iDreamPost
android-app
ios-app

వీడియో: గుడిలో హుండీ డబ్బులు కొట్టేసిన పూజారి!

వీడియో: గుడిలో హుండీ డబ్బులు కొట్టేసిన పూజారి!

ఈ మధ్యకాలంలో కొందరు పూజారులు సైతం మతిపోయి ప్రవర్తిస్తున్నారు. ఏకంగా గుడిలో ఉండే హుండీలో డబ్బులు కొట్టేస్తు పరువు తీస్తున్నారు. ఇటీవల కూడా ఓ పూజారి గుళ్లో దొంగతనానికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ ఘటన మరువక ముందే తాజాగా ఇలాంటి ఘటనే ఏపీలో వెలుగు చూసింది. గుడిలో పూజారిగా ఉన్న ఓ వ్యక్తి అందులోఉండే హుండీలోని డబ్బులు కొట్టేశాడు. ఇదంతా దేవాలయంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇదే వీడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.

స్థానికుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురంలో ఉన్న నారాయణ స్వామి ఆలయం ప్రతీ ఆదివారం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఇదిలా ఉంటే.. ఇదే గుడిలో పూజారిగా ఉన్న ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఏకంగా ఆ గుడిలో దొంగతనానికి పాల్పడ్డాడు. ఎవరూ లేని టైమ్ చూసి ఆ దేవాలయంలో ఉన్న హుండీలో ఉన్న డబ్బులు కొట్టేశాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

ఇక గుడి అధికారులకు అనుమానం రావడంతో సీసీ కెమెరాను పరిశీలించగా అందులో పూజారి చేసిన తతంగం బయటపడింది. పూజారిగా ఉంటూ ఇవేం పనులు అంటూ స్థానికులు అతని తీరుపై మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. గుడిలోని హుండీలో దొంగతనానికి పాల్పడిన పూజారి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by iNewsofficial (@inewsofficial)

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alluxbetluxbetRulobetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş