iDreamPost
android-app
ios-app

ఆ హోటల్ లో ఎగ్ ప్రైడ్ రైస్ తిని యువకుడు మృతి!

  • Published Sep 22, 2023 | 3:50 PM Updated Updated Sep 22, 2023 | 3:50 PM
  • Published Sep 22, 2023 | 3:50 PMUpdated Sep 22, 2023 | 3:50 PM
ఆ హోటల్ లో ఎగ్ ప్రైడ్ రైస్ తిని యువకుడు మృతి!

నేటి కాలంలో ఫుడ్ బిజినెస్ ను ఆసరాగా చేసుకుని ఎంతో మంది నిర్వాహకులు కల్తీ ఆహారాన్ని పెడుతూ ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారు. మొన్నటికి మొన్న కల్తీ ఆహారాన్ని పెడుతున్నారని ఫుడ్ సెఫ్టీ అధికారులు సికింద్రాబాద్ లోని ఆల్ఫా హోటల్ ను సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మరువకముందే తాజాగా ఏపీలోని ఓ హోటల్ లో ఎగ్ ప్రైడ్ రైస్ తిని ఓ యువకుడు మృతి చెందాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

తిరుపతి రూరల్ పరిధిలోని కాలూరులోని ఓ పాస్ట్ ఫుడ్ సెంటర్ లో తాజాగా నరేంద్ర అనే యువకుడు ఎగ్ ప్రైడ్ రైస్ తిన్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి అతడు ఇంటికి వెళ్లాడు. ఇక కొద్దిసేపటి తర్వాత ఆ యువకుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతని కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, పరిస్థితి విషమించడంతో ఆ యువకుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఆ యువకుడి మరణంతో అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అనంతరం ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

Jojobet GirişJojobetşanlıurfa konteynerbetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetStarzbetStarzbetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom