iDreamPost

కెనడాలో భారత సంతతి యువకుడిపై దారుణం!

  • Published Jun 10, 2024 | 12:26 PMUpdated Jun 10, 2024 | 12:26 PM

Canada Crime News: ఉన్నత విద్యనభ్యసించి మంచి పొజీషన్ కి చేరుకోవాలని చాలామంది యువత విదేశాలకు వెళ్తున్నారు.. కానీ ఇటీవల విదేశాల్లో విద్యార్థులకు, ఉద్యోగస్తులకు భద్రత కరువైంది.. భారతీయ సంతతిపై హత్యల పరంపర కొనసాగుతుంది.

Canada Crime News: ఉన్నత విద్యనభ్యసించి మంచి పొజీషన్ కి చేరుకోవాలని చాలామంది యువత విదేశాలకు వెళ్తున్నారు.. కానీ ఇటీవల విదేశాల్లో విద్యార్థులకు, ఉద్యోగస్తులకు భద్రత కరువైంది.. భారతీయ సంతతిపై హత్యల పరంపర కొనసాగుతుంది.

  • Published Jun 10, 2024 | 12:26 PMUpdated Jun 10, 2024 | 12:26 PM
కెనడాలో భారత సంతతి యువకుడిపై దారుణం!

విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించి మంచి ఉద్యోగాలు చేసి సమాజంలో గొప్ప పొజీషన్ లో ఉండాలని భావిస్తుంటారు.తమ పిల్లల్ని విదేశాలకు పంపించేందుకు తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతుంటారు. ఇటీవల విదేశాలకు వెళ్లి విద్యార్థులకు రక్షణ లేకుండా పోతుంది..దాడులు, హత్యలు, రోడ్డు ప్రమాదాలు ఇలా ఎన్నో జరుగుతున్నాయి. అగ్ర దేశం అమెరికాలో కూడా ఎలాంటి రక్షణ లేకుండా పోతుంది. దీంతో విదేశాల్లో తమ పిల్లల పరిస్థితిపై ప్రతిరోజూ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విదేశాల్లో ఉన్నతవిద్యనభ్యసించి తల్లిదండ్రుల కల నెరవేర్చాలన్న ఆ యువకుడి కల నెరవేరలేదు. అనుకోని సంఘటన ఎదురైంది. వివరాల్లోకి వెళితే..

కెనడాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన ఓ యువకుడు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు.. పథకం ప్రకారం దుండగులు అతన్ని హతమార్చినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన 7న జరిగినట్లు పోలీసులు తెలిపారు. సీసీ టీవీ ఫూటేజ్ ఆధారంగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. పంజాబ్ లోని లుథియానాకు చెందిన యువరాజ్ గోయల్ (28) 2019 లో స్టూడెంట్ విసాపై కెనడా వెళ్లాడు. ఇటీవల అతనికి పరమనెంట్ రెసిడెన్సీ (పీఆర్) హూదా లభించింది. అంతా హ్యాపీగా సాగిపోతుందనుకున్న సమయంలో యువరాజ్ హత్యకు గురయ్యాడు.

తమకు అందిన సమాచారం మేరకు యువరాజ్ కి ఎలంటి క్రిమినల్ బ్యాగ్ గ్రౌండ్ లేదని.. హత్యకు కారణాలపై విచారణ జరుగుతుందని కెనడియన్ పోలీసులు తెలిపారు. సర్రేలోని 164 వీధిలో 900-బ్లాక్ లో కాల్పుడు జరిగినట్లు గత శుక్రవారం తమకు ఫోన్ వచ్చిందని.. ఘటనా స్థలానికి చేరుకునే సరికి యువరాజ్ రక్తపు మడుగులో పడి చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని హత్యకు కారణమైన ఒంటారియోకు చెందిన నిందితలుడు ఫ్రాంకోయిస్‌ తో పాటు మన్విర్ బస్రామ్, సాహిబ్ బస్రా, హర్ కిరత్ జుట్టీ లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిపై ఫస్ట్ – డిగ్రీ హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి