iDreamPost

ఫిబ్రవరి 20న విడుదల కానున్న ఆపరేషన్ వాలెంటైన్ థియేట్రికల్ ట్రైలర్

  • Published Feb 19, 2024 | 10:12 AMUpdated Feb 19, 2024 | 1:02 PM

యదార్థ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన ఆపరేషన్ వాలెంటైన్ దేశభక్తి అంశాలతో కూడుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నెల 20న విడుదల చేయనున్నట్టు ఇటీవలే నిర్మాతలు ప్రకటించారు.

యదార్థ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన ఆపరేషన్ వాలెంటైన్ దేశభక్తి అంశాలతో కూడుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నెల 20న విడుదల చేయనున్నట్టు ఇటీవలే నిర్మాతలు ప్రకటించారు.

  • Published Feb 19, 2024 | 10:12 AMUpdated Feb 19, 2024 | 1:02 PM
ఫిబ్రవరి 20న విడుదల కానున్న ఆపరేషన్ వాలెంటైన్ థియేట్రికల్ ట్రైలర్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తొలి పాన్ ఇండియా చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. ఈ సినిమాతో శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కాగా మార్చి 1న తెలుగుతో పాటు హిందీలో ఒకే సారి గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు ప్రమోషన్స్ పరంగా చిత్ర బృందం అన్ని రకాల జాగర్తలు తీసుకుంటుంది. ముఖ్యంగా హీరో వరుణ్ తేజ్ ఎన్నడూ లేని విధంగా ప్రచార కార్యక్రమాల్లో దూకుడుగా పాల్గొంటున్నారు.

ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నెల 20న విడుదల చేయనున్నట్టు ఇటీవలే నిర్మాతలు ప్రకటించారు. పోస్టర్ చూస్తే, థియేట్రికల్ ట్రైలర్ యాక్షన్‌తో నిండి ఉంటుందని అర్థం అవుతుంది. యుద్ధ రంగంలో ఉన్న వరుణ్ తేజ్ పోస్టర్‌లో చురుగ్గా కనిపిస్తున్నారు. ‘ఆపరేషన్ వాలెంటైన్‌’ టీమ్‌ దేశ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని ప్రమోట్‌ చేస్తోంది. ఇక విడుదల తేదీ ఎంతో దూరంలో లేకపోవడంతో ప్రచార కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలోని గగనాల, వందేమాతరం వంటి పాటలు ఇప్పటికే విడుదలయి ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ట్రైలర్ తో సినిమా మీద మరిన్ని అంచనాలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ సినిమాని హ్రితిక్ రోషన్ ఫైటర్ తో పోలుస్తున్నారు. ఎందుకంటే రెండు సినిమాలు కూడా ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కాయి.

Theatrical trailer of Operation Valentine will release on February 20

యదార్థ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన ఆపరేషన్ వాలెంటైన్ దేశభక్తి అంశాలతో కూడుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో అర్జున్ దేవ్ పాత్రలో వరుణ్ తేజ్, రాడార్ ఆఫీసర్ పాత్రలో మానుషి చిల్లర్ నటించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్ద రెనైసాన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్ శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హాడా, అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ కథ రాసిన ఈ చిత్రం 2024 మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి