iDreamPost

వేరే గదిలో పడుకున్న భార్య.. ఉదయం భర్త లేచి చూడగా..

Kakinada District: శనివారం అర్ధరాత్రి ఓ దంపతులు నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి సమయంలో భర్త లేచి..వేరే గదిలో ఉన్న భార్య వద్దకు వెళ్లాడు. ఆమెను ఆస్థితిలో చూసి షాకి గురయ్యాడు.

Kakinada District: శనివారం అర్ధరాత్రి ఓ దంపతులు నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి సమయంలో భర్త లేచి..వేరే గదిలో ఉన్న భార్య వద్దకు వెళ్లాడు. ఆమెను ఆస్థితిలో చూసి షాకి గురయ్యాడు.

వేరే గదిలో పడుకున్న భార్య.. ఉదయం భర్త లేచి చూడగా..

ప్రతి ఒక్కరు తమ సంసారం ఎంతో సాగాలని కోరుకుంటారు. ముఖ్యంగా మహిళలు భర్త, పిల్లలతో హాయిగా జీవించాలనే కోరుకుంటారు. అలానే ఓ మహిళ కూడా తన భర్త పిల్లలతో సంసార జీవితాన్ని సాగిస్తుంది. ఇద్దరు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే శనివారం అర్ధరాత్రి ఆ ఇద్దరు దంపతులు నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి సమయంలో భర్త లేచి..వేరే గదిలో ఉన్న భార్య వద్దకు వెళ్లాడు. ఆమెను ఆస్థితిలో చూసి షాకి గురయ్యాడు. ఈ ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. సర్పవరం పోలీసులు తెలిపిన వివరాలు మేరకు..

కాకినాడ గ్రామీణ మండలం సూర్యారావుపేట ఫిషింగ్‌ హార్బర్‌లో ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. సర్పవరం మండలం సూర్యారావుపేట ఫిషింగ్ హార్బర్ లో ఓలేటి నరసింహమూర్తి, సీత(26) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరిద్దరికి ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇక నరసింహమూర్తి, సీత దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. వలసపాకలలోని రొయ్యల కంపెనీలో సీత కూలీకి వెళ్తుండేది. అలానే ఆమె భర్త నరసింహమూర్తి  పోర్టులో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. అలానే మరోవైపు రిక్షా నడుపుతూ ఉండేవాడు. ఇలా ఇద్దరు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.

ఇద్దరు కుమారులను సీత ఎంతో ప్రేమగా చూసుకునేది. అలా సాగిపోతున్న వీరి జీవితంలో ఆదివారం ఘోరం జరిగింది. అసలు ఏమి జరిగిందో తెలియాలంటే..శనివారం ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం… శనివారం రాత్రి 11 గంటలకు నరసింహమూర్తి, సీత దంపతులతో పాటు కుటుంబ సభ్యులంతా నిద్రించారు. ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంట్లో విద్యుత్ పోయింది. దీంతో సీత వేరొక గదిలోకి వెళ్లి  నిద్రించింది. ఇక ఆదివారం ఉదయం 6 గంటలకు నరసింహమూర్తి నిద్రలేచి చూడగా సీతను ఆ స్థితిలో చూసి షాకి గురయ్యాడు. తలపై కొట్టిన ఆనవాళ్లతో ఆమె రక్తపు మడుగులో పడి ఉన్నట్లు నరసింహ గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడి చేరుకున్నారు.

అంతేకాక మెడలో బంగారు గొలుసు, చెవిదిద్దుల కోసం తన భార్యను ఎవరో హత్య చేశారంటూ మృతురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ పరిసరాలను పరిశీలించారు. ఈ ఘటనలో భర్తపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల డబ్బుల విషయంలో దంపతుల మధ్య గొడవ జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలోనే పోలీసులు మృతురాలి భర్తపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి ఆ వివాహిత దారుణ హత్య స్థానికంగా సంచలనంగా మారింది. ఈ హత్యలో ఆ  గ్రామం ఒక్కసారిగా ఉల్కిపడింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి