ అందుకు సరిపడా షూటింగ్ ముందే చేస్తున్నారు.

ఇక్కడ కొన్ని చిక్కులు లేకపోలేదు. సలార్ విడుదల తేదీ వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 28 ఆల్రెడీ ఫిక్స్ చేశారు. అయితే ఆది పురుష్ జనవరి వచ్చే తీరుతుందన్న నమ్మకంతో అలా డిసైడ్ అయ్యారు. తీరా చూస్తే అది జూన్ కు వాయిదా పడింది. అప్పుడైనా మాటకు కట్టుబడి ఉంటుందన్న గ్యారెంటీ లేదు. ఒకవేళ వస్తే సలార్ ని కొంచెం లేట్ గా తీసుకురావాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభాస్ రేంజ్ హీరో కేవలం నాలుగు నెలల గ్యాప్ తో రావడం ఫ్యాన్స్ కి ఓకే కానీ మార్కెట్ పరంగా అంత సేఫ్ కాదు. ఒకవేళ ఆది పురుష్ తప్పుకుంటే ఏ గొడవా ఉండదు. లేదంటే సలార్ కు మళ్ళీ ఏ 2024 జనవరినో సెట్ చేయాల్సి ఉంటుంది. కానీ భారీ కాంపిటీషన్ తప్పదు

సలార్ లో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ప్రభాస్ డ్యూయల్ రోల్ అనే లీక్ చక్కర్లు కొడుతోంది కానీ యూనిట్ బయటికి చెప్పడం లేదు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రికి జగపతిబాబు, కొడుక్కి పృథ్విరాజ్ సుకుమారన్ విలన్లుగా ఉంటారనే న్యూస్ కూడా ప్రచారంలో ఉంది. అదే నిజమైతే తెరమీద రచ్చ ఓ రేంజ్ లో ఉంటుంది. గ్యాంగ్ స్టర్ డ్రామానే అయినప్పటికీ ప్రశాంత్ నీల్ కొత్త సెటప్ తో అలరించబోతున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కెజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతానికి రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదు కానీ పైన చెప్పినట్టు ఈ చిక్కుముడులన్నీ విప్పితే కానీ క్లారిటీ రాదు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి