iDreamPost

వీడియో: లగ్జరీ కారులో మైనర్ ర్యాష్ డ్రైవింగ్.. ఎంత దారుణం జరిగిందంటే?

Pune Crime News: దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ ఎక్కువ అవుతున్నాయి.ఇటీవల ఎలాంటి లైసెన్స్ లేకుండా మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు బాధ్యులవుతున్నారు.

Pune Crime News: దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ ఎక్కువ అవుతున్నాయి.ఇటీవల ఎలాంటి లైసెన్స్ లేకుండా మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు బాధ్యులవుతున్నారు.

వీడియో: లగ్జరీ కారులో మైనర్ ర్యాష్ డ్రైవింగ్.. ఎంత దారుణం జరిగిందంటే?

ఇటీవల దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్లు చేసే నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మధ్య కాలంలో ఎలాంటి లైసెన్స్.. అవగాహన లేకుండా మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణం అవుతున్నారు. తల్లిదండ్రుల గారాభం, పిల్లల అత్యుత్సాహం వల్ల బైకులు, కార్లు డ్రైవ్ చేస్తూ ప్రమాదాలకు కారణం అవుతున్నారు. పోలీసులు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువస్తున్నా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ మైనర్ లగ్జరీ కారులో డ్రైవ్ చేస్తూ దారుణానికి పాల్పపడ్డాడు. ఈ ఘటన మహరాష్ట్ర పూణేలో జరిగింది. వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్ర పుణేలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పోర్షే లగ్జరీ కారులో వేగంగా వస్తు బైక్ ను బలంగా ఢీ కొట్టాడు. దీంతో బైక్ పై వెళ్తున్న ఇద్దరు ఎగిరి అవతల పడి అక్కడిక్కడే మృతి చెందారు. ఈ దారుణం ఆదివారం ఉదయం జరిగింది. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఘటన తర్వాత కారు నడిపే 17 ఏళ్ల మైనర్ ని స్థానికులు పట్టుకొని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మైనర్ ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గురించి సిటీ డీసీపీ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఓ క్లబ్ లో పార్టీ చేసుకొని తిరిగి వస్తుండగా కళ్యాణి నగర్ జంక్షన్ వద్ద బైక్ పై వస్తున్నవారిని ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారని తెలిపారు.

నగరానికి చెందిన ఓ బిల్డర్ కొడుకు అయిన మైనర్.. పోర్షే కారును డ్రైవింగ్ చేస్తూ ఈ దారుణానికి పాల్పపడ్డారని పోలీసులు తెలిపారు. మైనర్ మద్యం సేవించి ఉన్నాడా? లేదా అన్న విషయాన్ని గుర్తించేందుక వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అతనిపై ఎరవాడ పోలీస్ స్టేషన్ లో 279 (ర్యాష్ డ్రైవింగ్), 304 ఎ( నిర్లక్ష్యపు డ్రైవింగ్, మరణం) 337 (మానవ ప్రాణాలకు హాని కలిగించడం), 338 (తీవ్రమైన గాయం కలిగించడం ), మోటార్ వాహనాల చట్టం లోని నిబంధనలు సహా వివిధ సెక్షన్ల కింద మైనర్ పై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి