iDreamPost

బాబా రామ్‌దేవ్ కు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ షాక్

బాబా రామ్‌దేవ్ కు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ షాక్

యోగా గురువు, పతంజలి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపకులు బాబా రామ్‌దేవ్ కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పతంజలి తయారు చేసిన కరోనా వైరస్ (కోవిడ్-19) మెడిసిన్ ప్రకటనలు ఆపివేయాలని కేంద్ర ఆయూష్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కరోనా వైరస్ కు మెడిసిన్ గా ఇప్పటికే టాబ్లెట్, ఇంజక్షన్ వచ్చాయి. ఈ నేపథ్యంలో పతంజలి కూడా ఆయుర్వేద మెడిసిన్ ప్రకటించింది. అయితే ఈ మెడిసిన్ ఎటువంటి ధృవీకరణ జరగలేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ధృవీకరణ జరగకుండానే బాబా రామ్‌దేవ్ పతంజలి ఆయుర్వేద ఔషధాన్ని ప్రకటించారు.

అందుకనుగుణంగా మీడియా సమావేశం పెట్టి పతంజలి మెడిసిన్ ను విడుదల చేశారు. అలాగే ఆ మెడిసన్ ప్రచారం కోసం విస్తృతంగా ప్రకటనలు ఇస్తున్నారు. అయితే ఎటువంటి ధృవీకరణ జరగనందున కేంద్ర ఆయూష్ మంత్రిత్వ శాఖ, బాబా రామ్‌దేవ్ కు ఝలక్ ఇచ్చింది.

ధృవీకరణ అయ్యేవరకు ”ఆయుర్వేద కోవిడ్ -19 ఔషధం” ప్రకటనలను ఆపాలని రామ్‌దేవ్ పతంజలి ఆయుర్వేదానికి, ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. “ఆయుర్వేద కోవిడ్-19 ఔషధం” తమ వద్ద ఉందని రామ్‌దేవ్ పతంజలి ఆయుర్వేదం పేర్కొన్న కొన్ని గంటల తరువాత, ఈ ఔషధానికి సంబంధించిన వివరాలను కోరుతూ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది.

పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ మంగళవారం(జూన్-23) ఈ ఉత్పత్తిని విడుదల చేసింది. అయితే తమకు ఔషధానికి సంబంధించిన వివరాలు అందిన తరువాత, తాము పరిశీలించి అనుమతి ఇచ్చే వరకు ప్రకటనలు ఇవ్వడం, ప్రచారం చేయడం మానుకోవాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ పతంజలికి సూచించింది.

“పతంజలి ఆయుర్వేద్ కోవిడ్-19 చికిత్స కోసం అభివృద్ధి చేసిన ఆయుర్వేద ఔషధాల గురించి ఇటీవల మీడియాలో ప్రసారం అవుతున్న వార్తలను ఆయుష్ మంత్రిత్వ శాఖ గుర్తించింది. అయితే దీని శాస్త్రీయ అధ్యయనం వివరాలు మంత్రిత్వ శాఖకు తెలియదు” అని ప్రకటన తెలిపింది.

ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు సుమైయా షేక్ దీనిని “మెడికల్ తప్పుడు సమాచారం” అని పేర్కన్న తరువాత పతంజలి చేసిన ట్విట్ ను ట్విట్టర్ తొలగించింది.

అంతకు ముందు కరోనా మెడిసన్ పేరుతో పంతంజలి ఆయుర్వేద ఔషధం ప్రకటించిన సందర్భంగా పతంజలి వ్యవస్థాపకుడు రామ్‌దేవ్ మాట్లాడుతూ ”కరోనిల్, స్వాసరి” అనే మందులు దేశ వ్యాప్తంగా 280 మంది రోగులపై పరిశోధన, పరీక్షల ఆధారంగా అభివృద్ధి చేయబడ్డాయని పేర్కొన్నారు. “దేశం, ప్రపంచం కరోనాకు ఔషధం, టీకా కోసం ఎదురుచూస్తున్నాయి. మొదటి ఆయుర్వేద వైద్య పరంగా నియంత్రిత ట్రయల్-ఆధారిత, పరిశోధన-ఆధారిత ఔషధం సంయుక్తంగా తయారు చేయబడినట్లు ప్రకటించారు. పతంజలి రీసెర్చ్ సెంటర్, నిమ్స్ కృషి చేశాయి” అని అన్నారు.

“మేము ఈ రోజు కోవిడ్-19 ఔషధాలను కరోనిల్, స్వాసరీలను విడుదల చేస్తున్నాము. వీటిలో రెండు పరీక్షలను మేము నిర్వహించాం. మొదటి క్లినికల్ కంట్రోల్డ్ స్టడీ, ఇది ఢిల్లీ, అహ్మదాబాద్ లతో పాటు అనేక ఇతర నగరాల్లో జరిగింది. దీని కింద 280 మంది రోగులపై ప్రయోగించాం. వారిలో 100 శాతం కోరోనా, దాని సమస్యలను నియంత్రించగలిగాం. దీని తరువాత అన్ని ముఖ్యమైన క్లినికల్ కంట్రోల్ ట్రయల్ జరిగింది” అని ఆయన పేర్కొన్నారు.

జైపూర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేసినట్లు కంపెనీ తెలిపారు. “నిమ్స్ సహాయంతో మేము 95 మంది రోగులపై క్లినికల్ కంట్రోల్ స్టడీని నిర్వహించాము. దీని నుండి బయటపడిన అతి పెద్ద విషయం ఏమిటంటే, మూడు రోజుల్లో 69 శాతం మంది రోగులు కోలు కొన్నారు. ఏడు రోజుల్లో 100 కి 100 శాతం కోలుకొన్నారు” అని రామ్‌దేవ్ అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి