iDreamPost

మీ పిల్లలు తినమని మారం చేస్తున్నారా? అయితే ఇలా చేయండి.. ఇవి తినిపించండి..

మీ పిల్లలు తినమని మారం చేస్తున్నారా? అయితే ఇలా చేయండి.. ఇవి తినిపించండి..

ఈరోజుల్లో పిల్లలు అందరూ కూడా తినడానికి చాలా విసిగిస్తుంటారు. ఎవ్వరికైనా పెద్ద పని ఏమిటంటే పిల్లలకు తినిపించడమే, కాబట్టి మనం ఏ విధంగా వండితే పిల్లలు ఇష్టంగా తింటారో ఆ విధంగా వండడానికి ప్రయత్నించాలి. పిల్లలు కారం తక్కువుగా, తియ్యగా ఉండేలా వండితే ఇష్టంగా తింటారు లేదా మనం వండిన దానిని అందంగా డెకరేట్ చేసినా ఇష్టంగా తింటారు. పిల్లలకు తినిపించే దానిలో పోషక విలువలు కూడా ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఏడాది వయసు కంటే తక్కువ ఉన్న పిల్లలకు తినిపించేటపుడు వాళ్లకు విడిగా తినిపించకుండా మన ఇంటిలో ఉండే వారందరితో పాటుగా తినిపించాలి. అప్పుడే పిల్లలు తొందరగా తింటారు మరియు వారంతట వారు తినడానికి ట్రై చేస్తారు.

చిన్న పిల్లలకి పాలు తాగించాలి కానీ వాళ్ళు పాలు తాగడానికి తొందరగా ఇష్టపడరు అలాంటి సమయంలో పాలల్లో హార్లిక్స్, బూస్ట్, పాల పొడులు లేదా డ్రై ఫ్రూట్స్ తో తయారైన పొడులు ఏవైనా కలిపి చిన్న పిల్లలకు తాగించవచ్చు. అప్పుడు పిల్లలు పాలు ఇష్టంగా తాగే అవకాశం ఉంది. అలాగే రాగి జావ వంటివి కూడా చిన్న పిల్లలకు తినిపించవచ్చు. ఇది ఎముకల బలానికి ఉపయోగపడుతుంది. రాగి జావ అనేది ఉదయం పూట లేదా సాయంత్రం పూట తినిపించాలి. నట్స్ లడ్డు, డ్రై ఫ్రూట్స్ లడ్డు, పల్లి చెక్కి, నువ్వుల చెక్కి వంటివి రోజూ తప్పకుండ తినిపించాలి, ఒకసారి అలవాటు అయితే వాళ్ళే తింటారు.

అన్నం తినిపించేటపుడు చారు, పెరుగు కాకుండా కూరలు కూడా తినిపించేలా చేయాలి. అన్ని రకాల కూరలు తినిపించాలి లేదా క్యారెట్, బీట్రూట్, బంగాళాదుంప వంటివి ఉడికించి తినిపించాలి. అలాగే ఫ్రూట్స్ కూడా రోజూ తినేలా చూడాలి తినకపోతే వాటిని జ్యూస్ లాగా చేసి తాగించాలి. జ్యూస్ లో షుగర్, ఐస్ వంటివి ఎక్కువగా వాడకూడదు. డ్రై ఫ్రూట్స్ కూడా విడిగా తినిపించాలి, లేకపోతే డ్రై ఫ్రూట్స్ ని పొడి చేసి తినిపించాలి. ఈ విధంగా ఫ్రూట్స్, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ అన్ని రకాలు పిల్లలకు మనం తినిపిస్తే ఇష్టంగా తింటారు, ఆరోగ్యంగా ఉంటారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి