iDreamPost

సింగిల్ మదర్స్​కు గుడ్ న్యూస్ చెప్పిన ఉపాసన.. వారి కోసం ఏకంగా..!

  • Author singhj Updated - 08:08 AM, Tue - 8 August 23
  • Author singhj Updated - 08:08 AM, Tue - 8 August 23
సింగిల్ మదర్స్​కు గుడ్ న్యూస్ చెప్పిన ఉపాసన.. వారి కోసం ఏకంగా..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల గురించి తెలిసిందే. చెర్రీ భార్యగా కాకుండా తనకంటూ సొంతంగా పేరు తెచ్చుకోవాలని ఆమె ప్రయత్నిస్తుంటారు. వైఫ్​గా చెర్రీకి అండగా ఉంటూనే.. మరోవైపు అపోలో ఆస్పత్రిలో తనకు అప్పజెప్పిన బాధ్యతలు చూసుకుంటున్నారు. అపోలో వైస్ ఛైర్​పర్సన్​గా ఉపాసన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాంటి ఆమె సింగిల్ మదర్స్​కు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక మీదట వారాంతాల్లో సింగిల్ మదర్స్ తమ పిల్లలను అపోలో చిల్డ్రన్ హాస్పిటల్స్​కు తీసుకెళ్లి ఉచితంగా ట్రీట్​మెంట్ (డాక్టర్ కన్సల్టెన్సీ-ఓపీడీ) పొందొచ్చని ప్రకటించారు.

సింగిల్ పేరెంట్స్​కు తాము చేస్తున్న సాయం కచ్చితంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నానని ఉపాసన అన్నారు. భర్త సాయం లేకుండా పిల్లల్ని పోషించే తల్లుల బాధను తెలుసుకున్నాను కాబట్టే.. వాళ్లకు వీకెండ్స్​లో డాక్టర్ కన్సల్టెన్సీని ఫ్రీగా అందిస్తామని ఆమె పేర్కొన్నారు. చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా వైద్య సేవలు అందించడం కోసం అపోలో హాస్పిటల్స్​కు అనుబంధంగా అపోలో చిల్డ్రన్స్ బ్రాండ్​ను సోమవారం ఉప్సీ లాంఛ్ చేశారు. దీనికి సంబంధించి హైదరాబాద్ జూబ్లీహిల్స్​లోని అపోలో హాస్పిటల్​లో లాంఛ్ ఈవెంట్​ను నిర్వహించారు. ఇందులో అపోలో చిల్డ్రన్స్ లోగోను ఆవిష్కరించిన అనంతరం ఉపాసన కీలక వ్యాఖ్యలు చేశారు.

‘నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత అందరూ నాపై ఎంతో ప్రేమను కురిపించారు. ప్రేమను కురిపించడమే గాక నాకు ఆశీస్సులూ అందించారు. వారందరికీ నా ధన్యవాదాలు. మా ప్రెగ్నెన్సీ జర్నీని అందంగా మార్చినందుకు మీడియాకు థ్యాంక్యూ. అపోలో చిల్డ్రన్స్ ఆస్పత్రిని లాంఛ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది నాకో ఎమోషనల్ జర్నీ. పిల్లలకు ఏదైనా అయితే, అనారోగ్యానికి గురైతే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. పిల్లల్ని వాళ్ల పేరెంట్స్ దగ్గరకు సంపూర్ణ ఆరోగ్యంతో చేర్చడం మా బాధ్యత’ అని ఉపాసన చెప్పుకొచ్చారు. మరి.. సింగిల్ మదర్స్ కోసం ఉపాసన తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి