iDreamPost
android-app
ios-app

సమ్మర్ ఎఫెక్ట్: దొంగతనానికి వచ్చి.. AC గదిలో నిద్రపోయిన దొంగ!

  • Published Jun 03, 2024 | 6:52 PMUpdated Jun 03, 2024 | 6:52 PM

సాధారణంగా దొంగలు అంటే ఎవరికీ తెలియకుండా వచ్చి.. దొరికినంత దోచుకొని మెల్లగా జారుకుంటారు. ఇలా చాలా ఇళ్లలోకి చొరబడి, నగలు,డబ్బులు విలువైన వస్తువులు చక్కగా ముట కట్టుకొని దర్జాగా మూడో కంటికి తెలియకుండా పారిపోతుంటారు. కానీ, తాజాగా ఓ దొంగ మాత్రం అలా కాదు. దొంగతనానికి వెళ్లి దొరికినది దోచుకున్నాడు. కానీ పారిపోయే క్షణంలో మాత్రం ఊహించని పని చేశాడు. ఇంతకి ఏం జరిగిందంటే..

సాధారణంగా దొంగలు అంటే ఎవరికీ తెలియకుండా వచ్చి.. దొరికినంత దోచుకొని మెల్లగా జారుకుంటారు. ఇలా చాలా ఇళ్లలోకి చొరబడి, నగలు,డబ్బులు విలువైన వస్తువులు చక్కగా ముట కట్టుకొని దర్జాగా మూడో కంటికి తెలియకుండా పారిపోతుంటారు. కానీ, తాజాగా ఓ దొంగ మాత్రం అలా కాదు. దొంగతనానికి వెళ్లి దొరికినది దోచుకున్నాడు. కానీ పారిపోయే క్షణంలో మాత్రం ఊహించని పని చేశాడు. ఇంతకి ఏం జరిగిందంటే..

  • Published Jun 03, 2024 | 6:52 PMUpdated Jun 03, 2024 | 6:52 PM
సమ్మర్ ఎఫెక్ట్:  దొంగతనానికి వచ్చి.. AC గదిలో నిద్రపోయిన దొంగ!

ప్రస్తుత కాలంలో దొంగతనాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. సినిమాల్లో మించిన విధంగా బయట మాస్టర్ మైండ్ తో చోరిలకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో.. కొందరు చోరిలకు పాల్పడే విధానం చూస్తే అసలు వారు పక్కా ప్రొఫెషనల్ దొంగాల్లా అనిపిస్తారు.చాలా జాగ్రత్తగా ఏమాత్రం ఎవరికి దొరకకుండా దొంగతనం చేసి.. మెల్లగా జారుకుంటారు. కొన్నిసార్లు అయితే పక్కనే నిలబడొ మన జేబు కొట్టేసినా.. ఏమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్త పడతారు. కానీ, తాజాగా ఓ ఇంట్లో చోరికు పాల్పడిన ఓ దొంగ మాత్రం.. దొంగతనం చేసామా, దొరికనంతా దోచుకున్నమా.. అంతవరకు బాగానే ప్లాన్ చేసుకున్నాడు. కానీ, పారిపోయే క్షణంలో మాత్రం ఊహించని పని చేశాడు. ఇంతకి ఏం జరిగిందంటే..

సాధారణంగా దొంగలు అంటే ఎవరికీ తెలియకుండా వచ్చి.. దొరికినంత దోచుకొని మెల్లగా జారుకుంటారు. ఇలా చాలా ఇళ్లలోకి చొరబడి, నగలు,డబ్బులు విలువైన వస్తువులు చక్కగా ముట కట్టుకొని దర్జాగా మూడో కంటికి తెలియకుండా పారిపోతుంటారు. కానీ, తాజాగా ఓ దొంగ మాత్రం అలా కాదు. దొంగతనానికి వెళ్లి అక్కడ ఏసి పెట్టుకొని గాఢ నిద్రలోకి జరుకున్నాడు. అయితే ఆ గాఢ నిద్రలోకి జారుకోవడంతో తెల్లావారుజామున అయినా మెలకువ రాలేదు. కానీ, చివరికి నిద్రలో నుంచి లేచేసరికి పోలీసుల ముందు ప్రత్యేక్ష్యం అయ్యారు. ఈ విచిత్ర సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని రాజధాని లక్నోలో చోటు చేసుకుంది. కాగా, ఆ నగరంలోని ఇందిరానగర్ సెక్టార్ 20లో నివసిస్తున్న డాక్టర్ సునీల్ పాండే అనే వ్యక్తి తన ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లాడు. ఇక ఈ విషయాన్ని గమనించిన ఓ దొంగ ఆదివారం తెల్లవారుజామున ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. ఈ క్రమంలోనే.. ఇంటి తాళం పగలగొట్టి డబ్బులు, బంగారం, ఇతర నగలు, ఇంట్లోని గిన్నెలు సహా విలువైన వస్తువులను గోనె సంచిలో వేసి మూట కట్టుకున్నాడు. ఆ తర్వాత బెడ్ రూమ్ లో ఉన్న ఏసీని చూడగానే.. ఆ దొంగకి ఒక్కసారిగా నిద్రపోవాలి అనిపించింది.  వెంటనే బెడ్రూంలో ఏసీ ఆన్ చేసుకుని పడుకున్నాడు.

దీంతో ఆ ఏసీనే దొంగ పాలిట శాపంగా మారి అతడిని పోలీసులకు పట్టించేలా చేసింది. ఇక తెల్లవారుజామున సునీల్ పాండే ఇంటి తాళం పగులగొట్టి ఉండటాని గమనించిన ఇరుగుపొరుగు ఇళ్ల వారు వెంటనే లోపలికి వెళ్లి చూడగా.. సామాన్లతో నిండిని గోనె సంచి కనిపించింది. అలా బెడ్రూంలోకి వెళ్లి చూడగా.. ఏసీ కింద ఓ దొంగ దర్జాగా పడుకుని కనిపించాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. అయితే అప్పటివరకు కూడా ఆ దొంగ మంచి గాఢనిద్రలో ఉండటం గమనార్హం. చివరికి ఆ దొంగను పోలీసులు నిద్రలేపారు. కళ్లు తెరిచిన ఆ దొంగ.. తన చుట్టూ పోలీసులు ఉండటం చూసి షాక్ అయ్యాడు. ఆ దొంగను ముసద్దిపూర్ ప్రాంతంలో నివసించే కపిల్ కశ్యప్‌గా పోలీసులు గుర్తించారు. ఇక తాళం పగులకొట్టి ఇంట్లోకి ప్రవేశించిన కపిల్ కశ్యప్.. ఇన్వర్టర్ బ్యాటరీ, గీజర్, పాత్రలు, మరికొన్ని వస్తువులను రెండు బస్తాల్లో నింపి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే అతడిపై ఇప్పటికే 6 దొంగతనం కేసులు ఉండగా.. నెల రోజుల క్రితమే బెయిల్‌పై జైలు నుంచి బయటికి వచ్చినట్లు సమాచారం. మరి, దొంగతనానికి వెళ్లి ఏసీకి ఆశపడి ఆ దొంగ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి