iDreamPost

Israeli Woman: ఇజ్రాయిల్ మహిళ కేరళలో ప్రియురాలిగా మారి.. చివరకు!

సమాజంలో జరిగే కొన్ని ఘటనలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. తాజాగా ఇజ్రాయిల్ కి చెందిన ఓ మహిళ విషయంలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇజ్రాయిల్ నుంచి కేరళకు వచ్చి.. ఇక్కడ ఓ వ్యక్తికి ప్రియురాలిగా మారింది. చివరకు దారుణం చోటు చేసుకుంది.

సమాజంలో జరిగే కొన్ని ఘటనలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. తాజాగా ఇజ్రాయిల్ కి చెందిన ఓ మహిళ విషయంలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇజ్రాయిల్ నుంచి కేరళకు వచ్చి.. ఇక్కడ ఓ వ్యక్తికి ప్రియురాలిగా మారింది. చివరకు దారుణం చోటు చేసుకుంది.

Israeli Woman: ఇజ్రాయిల్ మహిళ కేరళలో ప్రియురాలిగా మారి.. చివరకు!

ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు, సహజీవనం, ప్రేమలు వంటి వాటి కారణంగా దారుణాలు జరుగుతున్నాయి. వీటి కారణంగా జరిగే హత్యలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా సహజీవనం చేసే వారిలో కొందరి మధ్య గొడవలు జరిగి హత్యకు దారి తీస్తున్నాయి. తాజాగా ఇజ్రాయిల్ కి చెందిన ఓ మహిళ.. కేరళలకు వచ్చింది. అక్కడ ఓ వ్యక్తికి ప్రియురాలిగా మారింది. వారిద్దరు కలిసి దాదాపు  ఏడాది పాటు జీవించారు. చివరకు వీరి కథలో దారుణం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

ఉత్తరాఖండ్‌ కు చెందిన కృష్ణచంద్రన్(75) యోగా టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఏడాది క్రితం.. ఇండియాకు వచ్చిన  ఇజ్రాయెల్ కి చెందిన స్వత్వ(36) అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరు కలిసి భార్యాభర్తలుగా సహజీవనం చేశారు. కృష్ణచంద్రన్ తో సహజీవనం చేస్తున్న స్వత్వ ఇజ్రాయెల్ మహిళ కావడంతో.. హిందూ మతాన్ని స్వీకరించి.. తన పేరును రాధగా మార్చుకుంది. ఏడాది పాటు వారిద్దరు ఎంతో సంతోషంగా కలిసి జీవించారు. ఇలా అంతా సజావుగా జరుగుతున్న తరుణంలో.. ఏం జరిగిందో ఏమో కానీ,  స్వత్వ పై కృష్ణచంద్రన్ దాడి చేసి హత్య చేశాడు. ఇరువురి మధ్య ఎలాంటి గొడవలు జరిగాయో తెలియదుగానీ ఇంతటి ఘోరానికి కృష్ణ ఒడిగట్టాడు.

ఈ దారుణ ఘటన కేరళ రాష్ట్రంలోని కొల్లం ప్రాంతంలోని పుంతలతాజాం డీసెంట్ జంక్షన్ సమీపంలోని కోటాలిముక్ వద్ద చోటుచేసుకుంది. గురువారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో స్వత్వను ఆమె భర్త  కృష్ణచంద్రన్ దాడి చేసి హతమార్చాడు. ఆనంతరం.. ఆయన కూడా  ఆత్మహత్యకు ప్రయత్నించాడు. యూపీ వ్యక్తి కేరళాలో హత్య చేయడంపై అందరిలో ఆసక్తి ఏర్పడింది. ఆయుర్వేద చికిత్స కోసం కృష్ణచంద్రన్, స్వత్వ జంట కొల్లం వచ్చినట్లు స్థానికులు తెలిపారు.

అక్కడ ఓ ఇంట్లో స్వత్వ కృష్ణచంద్రన్ కలిసి ఉంటారని చెప్పారు. ఇంతలో ఏమి జరిగిందో కానీ, ఊహించని సంఘటన జరగడంతో ఆ ప్రాంతంలోని స్థానికులంతా నివ్వేరపోయారు. ఈ దారుణాన్ని కృష్ణ చంద్రన్ అన్న కుమార్తె బిందు చూసింది. కృష్ణను చూసేందుకు బిందు ఆయన ఇంటికి  వెళ్లింది. కాలింగ్ బెల్ మోగించింది. కానీ, ఎవరూ ముందు తలుపు తీయలేదు.

కాసేపటికి  వరకు వేచి చూసినా ఎవరూ కనిపించకపోవడంతో.. వెనుక తలుపు తెరిచి చూసేందుకు ఇంట్లోకి ప్రవేశించింది. అప్పుడే స్వత్వ శవమై కనిపించింది. అదే సమయంలో  కృష్ణచంద్ర కూడా కత్తితో పొడుచుకోని రక్తపు మడుగులో పడి ఉండటాని బిందు చూసింది. ఆ దృశ్యం చూసిన బిందు గట్టిగా కేకలు వేస్తూ బయటకి పరుగులు తీసింది. ఇరుపొరుగు వారు అక్కడి చేరుకుని.. కొటియం పోలీసులకు సమాచారం అందించింది. తక్షణమే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.

ఈ హత్యకు, ఆత్మహత్యకు గల కారణాలేమిటనేది ఇంకా స్పష్టంగా తెలియలేదని, ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనను మొదట చూసిన బిందు వాంగ్మూలాన్ని కొటియం పోలీసులు నమోదు చేశారు. కృష్ణచంద్రన్‌ను పరిస్థితి విషమంగా ఉండటంతో.. ప్రత్యేక చికిత్స నిమిత్తం తిరువనంతపురం మెడికల్‌ కాలేజీకి తరలించారు. మరి.. సహ జీవనం కారణంగా జరుగుతున్న ఇలాంటి  ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి