iDreamPost

‘ఖుషి’ కాదు.. నష్టాలే! తప్పిన విజయ్ దేవరకొండ లెక్క!

  • Author singhj Published - 05:26 PM, Sat - 9 September 23
  • Author singhj Published - 05:26 PM, Sat - 9 September 23
‘ఖుషి’ కాదు.. నష్టాలే! తప్పిన విజయ్ దేవరకొండ లెక్క!

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలుగా వెలిగిపోవాలని, స్టార్​డమ్​ను సొంతం చేసుకోవాలని ఎంతో మంది కోరుకుంటారు. ఈ క్రమంలో పలు సినిమాలతో ఆడియెన్స్ ముందుకు వస్తారు. కానీ ప్రేక్షకులు మాత్రం కొందర్ని మాత్రమే స్టార్లను చేస్తారు. అలా తక్కువ చిత్రాలతో విపరీతమైన ప్రేక్షకాదరణ, స్టార్​డమ్ పొందిన వారిలో ఒకరు విజయ్ దేవరకొండ. అంతలా టాలీవుడ్​లో ఈ యంగ్ హీరో తన ప్రభావాన్ని చూపిస్తున్నారు. కెరీర్ బిగినింగ్​లో ‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’, ‘ట్యాక్సీవాలా’తో వరుస సక్సెస్​లు అందుకొని స్టార్ హీరో అయిపోయారు విజయ్. కానీ ఆ తర్వాత మాత్రం ఆయన రేసులో వెనుకబడిపోయారు. అయితే సరైన హిట్లు పడనప్పటికీ రౌడీస్టార్ క్రేజ్​ ఇసుమంతైనా తగ్గకపోవడం గమనార్హం.

గతేడాది ‘లైగర్​’తో భారీ డిజాస్టర్​ను అందుకున్న విజయ్ దేవరకొండ.. ఈ ఏడాది ‘ఖుషి’తో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో విజయ్ సరసన హీరోయిన్​గా సమంత నటించారు. ఈ మూవీపై రిలీజ్​కు ముందే మంచి బజ్ నెలకొంది. టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడం.. పాటలు హిట్టవ్వడంతో ‘ఖుషి’ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లే సినిమాకు మార్నింగ్ షో నుంచే పాజిటివ్‌ టాక్ వచ్చేసింది. మొదటి మూడ్రోజులు విజయ్ మూవీకి మంచి వసూళ్లు వచ్చాయి. కానీ ఆ తర్వాత మాత్రం క్రమంగా డౌన్​ఫాల్ మొదలైంది. ‘ఖుషి’ మూవీకి వరల్డ్ వైడ్​గా రూ.52.50 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం. నైజాంలో రూ.15 కోట్లు, ఆంధ్రాలో రూ.20 కోట్లు, సీడెడ్​లో రూ.6 కోట్ల బిజినెస్ జరిగిందట. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవాలంటే రూ.41 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాలి.

ఓపెనింగ్స్​లో అదరగొట్టిన విజయ్ ‘ఖుషి’ ఆ తర్వాత క్రమంగా డౌన్ అయింది. మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా రూ.39.45 కోట్లు రాబట్టిందని సమాచారం. నైజాలో రూ.12.88 కోట్లు, సీడెడ్​లో రూ.2.23 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.1.41 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ.1.09 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.2.77 కోట్లు, గుంటూరులో రూ.1.35 కోట్లు, కృష్ణాలో రూ.1.32 కోట్లు, నెల్లూరులో రూ.72 లక్షలు కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ టాక్. ‘ఖుషి’ మూవీకి ప్రపంచవ్యాప్తంగా జరిగిన బిజినెస్ రూ.52.50 కోట్లు. అయితే 8 రోజుల్లో వచ్చిన వసూళ్లు రూ.38.78 కోట్లు. అంటే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్​ కోసం మరో రూ.14.72 కోట్లు రాబట్టాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ‘ఖుషి’కి ఓవర్సీస్​లో రూ.7 కోట్ల బిజినెస్ జరిగితే.. రూ.8.56 కోట్ల వసూళ్లు వచ్చాయి. దీంతో అక్కడ గట్టెక్కింది.

నైజాంలోనూ ‘ఖుషి’ సేఫ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ మిగతా ఏరియాల్లో మాత్రం ఈ మూవీతో బిజినెస్​లో ఉన్నవారికి నష్టాలు తప్పేలా లేవని ట్రేడ్ పండితులు అంటున్నారు. బాలీవుడ్​ బాద్​షా షారుక్ నటించిన ‘జవాన్’ సినిమా హిందీతో పాటు తెలుగులోనూ రచ్చ చేస్తోంది. ఈ మూవీ ఎఫెక్ట్ ‘ఖుషి’ వసూళ్లపై బాగా పడినట్లు కనిపిస్తోంది. ‘లైగర్’తో విమర్శలపాలైన విజయ్.. ‘ఖుషి’తో స్ట్రాంగ్ కమ్​బ్యాక్ ఇవ్వాలనుకున్నారు. కానీ ఈ మూవీ హిట్ స్టేటస్​ను సొంతం చేసుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. దీంతో విజయ్ లెక్కలు తప్పాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి.. ‘ఖుషి’ మూవీని మీరు చూశారా? ఒకవేళ చూస్తే ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: అభిషేక్ పిక్చర్స్​పై విజయ్ దేవరకొండ తండ్రి సీరియస్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి