iDreamPost

దుబాయ్ లో భర్త.. మరో యువకుడి కారణం. వివాహిత సంచలన నిర్ణయం!

ఈ మద్య కాలంలో చాలా మంది చిన్న విషయాలకే తీవ్ర మనస్థాపానికి గురై బలవన్మరణాలకు పాల్పపడుతూ కుటుంబ సభ్యులకు దుఖాఃన్ని మిగుల్చుతున్నారు.

ఈ మద్య కాలంలో చాలా మంది చిన్న విషయాలకే తీవ్ర మనస్థాపానికి గురై బలవన్మరణాలకు పాల్పపడుతూ కుటుంబ సభ్యులకు దుఖాఃన్ని మిగుల్చుతున్నారు.

దుబాయ్ లో భర్త.. మరో యువకుడి కారణం. వివాహిత సంచలన నిర్ణయం!

దేశంలో నిత్యం ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు, హత్యలు, లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ఒంటరిగా మహిళలు బయటకు వెళ్లాలంటే భయంతో వణికిపోతున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు కామాంధులు ఎవరినీ వదలడం లేదు.. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా కొంతమంది మగాళ్ళ వంకరబుద్ది మారడం లేదు. స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత యువతులు, మహిళల నెంబర్లు ట్రాప్ చేసి కేటుగాళ్ళు వాళ్లను బెదిరించి డబ్బు గుంజడం, లైంగికంగా వేధించడం లాంటివి చేయడంతో మనస్థాపానికి గురైన వారు ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. భర్త దుబాయ్ లో ఉంటారు.. ఓ యువకుడు చేసిన నిర్వాకానికి వివాహిత కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఆదిలాబాద్ జిల్లా పార్‌పెల్లి గ్రామానికి చెందిన ఒడిషెల చిన్న భోజన్న, నాగమణి(35) పెళ్లయిన తర్వాత కొంతకాలం గ్రామంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం కొనసాగించారు. వీరికి ఇద్దరు కుమారులు. బతుకుదెరువు కోసం భోజన్న దుబాయ్ వెళ్లారు. దీంతో మూడేళ్ల క్రితం నాగమణి తన ఇద్దరు కుమారులతో కలిసి నిర్మల్ లోని బెస్తవార్ పేటలో తల్లిగారింటి వద్ద ఉంటూ వస్తుంది. ఈ క్రమంలోనే పార్ పెల్లి గ్రామానికి చెందిన చిలుక వంశీ అనే ఓ యువకుడు వెంబడించడం మొదలు పెట్టాడు. ఆమె ఫోన్ నెంబర్ తెలుసుకొని లైంగికంగా వెధించడం మొదలు పెట్టాడు. మొదట ఆ యువకుడికి నాగమణి గట్టి వార్నింగ్ ఇచ్చింది.. అయినా కూడా అతని తీరు మార్చుకోలేదు.

ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం నాగమణి తనను చిలుక వంశీ అనే యువకుడు కొంతకాలంగా ఫోన్ లో వేధిస్తున్నాడని తల్లితో చెప్పి బాధపడింది. గ్రామ పెద్దలతో చెప్పి మాట్లాడుదాం అని తల్లి ఓదార్చింది. బుధవారం ఉదయం పది గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో నాగమణి ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పపడింది. ఇంటికి వచ్చి చూసిన తల్లి కళావతి ఒక్కసారిగా షాక్ తిన్నది.. వెంటనే స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికీ ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. తల్లి కళావతి ఫిర్యాదు మేరకు నిర్మల్ టౌన్ లో కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. భార్య మృతితో చిన్న భోజన్న దుబాయ్ నుంచి స్వగ్రాం చేరుకున్నాడు. ఇద్దరు కుమారులు శ్రీచరణ్, శ్రీ వర్ధన్ తో కలిసి భార్య మృతదేహం వద్ద కన్నీరు మున్నీరయ్యాడు.. వీరి ఆవేదన చూసి గ్రామస్థులు సైతం చలించిపోయారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి