iDreamPost

Sankranthi Releases : రిలీజులు హీరోలవి గొడవలు అభిమానులవి

Sankranthi Releases : రిలీజులు హీరోలవి గొడవలు అభిమానులవి

ఇంకా సంక్రాంతికి అటుఇటుగా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ అప్పుడే సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ మొదలైపోయాయి. ఆర్ఆర్ఆర్ జనవరి 7, రాధే శ్యామ్ జనవరి 14 కన్ఫర్మ్ చేసుకున్న సంగతి తెలిసిందే. వీటికన్నా ముందు భీమ్లా నాయక్ జనవరి 12 మీద కర్చీఫ్ వేసింది. సర్కారు వారి పాట కూడా రావాలనుకున్నా ఫైనల్ గా డ్రాప్ అయ్యింది. బంగార్రాజు వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. మరి అంతా క్లియర్ గా ఉంది కదా అభిమానుల యుద్ధం దేనికీ అనుకుంటున్నారా. అక్కడికే వద్దాం. మాములుగా ఈ పండగ సీజన్ ఈజీగా నాలుగు సినిమాలకు అవకాశం కలిగిస్తుంది. వసూళ్లు కూడా ఢోకా లేకుండా దేనికి తగ్గట్టు దానికి వస్తాయి.

కానీ ఈసారి సీన్ అలా లేదు. ఆర్ఆర్ఆర్ లాంటి విజువల్ గ్రాండియర్ బరిలో ఉంది. పాన్ ఇండియా లెవెల్ లో వేలాది స్క్రీన్లలో రిలీజ్ కాబోతోంది. రాధే శ్యామ్ కూడా ఇంచుమించు ఇదే లెవెలే. అలా అని పవన్ కళ్యాణ్ ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్లతో డీల్స్, థియేటర్లను బుక్ చేయడం చకచకా జరిగిపోతున్నాయని ఆయా డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల పేర్లతో సహా ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారు. నిర్మాతలు మాత్రం మరోసారి డేట్ ని కన్ఫర్మ్ చేస్తూ పోస్టర్లు వదలాల్సి ఉంది. ఇక రాధే శ్యామ్ సందడి ఇవాళ్టి సాయంత్రం నుంచి షురూ అవుతుంది. అంతా బాగానే ఉంది కానీ అసలైన చిక్కు ఎక్కడ ఉందో చూడాలి. పోటీ అనివార్యమైనప్పటికీ కలెక్షన్ల మీద పరస్పర ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఆర్ఆర్ఆర్ మూడేళ్లుగా వందల కోట్లు పెట్టి తీసిన సినిమా కాబట్టి భీమ్లా నాయక్ తప్పుకుంటే మంచిదని ఒక వర్గం అంటోంది

సినిమా అన్నాక చిన్నా పెద్ద తేడా ఏముంటుందని మరో వర్గం ఇలా గట్టిగానే ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నారు. ట్విస్ట్ ఏంటంటే పవన్ చరణ్ లు బాబాయ్ అబ్బాయి అని మర్చిపోయి మరీ ట్విట్టర్ వేదికగా మాటలతో గొడవలు పడుతున్నారు. ఏది ఏమైనా థియేటర్ల కౌంట్ విషయంలో మాత్రం రచ్చ తప్పేలా లేదు. అన్నిటికన్నా ముందు ఆర్ఆర్ఆర్ వస్తుందిన కనక మొదటి నాలుగైదు రోజులు దానికి చాలా కీలకంగా మారబోతున్నాయి. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తర్వాత వచ్చేవాటికి ఇబ్బంది తప్పదు. ఆప్షన్లు ఎక్కువయ్యాయి కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ టాక్ ని బట్టి నిర్ణయం తీసుకుంటారు. ఎంత పవన్ సినిమా అయినా భీమ్లా నాయక్ రీమేక్ కాబట్టి జనవరి ఎండింగ్ కో ఫిబ్రవరికో వెళ్తే మంచిదనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకో మూడు రోజుల్లో ఈ రిలీజుల గురించి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో మీటింగ్ ఉందంటున్నారు. చూడాలి ఏం జరగనుందో

Also Read : Gangubai Kathiawadi : పాన్ ఇండియా పోటీ – రేస్ నుంచి అలియా ఔట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి