iDreamPost

581 హాస్టల్‌ వార్డెన్‌ ఉద్యోగాలు.. పరీక్ష తేదీలను ప్రకటించిన TSPSC

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్. 581 హాస్టల్‌ వార్డెన్‌ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష తేదీలను ప్రకటించింది. పరీక్షలు ఎప్పుడు నిర్వహించనున్నారంటే?

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్. 581 హాస్టల్‌ వార్డెన్‌ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష తేదీలను ప్రకటించింది. పరీక్షలు ఎప్పుడు నిర్వహించనున్నారంటే?

581 హాస్టల్‌ వార్డెన్‌ ఉద్యోగాలు.. పరీక్ష తేదీలను ప్రకటించిన TSPSC

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టిసారించింది. గతంలో విడుదలైన నోటిఫికేషన్లకు సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో గ్రూప్ 1,2,3 ఉద్యోగాల భర్తీకి సంబంధించి పరీక్ష తేదీలను ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్. మరోవైపు మెగా డీఎస్సీ పేరిట 11 వేల పైచిలుకు పోస్టులకు కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిష్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. 581 హాస్టల్‌ వార్డెన్‌ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష తేదీలను ప్రకటించింది. పరీక్షలు ఎప్పుడు జరుగనున్నాయంటే?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ హాస్ట‌ళ్ల‌లో ఖాళీగా ఉన్న 581 పోస్టుల భ‌ర్తీకి 2022 డిసెంబరు 22వ తేదీన టీఎస్‌పీఎస్సీ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసిన విషయం తెలిసిందే. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 581 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్, మ్యాట్రన్, మహిళా సూపరింటెండెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు డిగ్రీతో పాటు బీఈడీ/డీఈడీ ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు. ఈ హాస్టల్‌ వార్డెన్‌ పోస్టులకు జూన్ 24 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ తాజాగా ప్రకటించింది.

పోస్టుల వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య:

 • 581

 

 • హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -1(ట్రైబ‌ల్ వెల్ఫేర్) -05
 • హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2(ట్రైబ‌ల్ వెల్ఫేర్) – 106
 • హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2 మ‌హిళ‌లు (ఎస్సీ డెవ‌ల‌ప్‌మెంట్‌) -70
 • హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2 పురుషులు (ఎస్సీ డెవ‌ల‌ప్‌మెంట్) – 228
 • హాస్ట‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ గ్రేడ్ -2 (బీసీ వెల్ఫేర్) – 140
 • వార్డెన్ గ్రేడ్ -1 డైరెక్ట‌ర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 05
 • మ్యాట్ర‌న్ గ్రేడ్ -1 డైరెక్ట‌ర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 03
 • వార్డెన్ గ్రేడ్ -2 డైరెక్ట‌ర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 03
 • మ్యాట్ర‌న్ గ్రేడ్ -2 డైరెక్ట‌ర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 02
 • లేడి సూప‌రింటెండెంట్ చిల్డ్ర‌న్ హోం ఇన్ వుమెన్ డెవ‌ప‌ల్‌మెంట్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ – 19

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి