iDreamPost
android-app
ios-app

పింక్ రీమేక్ లో అసలు ట్విస్ట్

  • Published Feb 03, 2020 | 5:59 PM Updated Updated Feb 03, 2020 | 5:59 PM
పింక్ రీమేక్ లో అసలు ట్విస్ట్

ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నిర్మాత దిల్ రాజు ఇవాళ రిలీజ్ డేట్ మే 15గా ప్రకటించేశారు. కేవలం నాలుగు నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ తో సహా ఇంత ఫాస్ట్ గా ఫస్ట్ కాపీ రెడీ చేసుకున్న పవన్  సినిమాగా ఇది రికార్డు సృష్టించినట్టే. అయితే అందరూ అనుకుంటున్నట్టు ఇది అమితాబ్ పింక్ ఫార్ములాను ఫాలో కావడం లేదు. దాన్ని ఆధారంగా చేసుకుని తమిళ్ లో అజిత్ తీసిన నీర్కొండ పార్వై ని బట్టి స్క్రిప్ట్ రాసుకున్నారట. 

ఒరిజినల్ హిందీ వెర్షన్ లో అమితాబ్ కు హీరోయిజం చూపించే పార్ట్ కానీ యాక్షన్ సీక్వెన్స్ కానీ ఏమి ఉండవు. కానీ అజిత్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు వినోత్ చేసిన కొన్ని కీలక మార్పులు మార్కెట్ పరంగానూ అభిమానుల అంచనాల పరంగానూ బాగా వర్కవుట్ అయ్యాయి. అందుకే బోనీ కపూర్ తో చర్చించిన దిల్ రాజు దర్శకుడు వేణు శ్రీరామ్ లు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది

మార్పులు ఉన్నప్పటికీ ముఖ్యమైన సోల్ మాత్రం పింక్ దే ఉంటుంది. కాకపోతే సినిమా సగానికి పైగా కోర్ట్ రూమ్ డ్రామాగా సాగుతుంది కాబట్టి మాస్ దీన్ని ఎంత వరకు అంగీకరిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. అందులోనూ పవన్ కి డ్యూయెట్స్ ఉండే అవకాశాలు లేనట్టే. సీరియస్ నోట్ లో సాగే మూవీలో బలవంతంగా వాటిని ఇరికిస్తే అసలు ఉద్దేశం దెబ్బ తింటుంది . లాయర్ సాబ్ అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది కానీ అది ఎంతవరకు ఖరారు అవుతుందో ఉగాది నాడు ఫస్ట్ లుక్ బయటికి వచ్చినప్పుడు తెలుస్తుంది . సో పవన్ సినిమా ఎలా ఉండబోతోందనే ఐడియా రావాలంటే పింక్ కన్నా నీర్కొండ పార్వై చూడటం బెటర్ ఆప్షన్. లేదూ అంటే విడుదల దాకా ఆగి చూడాల్సిందే 

Jojobet GirişmeritbetjojobetKavbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetjojobetMadridbetMadridbetcasibom girişbetorspin girişCasibom Girişmeritkingsuperbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis GüncelHoliganbet GirişHoliganbet Güncel GirişMarsbahis GirişMarsbahis Güncel Giriş