సలార్.. ఈ ఒక్క సినిమా వాయిదా పడుతుందని తెలిసి ఇండస్ట్రీలో చాలా సినిమాలు విడుదల విషయంలో అలర్ట్ అయిపోయాయి. దాదాపు ఏడాది కిందటే సలార్ మేకర్స్ సెప్టెంబర్ 28న మూవీ రిలీజ్ అని ప్రకటించారు. ఎన్నిసార్లు వాయిదా పడుద్దని రూమర్స్ వినిపించినా.. అన్నిసార్లు రూమర్స్ ని ప్రొడ్యూసర్స్ కొట్టిపారేశారు. పైగా అనుకున్న టైమ్ కి వచ్చి తీరుతాం అని ఫ్యాన్స్ లో గట్టి నమ్మకాన్ని కలిగించారు. తీరా రిలీజ్ కి ఇంకా నెల కూడా లేదు అనగా.. సినిమాకు సంబంధించి సీజీ వర్క్ పూర్తి కాలేదని, అందుకే సలార్ ఇప్పట్లో రిలీజ్ కాదని వార్తలు వచ్చేశాయి. ఇంకేముంది.. అది నిజమో కాదో మేకర్స్ అయితే ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
అంతలోనే సలార్ రిలీజ్ డేట్ కోసం.. చాలా సినిమాలు పోటీ పడుతున్నాయి. పాన్ ఇండియా మూవీస్ నుండి చిన్న సినిమాల వరకు సెప్టెంబర్ 28ని టార్గెట్ చేస్తూ.. షెడ్యూల్స్ మార్చుకుంటున్నాయి. అయితే.. సలార్ రావట్లేదని మేకర్స్ చెప్పకపోయినా.. దాదాపు ఖరారు అయిపోయినట్లే. దీంతో రామ్ స్కంద, రూల్స్ రంజన్, మ్యాడ్, పెదకాపు లాంటి సినిమాలు ఆల్రెడీ సెప్టెంబర్ 28, 29 డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. ఇంకా కొన్ని సినిమాలు కూడా డేట్స్ మార్చుకునే ఆలోచనలో ఉన్నాయి. అయితే.. అక్టోబర్ లో రిలీజ్ షెడ్యూల్ చేసుకున్న మాస్ రాజా రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా కూడా డేట్ మార్చుకునే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది.
టైగర్ నాగేశ్వరరావు.. అక్టోబర్ 20న రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకు మేకర్స్ అనౌన్స్ చేశారు. దీనికి తోడు బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి కూడా అప్పుడే రిలీజ్ అవుతోంది. మరోవైపు తమిళం నుండి లియో సేమ్ టైమ్ లో షెడ్యూల్ అయ్యింది. ఈ మూడు కూడా పెద్ద సినిమాలే. సో.. అప్పుడు క్లాష్ పెట్టుకునే బదులు ఎలాగో సలార్ లేదు కాబట్టి.. దాని నెక్స్ట్ వీక్ అంటే.. అక్టోబర్ మొదటి వారంలో రిలీజ్ పెట్టుకుంటే బెటర్ అని టైగర్ నాగేశ్వరరావు మేకర్స్ యోచిస్తున్నారని సమాచారం. ఆ లెక్కన సినిమా ప్రీపోన్ అవుతుందని టాక్. అయితే.. సినిమా ముందే వస్తుందంటే ఆనందమే కానీ.. రవితేజ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ.. సో.. లేట్ అయినా క్వాలిటీలో తేడా రాకూడని, మార్పులు చేయకుండా అదే టైమ్ కి వస్తే బెటర్ అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి మేకర్స్ ఎలా ఆలోచన చేస్తున్నారో చూడాలి. ఇక టైగర్ నాగేశ్వరరావు గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.