iDreamPost

Holidays: విద్యార్థులకు పండగే.. రేపటి నుంచి వరుసగా 3 రోజులు సెలవులు

  • Published Mar 07, 2024 | 1:11 PMUpdated Mar 07, 2024 | 1:12 PM

తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు పండగలాంటి వార్త ఇది. రేపటి నుంచి అనగా మార్చి 8 నుంచి వరుసగా 3 రోజులు విద్యాసంస్థలకు సెలవులు. ఎందుకంటే..

తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు పండగలాంటి వార్త ఇది. రేపటి నుంచి అనగా మార్చి 8 నుంచి వరుసగా 3 రోజులు విద్యాసంస్థలకు సెలవులు. ఎందుకంటే..

  • Published Mar 07, 2024 | 1:11 PMUpdated Mar 07, 2024 | 1:12 PM
Holidays: విద్యార్థులకు పండగే.. రేపటి నుంచి వరుసగా 3 రోజులు సెలవులు

విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త ఇది. రేపటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి. అంటే మార్చి 8,9,10 తేదీల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది సర్కార్‌. స్కూళ్లతో పాటు ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు కూడా ఈ సెలవులు వర్తిస్తాయి. అలానే ప్రభుత్వ కార్యాలయాలకు కూడా వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. ఇంతకు వరుసగా సెలవులు ఎందుకంటే.. మార్చి 8 శుక్రవారం నాడు మహాశివరాత్రి సందర్భంగా సెలవు. ఇది ప్రభుత్వ హాలీడే కాబట్టి అన్ని విద్యాస్థంస్థలకు.. ప్రభుత్వ కార్యాలయాలకు ఈ సెలవు వర్తిస్తుంది. అలానే మార్చి 9 శనివారం రెండో శనివారం.. ఆ తర్వాత మార్చి 10 ఆదివారం. దాంతో వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి.

వరుసగా మూడు రోజులు సెలవులకు సంబంధించి తెలంగాణ విద్యాశాఖ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. అయితే కొన్ని విద్యాసంస్థలు రెండో శనివారం సెలవు ఇస్తాయో లేదో తెలియదు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌ పరీక్షలు జరుగుతున్నాయి. కనుక వారికి కూడా వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఇక ఇదే నెలలో మరో రెండు రోజులు కూడా విద్యార్థులకు సెలవులు రానున్నాయి. అంటే మార్చి 25న హోలీ పండుగ సందర్భంగా సెలవు రానుంది. అలానే మార్చి 29న గుడ్ ఫ్రైడే రానుంది. దీనిపై తర్వలోనే అధికారిక ప్రకటన రానుంది.

ఇక గత నెలలో కూడా తెలంగాణలోని కొన్ని జిల్లాల విద్యార్థులకు వరుసగా సెలవులు వచ్చాయి. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు వరుసగా 4 రోజుల పాటు సెలవులు వచ్చాయి. కారణం మేడారం జాతర. దాంతో ములుగు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఈ సెలవులు ప్రకటించారు. అలానే రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి కొన్ని రోజుల్లో ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానుండగా.. ఏపీకి సంబంధించి ఇంకా ప్రకటన వెలువడలేదు.

మార్చి 8 శుక్రవారం నాడు మహాశివరాత్రి పర్వదినం. ఇది హిందువులకు ఎంతో ముఖ్యమైన పండుగ. శివరాత్రి నాడు చాలా మంది ఉదయాన్నే లేచి పూజ చేసుకుని.. ఉపవాసం చేసి.. రాత్రంతా జాగారం చేస్తారు. మరుసటి రోజు ఉదయం స్నానం చేసి శివయ్యకు పూజ చేశాక ఉపవాస విరమణ చేస్తారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి