iDreamPost

ఇవేం రాజకీయాలు పవన్‌.. నీకంటే బర్రెలక్క నూరుపాళ్లు నయం కదా: నెటిజనులు

  • Published Nov 24, 2023 | 9:21 AMUpdated Nov 24, 2023 | 11:57 AM

తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఆసక్తికర చర్చ సాగుతోంది. పవన్‌ రాజకీయాల్ని.. బర్రెలక్క పాలిటిక్స్‌తో పోలుస్తూ.. ఎద్దేవా చేస్తున్నారు జనాలు. ఆ వివరాలు..

తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఆసక్తికర చర్చ సాగుతోంది. పవన్‌ రాజకీయాల్ని.. బర్రెలక్క పాలిటిక్స్‌తో పోలుస్తూ.. ఎద్దేవా చేస్తున్నారు జనాలు. ఆ వివరాలు..

  • Published Nov 24, 2023 | 9:21 AMUpdated Nov 24, 2023 | 11:57 AM
ఇవేం రాజకీయాలు పవన్‌.. నీకంటే బర్రెలక్క నూరుపాళ్లు నయం కదా: నెటిజనులు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఎన్నికలకు మరో 6 రోజుల సమయం మాత్రమే ఉంది. నవంబర్‌ 30న పోలింగ్‌ జరగనుండగా.. డిసెంబర్‌ 3న ఫలితాలు వెలువడతాయి. ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని విచిత్రమైన సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో బీజేపీతో కటీఫ్‌ చెప్పుకున్న జనసేన.. తెలంగాణలో మాత్రం పొత్తు పెట్టుకుంది. ఏకంగా 8 స్థానాల్లో పోటీ చేస్తోంది. మరి ఏపీలో వద్దనుకుని.. తెలంగాణలో పొత్తు పెట్టుకోవడం ఏంటి.. పవన్‌ ప్రదర్శిస్తోన్న ఈరెండు నాల్కల ధోరణి ఏంటో అర్థం కాక జనసేన నేతలు, కార్యకర్తలు మాత్రమే జనాలు కూడా విస్తుపోతున్నారు. ఇక పవన్‌ తీరు ఇలా ఉండగా.. ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో బర్కెలక్క అలియాస్‌ కర్నె శిరీష అసెంబ్లీ బరిలో నిలవడం రాజకీయాల్లో సంచలనంగా మారింది.

కొన్నాళ్ల క్రితం.. తెలంగాణలో ఉద్యోగ అవకాశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే.. తన అసహనాన్ని బర్రెలు కాస్తూ ప్రకటించింది శిరీష. ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో తెగ వైరల్‌ కావడమే కాక.. ఆమె పేరు మారుమోగిపోయింది. అలా ఫెమస్‌ అయిన బర్రెలక్క. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఎవరూ ఊహించని రీతిలో నాగర్‌కర్నూల్‌ కొల్లాపూర్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా నామినేషన్‌ వేసి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఆమెకు మద్దతు పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఓ ఆసక్తికర చర్చ సాగుతోంది. పవన్‌ కంటే బర్రెలక్క చాలా నయం అంటున్నారు నెటిజనులు. ఎందుకు అంటే..

బర్రెలక్కతో పోలిక..

రాజకీయాల్లో పవన్‌ని, బర్రెలక్కన్ని పోలుస్తూ.. ఎవరు ఉత్తమం అని చర్చించుకుంటున్నారు. ఎన్నికల బరిలోకి దిగిన బర్రెలక్కకు ఆమెకంటూ ఓ సిద్ధాంతం ఉంది. తాను ఎందుకోసం రాజకీయాల్లోకి వచ్చింది.. ఎవరి మీద పోరాటం చేస్తోంది వంటి విషయాల మీద ఆమెకు పూర్తి అవగాహన ఉంది. గెలుస్తుందా లేదా అన్నది మ్యాటర్‌ కాదు.. కానీ ఎంతో నిజాయతీగా ప్రయత్నిస్తోంది. ఇవన్ని ఓటర్లను ఆకర్షిస్తున్నాయి. ఇదే సమయంలో పవన్‌ తీరు చూసి ఆ పార్టీ నేతలే కాక జనాలు కూడా ఆశ్చర్యపోతున్నారు.

తొమ్మిదిన్నరేళ్లుగా ఓ పార్టీని నడుపుతూ.. అంతకు ముందు ఆరేళ్ల కిందటే మరో పార్టీ యువ విభాగానికి పని చేసిన రాజకీయ అనుభవం ఉన్న పవన్‌ కళ్యాణ్‌ తీసుకునే నిర్ణయాలు, చేసే వ్యాఖ్యలు.. ఆ పార్టీ కార్యకర్తలకే అర్థం కావు.. ఇక సామాన్యుల పరిస్థితి గురించి చెప్పాల్సిన పని లేదు అంటున్నారు రాజకీయ పండితులు. ఏపీలో వద్దనుకున్న పార్టీతోనే తెలంగాణలో పొత్తు పెట్టుకోవడం చూస్తే.. పవన్‌ తీరు ఏంటో పూర్తిగా అర్థం అవుతుంది అంటున్నారు. అవసరం కోసం, తన స్వప్రయోజనాల కోసం పవన్‌ ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటాడు.. ఆయనకంటూ ఓ సిద్ధాంతం లేదు.. పార్టీకి ఓ ఆశయం లేదనన్నది తేటతెల్లమవుతోంది అంటున్నారు.

ఓటమిని ఒప్పుకున్నట్లేనా పవన్‌..

టీడీపీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగబోతున్న పవన్‌ కళ్యాణ్‌.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం నేరుగా పోటీ చేసే ధైర్యం చేయలేకపోతున్నాడని విమర్శిస్తున్నారు నెటిజనులు. పైగా ప్రారంభంలో 32 స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించిన పవన్‌.. 8 చోట్లకే పరిమితం కావడం.. అభ్యర్థుల తరఫున ఏమాత్రం ప్రచారం చేయకుండా.. ఏదో గెలిస్తే గెలుస్తాం.. లేదంటే లేదు అన్నట్లు ప్రవర్తించడమే కాక.. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి తనకు టైమ్‌ లేదంటూ ప్రకటన చేయడం.. బీజేపీకి మద్దతు ఇవ్వాలని జనసేన శ్రేణులకు సలహా ఇవ్వడం వంటి వన్ని చూస్తే.. పోలింగ్‌ జరగకముందే.. పవన్‌ ఓటమిని ఒప్పుకున్నారు అని కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజనులు.

పైగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని తిట్టలేనని.. తనకు కారు పార్టీ, కాంగ్రెస్‌ నేతలతో స్నేహం ఉందని.. అందుకే విమర్శలు చేయలేనని చెప్పాడు. పైగా గద్దర్‌ కుమార్తె ఏ పార్టీ నుంచి పోటీ చేస్తుందో కూడా తెలుసుకోకుండా.. గద్దర్‌ ఆశయాన్ని గెలిపించాలంటూ.. కాంగ్రెస్‌కు పరోక్షంగా మద్దతిస్తున్నాడు పవన్‌. ఇక గత రెండు రోజులుగా ప్రచారంలోకి దిగి పవన్‌ చేస్తున్న ప్రసంగాలు చూస్తే.. రాజకీయాల్లో ఏమాత్రం అనుభవం లేని బర్రెలక్కలాంటి వాళ్లు ఇంతకంటే మెరుగ్గానే ఉన్నారు. ఆమెకంటూ ఒక ఆశయం ఉంది.. సిద్ధాంతం ఉంది.. దేని కోసం రాజకీయాల్లోకి వచ్చాను అనే దాని మీద స్పష్టత ఉంది. కానీ పవన్‌కు మాత్రం ఏమాత్రం స్పష్టత లేదంటున్నారు

పైగా చిన్నవయసులోనే పోటీ చేస్తూ.. నామినేషన్‌ దగ్గరి నుంచి ప్రచారం వరకు ఆమె కనబరుస్తున్న చిత్తశుద్ధికి, ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే అంటున్నారు రాజకీయ పండితులు. ఇక పవన్‌ తీరు చూస్తే.. తాను పార్ట్‌టైమ్‌ పొలిటీషియన్‌ అని పవన్‌ చెప్పకనే చెప్పాడు అని అంటున్నారు రాజకీయ పండితులు. ఇద్దరిని పోలుస్తూ.. నీకన్నా బర్రెలక్క ఎంతో నయం కదా పవన్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజనులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి