iDreamPost
android-app
ios-app

రూ.5 కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేసిన అనుష్క.. కారణం అదేనా?

  • Published Jun 21, 2024 | 11:12 AM Updated Updated Jun 21, 2024 | 11:12 AM

Anushka Shetty: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క తాజాగా ఓ భారీ ప్రాజెక్ట్ లో ఆఫర్ ను రిజక్ట్ చేసిందట. పైగా ఆ ప్రాజెక్ట్ ఓ స్టార్ దర్శకుడు, స్టార్ హీరో కాంబినేషన్ లోనిది కావడం గమన్హారం. అంతేకాకుండా ఈ సినిమాకు గాను అనుష్కకు భారీ రెమ్యునరేషన్ డా ఆఫర్ చేశారట. అయిన అనుష్క ఆ సినిమాను చేయనని రిజక్ట్ చేసిందట. కారణమేమిటంటే..

Anushka Shetty: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క తాజాగా ఓ భారీ ప్రాజెక్ట్ లో ఆఫర్ ను రిజక్ట్ చేసిందట. పైగా ఆ ప్రాజెక్ట్ ఓ స్టార్ దర్శకుడు, స్టార్ హీరో కాంబినేషన్ లోనిది కావడం గమన్హారం. అంతేకాకుండా ఈ సినిమాకు గాను అనుష్కకు భారీ రెమ్యునరేషన్ డా ఆఫర్ చేశారట. అయిన అనుష్క ఆ సినిమాను చేయనని రిజక్ట్ చేసిందట. కారణమేమిటంటే..

  • Published Jun 21, 2024 | 11:12 AMUpdated Jun 21, 2024 | 11:12 AM
రూ.5 కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేసిన అనుష్క.. కారణం అదేనా?

సినీ ఇండస్ట్రీలో హీరోలతో సమానంగా క్రేజ్ ఉన్న హీరోయిన్స్ కొంతమంది మాత్రమే ఉంటారు. పైగా వారు ఇండస్ట్రీలో కొనసాగనప్పటికి వారి క్రేజ్ మాత్రం అలానే ఉంటుంది. ముఖ్యంగా వారు అంతగా సినిమాలు చేయకపోయినా.. వారు చేసిన సినిమాలతో ప్రేక్షకులు వారిని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. మరి, అంతలా ప్రేక్షకుల ఆదరణ పొంది మంచి పాపులారిటీ తెచ్చుకున్న వారిలో హీరోయిన్ ‘అనుష్క శెట్టి’ కూడా ఒకరు. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో ఒకరు. ఇకపోతే అనుష్క తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకొని.. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే వెండితెర పై గ్లామర్ రోల్స్ తో పాటు లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో కూడా ఒదిగిపోయి అద్భుతంగా నటించింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ అమ్మడు ఓ భారీ ప్రాజెక్టును కేవలం చిన్న కారణంతో రిజక్ట్ చేసిందని టాక్ వినిపిస్తోంది.  ఆ వివరాళ్లోకి వెళ్తే..

బాహుబలి సినిమాలో  నటించి పాన్ ఇండియా హీరోయిన్ గా మంచి ఫేమ్ ను సంపాదించుకున్న అనుష్క ఆ తర్వాత.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో మూవీస్ చేస్తూ బిజీగా హీరోయిన్ గా మారుతుందని అందరూ అనుకున్నారు. కానీ, అనుష్క మాత్రం పూర్తిగా సినిమాలకు దూరం అయిపోయింది. ఇక చాలా గ్యాప్ తర్వాత అనుష్క.. గతేడాది నవీన్ పొలిశెట్టి సరసన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. కాగా,ఇందులో తన క్యూట్ లుక్స్ తో మరోసారి అందర్నీ కట్టిపడేసింది ఈ బ్యూటీ. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో విడుదలై మంచి సక్సేస్ ను అందుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా అనుష్క ఓ భారీ ప్రాజెక్టును రిజెక్ట్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

పైగా ఆ ప్రాజెక్టు ఓ స్టార్ దర్శకుడు, స్టార్ కాంబినేషన్ లోనిదని, అందులో అనుష్క కు కథానాయికగా ఎంపిక చేశారనేది సమాచారం. అంతేకాకుండా ఈ చిత్రానికి అనుష్కకు రూ.5 కోట్లు రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట. అయిన సరే అనుష్క తాను ఆ ప్రాజెక్టులో చేయనని చెప్పేసిందట. ఎందుకంటే..ఈ మూవీలో హీరోయిన్ పాత్రకు అంతగా ప్రాధాన్యం లేదని, కేవలం గ్లామర్ కోసమే అనుష్కను ఎంపిక చేశారని.. అందుకే ఈ ప్రాజెక్టు ఆఫర్ రిజక్ట్ చేసినట్లు తెలుస్తుంది. అయితే దీనిపై అఫీషియల్ క్లారిటీ రాలేదు. ఇక ప్రస్తుతానికి అనుష్క క్రిష్ దర్శత్వంలో  త్వరలోనే ఓ సినిమాలో నటిస్తోంది. మరి, భారీ ప్రాజెక్ట్ ను అనుష్క రిజక్ట్ చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetjojobet girişjojobet girişjojobet girişcasibom