iDreamPost

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సింగర్ మృతి!

ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కారణాలు ఏవైనా సరే.. తాము ఎంతగానో అభిమానించే నటీనటులు.. ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు చనిపోవడంతో అభిమానులు తీరని దుఖఃంలో మునిగిపోతున్నారు.

ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కారణాలు ఏవైనా సరే.. తాము ఎంతగానో అభిమానించే నటీనటులు.. ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు చనిపోవడంతో అభిమానులు తీరని దుఖఃంలో మునిగిపోతున్నారు.

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సింగర్ మృతి!

ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నటీనటులు, దర్శక,నిర్మాతలు, సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్లు ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూయడంతో ఇండస్ట్రీ దుఖఃసాగరంలో మునిగిపోతుంది. అనారోగ్య కారణాలు, హార్ట్ ఎటాక్, రోడ్డు ప్రమాదాలు.. కెరీర్ సరిగా లేక ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకోవడం.. ఇలా కారణాలు ఏవైనా సెలబ్రెటీలు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం విషాదంలో మునిగిపోతున్నారు. అద్భతమైన గాత్రంతో ఎన్నో హిట్ సాంగ్స్ పాడిన ప్రముఖ సింగర్ కన్నుమూయడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా విషాదంతో మునిగిపోయింది. వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు అనూప్ ఘోషల్ (78) వృద్దాప్య కారణంగ అనారోగ్యంతో బాధపడుతూ కోల్‌కొతాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు. బెంగాలీ గాయకుడు అనూప్ ఘోషల్ పలు భాషల్లో పాడి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1.40 గంటలకు ఆయన కన్నుమూసినట్లు కుటుం సభ్యులు తెలిపారు. బాలీవుడ్ లో ప్రముఖ గాయకుల జాబితాలో అనూప్ ఘోషల్ పేరు ఎప్పుడూ మారుమోగుతుంది. 1983లో నసీరుద్దీన్ షా, షబానా అజ్మీ నటించిన సూపర్ హిట్ మూవీ మాసూమ్ లో ఆయన పాడిన ‘ముజ్ సే నారాజ్ నహీ’సాంగ్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్ ని ప్రజలు ఇప్పటికీ వినడానికి ఎంతో ఇష్టపడతారు. ఈ పాట ప్రతి హృదయాన్ని కదిలించేలా ఉంటుంది.

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ.. అనూప్ జీ గొప్ప సింగర్, స్వకర్త.. ఆయన పాడిన పాటలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా గుర్తుండిపోతాయి. ఇయన బెంగాలీనే కాదు.. ఇతర భాషల్లో కూడా అద్భుతమైన పాటలు పాడారు. ఆయన మరణం సంగీత ప్రపంచానికి తీరలి లోటు, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని అన్నారు. 2011లో టీఎంసీ తరుపున ఆయన పశ్చిమ బెంగాల్ శాసనసభకు ఎన్నికయ్యారు. 2011లో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు నజ్రుల్ స్మితి పుస్కారం, 2013లో సంగీత్ మహాసన్మాన్ ప్రధానం చేసింది. అనూప్ ఘోషల్ మృతిపై పలువురు సెలబ్రెటీలు నివాళులర్పిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి