iDreamPost

ఈ టెక్నాలజీ.. మనిషి చావు ఎప్పుడో చెప్పేస్తుందట!

This AI Tool Can Predict Death: మనిషి ఇప్పుడు టెక్నాలజీ సాయంతో ఎన్నో విషయాలను ముందుగానే అంచనా వేస్తున్నాడు. కానీ, మరణాన్ని మాత్రం అంచనా వేయలేకపోతున్నాడు. ఈ టెక్నాలజీతో అది కూడా సాధ్యం అంటున్నారు.

This AI Tool Can Predict Death: మనిషి ఇప్పుడు టెక్నాలజీ సాయంతో ఎన్నో విషయాలను ముందుగానే అంచనా వేస్తున్నాడు. కానీ, మరణాన్ని మాత్రం అంచనా వేయలేకపోతున్నాడు. ఈ టెక్నాలజీతో అది కూడా సాధ్యం అంటున్నారు.

ఈ టెక్నాలజీ.. మనిషి చావు ఎప్పుడో చెప్పేస్తుందట!

కన్ను తెరిస్తే జననం.. కన్ను తెరిస్తే మరణం.. రెప్పపాటు జీవితం అంటారు. ప్రస్తుతం టెక్నాలజీ ఎంత డెవలప్ అయ్యిందంటే ఒక బిడ్డ ఏ రోజు, ఏ సమయానికి, ఎన్ని నిమిషాలకు పుడతారో కూడా అంచనా వేయచ్చు. కానీ, ఇప్పటికీ ఎవరూ సమాధానం చెప్పలేక పోయిన ప్రశ్న ఏంటంటేం ఎప్పుడు చనిపోతారు? ఫలనా వ్యక్తి మరణించేది ఎప్పుడు? నిజానికి ఈ ప్రశ్న అడగితే అందరూ వితగా చూస్తారు. అయితే ఇప్పుడు టెక్నాలజీ ఆ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పేందుకు సిద్ధమైపోయింది అంటున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో మనిషి మరణాన్ని కూడా అంచనా వేయచ్చు అంటున్నారు. అంతేకాకుండా ఆ ఏఐ టెక్నాలజీ ఇచ్చిన సమాధానాల్లో చాలావరకు కరెక్ట్ కూడా అవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సంచలనంగా మారింది.

2023లో బాగా వైరల్ అయిన విషయం, ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ఏదైనా ఉందంటే అది ఏఐ టెక్నాలజీ అని చెప్పాలి. చాట్ జీపీటీ రావడంతో ప్రపంచం మొత్తం ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వైపు చూసింది. అందరూ ఈ చాట్ జీపీటీ గురించే మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. అంతేకాకుండా ప్రముఖ టెక్ దిగ్గజాలు చాట్ జీపీటీ తరహాలో చాట్ బాట్లను తయారు చేశారు. చాట్ జీపీటీ తర్వాత.. గూగుల్ బార్డ్, ఇప్పుడు గూగుల్ జెమినీ కూడా వచ్చాయి. ఇవన్నీ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో పనిచేస్తాయి. ఇవన్నీ మనిషి జీవనాన్ని సులభతరం చేసేలా.. అతని మేథస్సును పెంచుకునేలా ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి టెక్నాలజీతోనే మనిషి మరణాన్ని కూడా అంచనా వేస్తున్నారు. అందుకు సంబంధించిన సర్వే ఫలితాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

శాస్త్రవేత్తలు ఈ ఏఐ టెక్నాలజీ సాయంతో ఒక అల్గారిథమ్ ని తయారు చేశారు. ఈ టూల్ ద్వారా ‘మనిషి ఎలా జీవిస్తాడు- ఎలా మరణిస్తాడో’ కూడా తెలుసుకోవచ్చు అంటున్నారు. ఆ టూల్ చాట్ జీపీటీ, గూగుల్ బార్డ్ తరహాలోనే పనిచేస్తుందట. దాని పేరు Life 2 Vec. ఈ టెక్నాలజీ మనిషి ఎప్పుడు చనిపోతాడో ముందే చెప్పేస్తుందట. ఒక సర్వే నివేధికల ప్రకారం చూస్తే.. ఈ లైఫ్ 2వీఈసీ చెప్పిన వాటిలో 78శాతం అంచనాలు నిజమయ్యాయని చెబుతున్నారు. ఈ స్థాయిలో సరైన సమాధానాలు చెప్పడంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ టెక్నాలజీ హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ అల్గారిథమ్ ని అభివృద్ధి చేసింది.. టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్, యూఎస్ రీసెర్చర్లు ఈ డెత్ కాలిక్యులేటర్ ని తయారు చేశారు. టెస్టింగ్ లో భాగంగా మొత్తం 6 లక్షల మందికి సంబంధించిన డేటాను ఈ అల్గారిథమ్ కు అందించారు.

AI robot about death

ఆ డేటాలో వారి వృత్తి, ఆదాయం, ప్రమాదాలు ఏమైనా జరిగాయా? జీవన విధానం, పుట్టిన ప్రదేశం ఇలా 21 రకాల ప్రశ్నలకు సమాధానాలు అందించారు. ఆ తర్వాత ఆ అల్గారిథమ్ 6 లక్షల మంది మరణానికి సంబంధించిన అంచనాలను చెప్పింది. ఆ అల్గారిథమ్ కు అందించిన డేటాలో ఉన్న వారిలో కొంతమంది త్వరగా చనిపోతారని వెల్లడించింది. అందుకు గల కారణాలను కూడా ఈ ఏఐ టూల్ అందివ్వడం గమనార్హం. ఆ కారణాలు ఏంటంటే.. మగవాళ్లు కావడం, మెంటల్ హెల్త్, ఎక్కువ జీతం, కంపెనీల్లో టీమ్ లీడర్స్ గా ఉండటం, స్కిల్డ్ వర్కర్స్ అయి ఉండటం అనే కారణాలను ఇచ్చింది. ఈ టూల్ కి దాదాపు 8 ఏళ్లకు సంబంధించిన డైటాతో ట్రైనింగ్ ఇచ్చారంట. 2008 నుంచి 2016 వరకు ఉన్న జనాభా డేటాతో ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ఏఐ టూల్ చెప్పిన విధంగా 2020 నాటికి 3 శాతం కంటే ఎవరు మరణించారో సరిగ్గా అంచనా వేయగలిగింది.

ఈ విషయాన్ని చెబుతూ ప్రొఫెసర్ సునే లెహ్మాన్.. మరణాల డేటాను మాత్రం వెల్లడించలేదు. సున్నితమైన అంశం కాబట్టి రివీల్ చేయలేదు. ఈ టెక్నాలజీకి సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఎప్పుడు చనిపోతాం అనే విషయాన్ని తెలుసుకోవాలనే కోరిక ఎందుకు ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. శాస్త్రవేత్తలు అసలు ఇలాంటి ఒక పరిశోధన చేయాల్సిన అవసరం ఏంటి అంటూ పెదవి విరుస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఈ టూల్ సాయంతో మన జీవన విధానాన్ని మార్చుకొని.. మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. మరణాన్ని ముందే చెప్పే ఈ టెక్నాలజీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి