iDreamPost
android-app
ios-app

తన స్వార్థం కోసం భర్తను బలి చేసిన భార్య!

  • Published Jul 10, 2023 | 6:22 PM Updated Updated Jul 10, 2023 | 6:22 PM
  • Published Jul 10, 2023 | 6:22 PMUpdated Jul 10, 2023 | 6:22 PM
తన స్వార్థం కోసం భర్తను బలి చేసిన భార్య!

సమాజంలో భర్తలు..భార్యను వేధిస్తున్నారనే మాత్రమే ఎక్కువ మందికి తెలుసు. భర్తలు తాగొచ్చి హింసిస్తున్నారని, అదనపు కట్నం కావాలని భార్యను రాచి రంపాన పెడుతున్నారు.. ఇవే మహిళలపై వేధింపులు, గృహ హింస గురించి వినిపించే పదాలు. ఇలాంటి వేధింపుల నుంచి మహిళలను రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలు చేశాయి. అయితే ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే.. భార్యల స్వార్థానికి భర్తలే బలయ్యే పరిస్థితి వచ్చాయనిపిస్తుంది. ప్రతిభ, ఆసక్తి ఉన్న భార్యలను ప్రోత్సహిస్తున్న భర్తలకు.. అదే శాపంగా మారుతుంది. తాను కష్టపడి.. మంచి జాబ్ అందిస్తున్న భర్తలకు.. భార్యలు షాకిస్తున్నారు. తాజాగా ఓ భార్య.. తన స్వార్థం కోసం భర్తను బలి చేసింది. ఇక  పూర్తి వివరాల్లోకి వెళ్తే…

ఉత్తరప్రదేశ్‌కే చెందిన అర్జున్‌, సవిత అనే దంపతులు నివాసం ఉంటున్నారు. అర్జున్ కాస్తా నల్లగా, సవిత్ తెల్లగా ఉండేది. అయినా వారిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. సవితకు నర్సింగ్ చదవడం అంటే ఇష్టమని తన భర్తతో చెప్పింది. ఆమె మాటను కాదనలేక.. ఇంకా ఆమె చదువుకుంటే.. కుటుంబానికి ఆర్థికంగా తోడు ఉంటుందని అర్జున్ భావించాడు. దీంతో రేయింబవళ్లు కష్టపడిన అర్జున్.. తన భార్య సవితను నర్సింగ్‌ చదివించాడు. ఇక వారి అదృష్టం బాగుండి.. ఇటీవల సవితకు ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగం వచ్చింది.  ప్రభుత్వ ఉద్యోగం రావడంతో సవిత ప్రవర్తనలో మార్పు వచ్చింది. భర్తను నల్లగా ఉన్నావని సవిత  అవమానించింది.

కొంత కాలానికి తన స్టేటస్‌కు సరిపోవని చెప్పి.. మానసికంగా హింసకు గురి చేసింది. ఈ విషయంలో బాధ పడుతుండగానే సవిత.. అర్జున్ ను వదిలేసింది. దీంతో అర్జున్‌ ఇప్పుడు పోలీసులను ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను  వేడుకున్నాడు. నేటికాలంలో కొందరు మహిళలు.. పరాయి మగాడి మోజులో పడి భర్త చివరకు మోసం చేయడం చాలా దారుణం. భార్యే ప్రపంచంగా బ్రతికిన వారికి చివరికి ఇలాంటి గతి పట్టడంతో భర్తలు పోలీసులను ఆశ్రయించారు. ఉద్యోగం రాకముందు ఒకలా.. ఉద్యోగం వచ్చాక ఒకలా మారిపోవడం కొందరి ఆడవాళ్లలోని స్వార్థాన్ని బయటపెడుతుంది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomgrandpashabetşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobet güncel girişcratosroyalbetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom