iDreamPost

కాబోయే భర్త ఎదుటే పలువురితో డేటింగ్‌.. అందులో తప్పేముంది?: నటి

బాలీవుడ్ టాక్ షో కాఫీ విత్ కరణ్ సీజన్ 8 నడుస్తోంది. ఈ షోలో తొలి గెస్టులుగా విచ్చేశారు రీల్ కమ్ రియల్ కపుల్ రణవీర్ అండ్ దీపికా పదుకునే. ఈ సందర్భంగా తమ లవ్, మ్యారేజ్ గురించి చెప్పింది. దీంతో దీపికాపై విమర్శలు మొదలయ్యాయి.

బాలీవుడ్ టాక్ షో కాఫీ విత్ కరణ్ సీజన్ 8 నడుస్తోంది. ఈ షోలో తొలి గెస్టులుగా విచ్చేశారు రీల్ కమ్ రియల్ కపుల్ రణవీర్ అండ్ దీపికా పదుకునే. ఈ సందర్భంగా తమ లవ్, మ్యారేజ్ గురించి చెప్పింది. దీంతో దీపికాపై విమర్శలు మొదలయ్యాయి.

కాబోయే భర్త ఎదుటే పలువురితో డేటింగ్‌.. అందులో తప్పేముంది?:  నటి

సినిమా నటీనటులు ఏదైనా విషయంపై మాట్లాడితే రచ్చ చేసేస్తుంటారు జనాలు. తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినా.. పొరపాటుగా ఏదైనా వ్యాఖ్యలు చేసినా అది వారికి గ్రహపాటుగా మారిపోతుంది. బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు దీపికా పదుకునే ఇప్పుడొక వివాదంలో చిక్కుకున్నారు. దానికి కారణమైంది కాఫీ విత్ కరణ్ షో. బాలీవుడ్‌లో చాలా క్రేజీ టాక్ షో అయిన కాఫీ విత్ కరణ్ ఇప్పటికే 7 సీజన్లు పూర్తి చేసుకుని, ఇప్పుడు 8వ సీజన్‌లోకి అడుగుపెట్టింది. ఈ ఎపిసోడ్ తొలి గెస్ట్‌లుగా విచ్చేశారు లవ్లీ కపుల్ దీపికా పదుకునే, రణవీర్ సింగ్. ఈ సందర్భంగా తమ పెళ్లికి ముందు ప్రేమ, మ్యారేజ్ గురించి మాట్లాడారు. ఇదే ఇప్పుడు ఆమెను సమస్యల్లోకి నెట్టింది.

అసలు ఏమైందంటే.. ఆమె పలువురితో డేటింగ్ చేసి.. విడిపోయినట్లు గతంలో పలు ఇంటర్వ్యూలో చెప్పింది. తాజాగా ఈ షోలో భర్తతో ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడుతూ.. రణవీర్ జీవితంలోకి రాక ముందు తన ప్రేమ వ్యవహారాలన్నీ బెడిసి కొట్టాయని, అప్పటి నుండి ఒంటరిగా ఉండాలనుకుని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. ఎవ్వరితో అటాచ్ అవ్వాలనుకోలేదని పేర్కొంది. ఆ తర్వాత రణవీర్ తన జీవితంలోకి వచ్చాడు. తను వచ్చాక కూడా చాలా మందిని కలిశాను కానీ.. ఎవ్వరూ కనెక్ట్ కాలేదని, అతడు కూడా తన మనస్సులో మాట చెప్పేంత వరకు కూడా తాము కనెక్ట్ కాలేదని పేర్కొంది. అయితే మనస్సులో ఎక్కడో రణవీర్ తనకు సరైన జోడీ అనిపించిందంటూ చెప్పుకొచ్చింది.

ఇదే విమర్శలకు కారణమైంది. పలువురు దీపికాను తిట్టిపోస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో నటి ఆమెకు మద్దతుగా నిలిచింది. ఆమె బాలీవుడ్ అక్షయ్ కుమార్ భార్య, నటి, ఇప్పుడు రచయితగా మారిన ట్వింకిల్ ఖన్నా. ‘ అంకుల్ అండ్ ఆంటీస్.. దీపిక కాబోయే భర్తతో డేటింగ్ లో ఉండగానే మరొకరితో సన్నిహితంగా ఉన్నప్పటికీ.. ఏ పురుషుడు దగ్గరా మోకరిల్లలేదు. ఉన్నది ఉన్నట్లు చెబితే ఎందుకంత ఉలుకు. ఆమెను ఎందుకు విమర్శిస్తున్నారు. ఈ ట్రోలింగ్ ఏ రేంజ్ కు చేరిందంట.. బనారస్ యూనివర్శిటీలో ఓ అమ్మాయి దీపికగా, కొందరు అబ్బాయిలు ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్స్‌గా యాక్ట్ చేసే వరకు వెళ్లింది. సరైన భాగస్వామిని ఎంపిక చేసుకునే ఆమె విధానం చాలా లాజికల్‌గా ఉంది. మీరు సోఫా కొనేందుకు దుకాణానికి వెళితే.. ఏదీ సౌకర్యవంతంగా ఉంది, ఏది బాగుంది, నాణ్యత ఉందా లేదా అని చెక్ చేస్తారు కదా. మరీ పెళ్లి విషయంలో ఆమె చేసిన దానిలో తప్పేంటీ’ అని ప్రశ్నించింది.