iDreamPost
android-app
ios-app

భార్యపై కోపంతో కూతురిని హత్య చేసిన కసాయి తండ్రి!

భార్యపై కోపంతో కూతురిని హత్య చేసిన కసాయి తండ్రి!

నేటికాలంలో భార్యాభర్తలు చిన్న చిన్న గొడవలకే విడిపోతున్నారు. ఇద్దరిలో అహం ఉండటం కారణంగానే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంకా దారుణం ఏమిటంటే.. శత్రువుల కంటే దారుణంగా భార్యాభర్తలు మారుతున్నారు. ఈ క్రమంలో భాగస్వామిపై కోపంతో కన్న బిడ్డలను కడతేర్చుతున్నారు. ఇటీవలే హైదరాబాద్ లో భార్యపై కోపంతో ఐదేళ్ల తన కుమార్తెను బ్లేడ్ తో కోసి హత్య చేశాడు ఓ కసాయి తండ్రి.. తాజాగా భార్య మీద అనుమానంతో, కోపంతో కన్నకూతురినే బండతో మోది హత్య చేశాడు మరో కసాయి తండ్రి. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.

ప్రకాశం జిల్లా కనిగిరి మండలం మార్కొండాపురం గ్రామానికి చెందిన బూసిరాజు వెంకటేశ్వర్లు, పద్మాపురం గ్రామానికి చెందిన వెంకట నరసమ్మలకు  16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వెంకటేశ్వర్లు మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసై నిత్యం వేధిస్తుండే వాడు. దీంతో కనిగిరి నుంచి పిల్లలతో కలిసి వెంకట నరసమ్మ తన పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు కూడా తన సొంతూరు వెళ్లిపోయాడు. ఇలా ఇద్దరు రెండు నెలలుగా విడి విడిగా ఉంటున్నారు. నరసమ్మ..తన సోదరుడితో కలిసి రోజూ పద్మాపురం నుంచి కనిగిరి..బేల్దారి పనులుకు వచ్చేది.

పట్టణంలోనే చదుతువుతున్న చిన్న కుమార్తె మంజుల(13)ను తమ వెంట తీసుకొచ్చి పాఠశాలలో దిగబెడతారు.  పని ముగిసిన తరువాత సాయంత్ర తమ వెంట తీసుకపోయేవారు. సోమవారం సాయంత్ర యథావిధిగా కుమార్తెను ఇంటికి తీసుకెళ్లందుకు పాఠశాలకు వెళ్లింది. అయితే అప్పటికే ఆమె తండ్రితో కలిసి వెళ్లినట్లు సహా విద్యార్థులు చెప్పారు. అయితే ఉపాధ్యాయుల అనుమతితో పాఠశాల నుంచి మంజులను తీసుకెళ్లిన వెంకటేశ్వర్లు.. ఎన్.గొల్లపల్లి చెరువు సమీపంలో ఉన్న రాళ్ల గుట్ట వరకు వెళ్లారు. ఎవరు లేని సమయంలో చూసి కింద పడేసి రాళ్లతో తల, ముఖంపై మోది అత్యంత కిరాతకంగా హతమార్చాడు. అనంతరం పరారయ్యాడు.

మంగళవారం ఉదయం ఆ ప్రాంతంలో జనం గుమ్మిగూడటంతో నరసమ్మ, ఆమె సోదరుడు వెళ్లి చూశారు. అక్కడ మంజుల మృతదేహం చూసి నరసమ్మ కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘాతుకానికి పాల్పడింది.. మంజుల తండ్రే అని పోలీసులు గుర్తించారు. నెలకో బిడ్డను చంపుతానని బెదిరించేవాడని, నిజంగా అన్నంత పనీ చేస్తాడనీ ఊహించలేకపోయానని మంజుల తల్లి విలపించిన తీరు కంటతడి పెట్టించింది. మరి..  ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సినిమా స్టైల్లో భార్య స్కెచ్.. భర్తను నమ్మించి తీసుకెళ్లి..

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet