iDreamPost

స్కూళ్ల జాత‌కం మారుతోంది

స్కూళ్ల జాత‌కం మారుతోంది

స్కూళ్ల రూపు రేఖ‌లు మారిపోతున్నాయి. మొద‌టి ద‌శ‌లో కాంపౌండ్ గోడ‌, టాయిలెట్ల నిర్మాణం పూర్త‌వుతోంది. విద్య విష‌యంలో జ‌గ‌న్ చాలా ప‌ట్టుద‌ల‌గా ఉన్నాడు. నాడు-నేడు ప‌థ‌కంలో నిధులు దుర్వినియోగం అయ్యే అవ‌కాశ‌మే లేదు. ఎందుకంటే ఈ ప‌నుల‌కి మొత్తం ఏడుగురు (హెడ్మాస్ట‌ర్‌, పేరెంట్స్ క‌మిటీ) బాధ్యులుగా ఉంటారు. ప‌నుల నాణ్య‌త‌ని ఇద్ద‌రు ఇంజ‌నీర్లు ప‌రిశీలిస్తారు. జాయింట్ అకౌంట్ కాబ‌ట్టి ప్ర‌తి రూపాయికి బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంది. మెటీరియ‌ల్ కొనుగోలు, ప‌నుల‌ని అప్ప‌జెప్ప‌డం, అన్నీ కూడా పార‌ద‌ర్శ‌కంగా జ‌ర‌గాల్సిందే. వెన‌క‌టికి చంద్ర‌బాబు హ‌యాంలోలాగా జ‌న్మ‌భూమి క‌మిటీలు లేవు. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కి ప‌నులు ఇవ్వ‌డం, థూథూ మంత్రం ప‌నులు చేసి బిల్లులు చేసుకోవ‌డం సాధ్యం కాదు.

మొద‌టి ద‌శ ప‌నులు మేలోగా పూర్తి చేయాల‌నే ల‌క్ష్యంతో అన్ని జిల్లాల్లో స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. (సిమెంట్ కూడా అందుబాటులో ఉన్న‌ది. కొనుక్కోవ‌చ్చు. భార‌తీ సిమెంట్ కొనాల్సిన అవ‌స‌రం లేదు) రెండో ద‌శ‌లో పిల్ల‌ల‌కు డెస్క్‌లు, పెయింటింగ్‌, నీటి సౌక‌ర్యం, ప్యాన్లు ఏర్పాటు చేస్తారు. ఇదంతా పూర్తి అయితే ప్ర‌భుత్వ స్కూల్క్‌కి కార్పొరేట్ క‌ళ వ‌స్తుంది.

అమ్మ ఒడి త‌ర్వాత పిల్ల‌ల సంఖ్య పెరిగింది. మెనూ మారిన త‌ర్వాత మ‌ధ్యాహ్న భోజ‌నం చేసే పిల్ల‌ల సంఖ్య పెరిగింది. కొన్ని స్కూళ్ల‌లో చ‌క్కీ ఇవ్వ‌డం లేదు. దానికి కార‌ణం వాటిని బ‌య‌ట కొనాల్సి రావ‌డ‌మే. అయితే త్వ‌ర‌లోనే ఇవ‌న్నీ చ‌క్క‌బ‌డుతాయ‌ని అధికారులు అంటున్నారు.

కొన్ని విష‌యాల్లో జ‌గ‌న్ విమ‌ర్శ‌కులు కూడా నోరు మెద‌ప‌ని స్థితి. పింఛ‌న్లు ఇళ్ల‌కే చేరుతున్నాయి. అది కూడా ఒక‌టో తేదీ ఉద‌య‌మే. రేష‌న్ ఇళ్ల‌కు చేరుతోంది. తూకం క‌రెక్ట్‌గా. త‌ల్లులు పిల్ల‌ల్ని స్కూళ్ల‌కి పంప‌డానికి ఉత్సాహంగా ఉన్నారు. క‌రెంట్ స‌మ‌స్య అని భ‌య‌పెట్టారు కానీ, స‌మ్మ‌ర్ స్టార్ట్ అయినా క‌రెంట్ కోత‌లేమీ లేవు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి