iDreamPost

టీమిండియా వరల్డ్ కప్ గెలవాలని ట్రాన్స్ జెండర్స్ ప్రత్యేక పూజలు! వీడియో వైరల్..

  • Author Soma Sekhar Published - 03:43 PM, Sat - 18 November 23

భారత్ వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడాలని ట్రాన్స్ జెండర్ కమ్యూనిటికి చెందిన కొందరు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

భారత్ వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడాలని ట్రాన్స్ జెండర్ కమ్యూనిటికి చెందిన కొందరు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

  • Author Soma Sekhar Published - 03:43 PM, Sat - 18 November 23
టీమిండియా వరల్డ్ కప్ గెలవాలని ట్రాన్స్ జెండర్స్ ప్రత్యేక పూజలు! వీడియో వైరల్..

టీమిండియా వరల్డ్ కప్ గెలవాలని 130 కోట్ల భారతీయులు ప్రార్థనలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అన్ని మతాలకు చెందిన అభిమానులు భారత్ ప్రపంచ కప్ గెలవాలని దేవుళ్లకు పూజలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆసీస్ ను మట్టికరిపించి.. భారత్ వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడాలని ట్రాన్స్ జెండర్ కమ్యూనిటికి చెందిన కొందరు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీమిండియా ఆటగాళ్ల ఫొటోలను పట్టుకుని పూజలు నిర్వహించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..

భారత్ ప్రపంచ కప్ గెలవాలని ప్రతీ ఒక్క భారతీయుడి కల. ఇక ఈ కల నిజమవ్వడానికి ఇంకా ఒక్క అడుగుదూరంలోనే ఉన్నాం మనం. ఫైనల్లో ఆస్ట్రేలియాను కంగుతినిపించి వరల్డ్ కప్ ను ముద్దాడాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అందుకోసం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పూజలు, ప్రార్దనలు చేస్తున్నారు ఫ్యాన్స్. కాగా.. టీమిండియా వరల్డ్ కప్ గెలవాలని ట్రాన్స్ జెండర్స్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత ఆటగాళ్ల ఫొటోలను పట్టుకుని, తమ ఇష్టదైవం దగ్గర స్పెషల్ పూజలు చేశారు. ఆ తర్వాత డప్పు చప్పుల్లతో ప్రార్థనలు నిర్వహించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే భారతదేశం అంతటా దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం భారత జట్టు ఉన్న ఫామ్ ను బట్టి చూస్తే ప్రపంచ కప్ గెలవడం పెద్ద కష్టమైన పని కాదని, ఈసారి కప్పుకొట్టేది మనమే అని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి భారత్ వరల్డ్ కప్ గెలవాలని స్పెషల్ పూజలు నిర్వహించిన ట్రాన్స్ జెండర్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి