iDreamPost
android-app
ios-app

Maanaadu / The Loop : మానాడు మీద మనసు పారేసుకున్న టాలీవుడ్

  • Published Dec 06, 2021 | 6:56 AM Updated Updated Dec 06, 2021 | 6:56 AM
Maanaadu / The Loop : మానాడు మీద మనసు పారేసుకున్న టాలీవుడ్

ఇటీవలే తమిళంలో విడుదలై సూపర్ హిట్ అందుకున్న శింబు మానాడు తెలుగులో ఎప్పుడు వస్తుందాని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. నిజానికి ఇది ఒకేసారి రెండు భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. కానీ సెన్సార్ ఆలస్యంతో పాటు ఇతరత్రా కారణాల వల్ల పోస్ట్ పోన్ చేశారు. ఇక అది మొదలు మళ్ళీ బయటికి వచ్చే ప్రయత్నాలు జరగలేదు. దానికి తోడు అఖండ డిసెంబర్ 2న ఉండటంతో ఆ ఆలోచన మానుకున్నారు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇప్పుడు దీన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు పలు సంస్థలు పోటీ పడుతున్నాయట. గీతా ఆర్ట్స్ తో పాటు సితార, శ్రేష్ఠ్ తదితర బ్యానర్లు గట్టి ధరనే కోట్ చేస్తున్నాయని ఫిలిం నగర్ టాక్.

దీనికి సంబంధించి ఒరిజినల్ వెర్షన్ నిర్మాతలు ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. వాటిని సొంతం చేసుకున్న హీరో శింబు తెలుగులో డబ్బింగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. మన్మధ టైంలో వచ్చిన సక్సెస్ ని ఫాలోయింగ్ ని నిలబెట్టుకోలేకపోయిన శింబుకి ఇది మంచి అవకాశంగా కనిపిస్తున్నట్టు ఇన్ సైడ్ న్యూస్. అయితే ఒకవేళ డబ్ చేసినా మానాడు మనవాళ్లకు కనెక్ట్ కావడం అంత సులభం కాదు. అదే తెలుగు హీరోలు చేస్తే ఫలితం దక్కొచ్చు. వరుణ్ తేజ్ లేదా సాయి తేజ్ లాంటి రెండు మూడు ఛాయిస్ లు పెట్టుకుని గీతా సంస్థ ట్రైల్స్ వేస్తున్నట్టుగా వినికిడి. మరి ఇదంతా ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి

మానాడు టైం లూప్ ని ఆధారంగా చేసుకుని తీసిన డిఫరెంట్ పొలిటికల్ కం సోషల్ థ్రిల్లర్. డాక్టర్ తర్వాత ఆ స్థాయిలో వసూళ్లు దక్కించుకుని తమిళనాడులో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. శింబు పని అయిపోయిందనుకుంటున్న వాళ్లకు సమాధానం ఇచ్చింది. ఫామ్ తగ్గిపోయిన దర్శకుడు వెంకట్ ప్రభుని మళ్ళీ రేస్ లో నిలబెట్టింది. లూప్ పేరుతో డబ్బింగ్ స్టేజి దగ్గరే ఆగిపోయిన ఈ మానాడుని ఎవరు చేజిక్కించుకుంటారో వేచి చూడాలి. అసలే టాలీవుడ్ లో రీమేకుల ప్రవాహం కొనసాగుతోంది. మళయాలం తమిళంలో ఏది హిట్ అయినా చాలు వెంటనే మన నిర్మాతల కళ్ళు అటువైపు వెళ్తున్నాయి. అన్నట్టు ఈ మానాడు త్వరలోనే సోనీ లివ్ లో రాబోతోంది

Also Read : Mahesh Babu : మహేష్ సేఫ్ గేమ్ లెక్కలు ఇవే.. మారాల్సింది ఆడియన్సే మరి!

jojobet girişJojobet GirişJojobet GirişCasibomkarın ağrısına ne iyi gelirluxbetluxbetRulobetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş