iDreamPost

వీడియో: ఒంటరిగా ఇంటికి వెళ్తున్న బాలికపై యువకుడి వేధింపులు..

Uttar Pradesh Crime News: ఇటీవల ఒంటరిగా కనిపించే ఆడవాళ్లపై కామాంధులు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా మద్యం మత్తలు కొంతమంది మగాళ్లు మృగాళ్లుగా ప్రవర్తిస్తున్నారు.

Uttar Pradesh Crime News: ఇటీవల ఒంటరిగా కనిపించే ఆడవాళ్లపై కామాంధులు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా మద్యం మత్తలు కొంతమంది మగాళ్లు మృగాళ్లుగా ప్రవర్తిస్తున్నారు.

వీడియో: ఒంటరిగా ఇంటికి వెళ్తున్న బాలికపై యువకుడి వేధింపులు..

దేశంలో నిత్యం ఎక్కడో అక్కడ ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్ల పరంపర కొనసాగుతూనే ఉంది. ఒంటరిగా ఆడవాళ్లు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. చిన్నా.. పెద్ద అనే వయసుతో సంబంధం లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. పట్టణాల్లోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఒంటరి యువతులపై లైంగిక వెధింపులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లో ఓ షాకింగ్ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్ లోని రావత్‌పూర్ మంగళవారం రాత్రి దారుణ ఘటన వెలుగు చూసింది. ఒంటరిగా ఇంటికి వెళ్తున్న ఓ విద్యార్థిపై మద్యం మత్తులో ఉన్న వ్యక్తి వైధింపులకు పాల్పపడ్డాడు. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డు కావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మద్యం దుకాణానికి సమీపంలో ఉన్న షాపు నుంచి కూరగాయలు కొనుక్కొని బాలిక ఇంటికి తిరిగి వస్తుంది. అంతలోనే వెనుక నుంచి ఓ వ్యక్తి వచ్చి ఆ బాలిక నోరు మూసి, కింద పడేసి అఘాయిత్యానికి ప్రయత్నించాడు.

బాలిక అతనికి ఎదురు తిరిగి విడిపించుకోవడానికి ప్రయత్నించింది. అంతలోనే అటువైపు బాటసారులు రావడంతో బాలికను వదిలేసి పారిపోయాడు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు కావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటన వైరల్ కావడంతో ఆ ఏరియా డీసీసీ టీవీ ఫుటేజ్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నింధితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి