iDreamPost

Amit Shah: అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు.. ‘చంద్రబాబుకు బుద్ధొచ్చింది.. అందుకే మా దగ్గరకు వచ్చారు’

  • Published Mar 16, 2024 | 9:21 AMUpdated Mar 16, 2024 | 9:21 AM

బీజేపీతో పొత్తుపై అసత్య ప్రచారం చేసుకుటుంన్న చంద్రబాబు నాయుడు, టీడీపీ శ్రేణులకు భారీ షాక్‌ ఇచ్చారు అమిత్‌ షా. చంద్రబాబు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

బీజేపీతో పొత్తుపై అసత్య ప్రచారం చేసుకుటుంన్న చంద్రబాబు నాయుడు, టీడీపీ శ్రేణులకు భారీ షాక్‌ ఇచ్చారు అమిత్‌ షా. చంద్రబాబు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

  • Published Mar 16, 2024 | 9:21 AMUpdated Mar 16, 2024 | 9:21 AM
Amit Shah: అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు.. ‘చంద్రబాబుకు బుద్ధొచ్చింది.. అందుకే మా దగ్గరకు వచ్చారు’

అందితే జుట్టు లేదంటే కాళ్లు పట్టుకోవడం చంద్రబాబు నైజం అంటారు.. ఆయన గురించి పూర్తిగా తెలిసిన వాళ్లు. ఇందుకు పెద్ద పెద్ద ఉదాహరణలు అక్కర్లేదు. 2019 ఎన్నికల ముందు బీజేపీని, మోదీని, అమిత్‌ షాని నానా రకాలుగా విమర్శించి.. రాష్ట్ర పర్యటనకు వచ్చిన వారిని చంద్రబాబు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడో జనాలు ప్రత్యక్షంగా చూశారు. కానీ అదే చంద్రబాబు.. ఈ ఎన్నికల వేళ బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నాడు. ఢిల్లీ వెళ్లి కాషాయ పార్టీ పెద్దల అపాయింట్‌మెంట్‌ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశాడు. చివరకు వారితో భేటీ అయ్యి.. పొత్తు కుదుర్చుకుని వచ్చాడు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర మంత్రి అమిత్‌ షా.. చంద్రబాబు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు బుద్ధి రావడం వల్లే మళ్లీ బీజేపీ దగ్గరకు వచ్చారని ఎద్దేవా చేశారు. న్యూఢిల్లీలో శుక్రవారం జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొన్న సందర్భంగా అమిత్‌ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రధాని మోదీని చంద్రబాబు గతంలో టెర్రరిస్ట్‌ అన్నారు.. అలాంటి వ్యక్తితో మీరెలా పొత్తు పెట్టుకున్నారు’’ అని యాంకర్‌ అమిత్‌ షాని ప్రశ్నించింది. అందుకు ఆయన బదులిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.

Chandrababu got enlightened

యాంకర్‌ ప్రశ్నకు అమిత్‌ షా జవాబు చెబుతూ…. ‘‘ప్రధాని మోదీని చంద్రబాబు టెర్రరిస్ట్‌ అని ఎన్డీయే నుంచి వెళ్లిపోయారు. మేం ఆయనను వెళ్లమనలేదు.. తనంతట తనే వెళ్లిపోయారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయాడు. ఇప్పుడు ఆయనకుబాబుకు బుద్ధొచ్చింది. అందుకే మళ్లీ మా వద్దకు వచ్చారు. తిరిగి ఎన్డీయేలో కలుస్తానన్నారు. దాంతో ఆయనను కలుపుకున్నాం’’ అంటూ అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమిత్‌ షా వ్యాఖ్యలతో టీడీపీ చేస్తోన్న అసత్య ప్రచారానికి చెక్‌ పడినట్లు అయ్యింది. ఇన్ని రోజులుగా బీజేపీయే తమను పిలిచిందని, ఎన్డీయేలో చేరాలని ఆహ్వానం పంపిందంటూ టీడీపీ నేతలు చేసిన ప్రచారం అంతా అవాస్తవం అని జనాలకు అర్థం అయ్యింది. పైగా బీజేపీకి చంద్రబాబు పలు షరతులు పెట్టారని పచ్చ మీడియా చేసిన ప్రచారం అంతా బూటకమని తేలిపోయింది. ఓటమి భయంతోనే చంద్రబాబు బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకుని ఎన్డీయేలో చేర్చుకోవాలని ప్రాధేయపడ్డారని అమిత్‌ షా వ్యాఖ్యలతో స్పష్టమైంది.

Chandrababu got enlightened

ఆ తర్వాత యాంకర్‌ మరో సారి.. ‘‘పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ కొన్ని బిల్లులకు మద్దతిచ్చింది కదా. మరి అలాంటప్పుడు ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకోలేదు. చంద్రబాబుతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు’’ అని ప్రశ్నించారు. దీనికి అమిత్‌ షా బదులిస్తూ.. ‘‘బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు వైఎస్సార్‌సీపీ మద్దతు ఇవ్వలేదు. కొన్నింటికి మాత్రమే మద్దతిచ్చింది. అది కూడా ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండటం వల్లే తప్ప బీజేపీ కోసం కాదు. పార్లమెంట్‌లో పార్టీల పరంగా నిర్ణయాలు ఉండవు. ఆయా పార్టీలకు సొంత అజెండాలు, సిద్ధాంతాలు ఉంటాయి. వాటికి తగ్గట్టుగానే అంశాన్ని బట్టి అవి నడుచుకుంటాయి’’ అని స్పష్టం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి