పైన ఫొటోలో కనిపిస్తున్న ఈ మహిళ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కానీ ఈమె మనిషి కాదు.. నరరూప రాక్షసి అంటే నమ్ముతారా? అవును, ఇది నిజం. ఈ అందమైన నర్సు ఏకంగా ఏడు మంది ప్రాణాలను బలిగొంది. ఈ నరహంతకురాలి పేరు లూసీ లెబ్టీ (33). ఆస్పత్రిలో పుట్టిన శిశువులను కన్నతల్లిలా కంటికి రెప్పలా చూసుకోవాల్సిన లూసీ.. ఆ పిల్లల పాలిట మృత్యువుగా మారింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా ఏడుగురు శిశువులను ఆమె […]
కుతుబ్ మినార్ చుట్టూ రోజుకో వివాదం ముసురుకుంటోంది. ఇక్కడ ప్రార్థనలు చేసే విషయమై ఓవైపు కోర్టులో కేసు నడుస్తుండగానే, ఏకంగా ఇది మా ఆస్తి అంటూ ఒకాయన తెర మీదకొచ్చాడు. ఆగ్రా రాజవంశానికి చివరి వారసుడిగా చెప్పుకుంటున్న ఆయన పేరు కువర్ మహేంద్ర ధ్వజ్ ప్రసాద్ సింగ్. 1695లో చనిపోయిన రాజా నంద రామ్ వంశీకులైన బెస్వాన్ రాజ కుటుంబానికి చెందినవాడినని ఈయన చెబుతున్నాడు. చెప్పడమే కాదు మీరట్ నుంచి ఆగ్రా వరకు విస్తరించి ఉన్న ప్రాంతమంతా […]
అక్రమంగా ఉగ్రవాద కేసుల్లో ఇరికించినందుకు పంజాబ్ ప్రభుత్వం ఓ వ్యక్తికి ఏకంగా 14 లక్షల 85 వేల రూపాయల పరిహారం చెల్లించుకుంది. అమృత్ సర్ కి చెందిన సరబ్ జీత్ సింగ్ వెర్కా పంజాబ్ మానవ హక్కుల సంఘంలో సభ్యుడు. పంజాబ్ పోలీసులు అతనిపై రెండు తప్పుడు ఉగ్రవాద కేసులు బనాయించారు. వీటిలో ఒకటి 1992లో నమోదు కాగా మరొకటి 1998లో రిజిస్టరైంది. అయితే 2007 నాటికి ఈ రెండు కేసుల్లోనూ సరబ్ జీత్ నిర్దోషిగా తేలాడు. […]
బుధవారం ఉదయం రంగారెడ్డి జిల్లా కోర్టులో ఓ యువకుడు కత్తితో కలకలం సృష్టించాడు. సాయికిరణ్ అనే యువకుడు కత్తితో కోర్టు లోపలికి ప్రవేశించాడు. అతని వెంట స్నేహితులు కూడా ఉన్నారు. అయితే సాయికిరణ్ కత్తి పట్టుకొని కోర్టులో తిరగడాన్ని సెక్యూరిటీ సిబ్బంది చూసి అక్కడే ఉన్న పోలీసులకి చెప్పడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఇలా కత్తి పట్టుకొని ఎందుకు తిరుగుతున్నావు కోర్టులో అని ప్రశ్నించగా హత్య చేసేందుకు వచ్చాను అని సాయి చెప్పిన సమాధానం […]