P Venkatesh
Praneeth Hanumanthu: సోషల్ మీడియాలో తండ్రీ కూతుర్ల బంధంపై దిగజారుడు వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్టు అయ్యాడు. అతనిపై 4 సెక్షన్ల కింద కేసు నమోదైంది.
Praneeth Hanumanthu: సోషల్ మీడియాలో తండ్రీ కూతుర్ల బంధంపై దిగజారుడు వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్టు అయ్యాడు. అతనిపై 4 సెక్షన్ల కింద కేసు నమోదైంది.
P Venkatesh
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ట్రోల్స్ చేయడం, రోస్ట్ చేయడం వంటి పైత్యం మరింత ముదిరింది. సామాజిక మాధ్యమాల్లో ఇష్టారీతిలో మాట్లాడుతూ వికృతానందాన్ని పొందుతున్నారు. ఇక్కడ సెలబ్రీటీలనే కాదు.. పవిత్రమైన తండ్రీ కూతుర్ల మధ్య బంధంపై కూడా అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్ ఓ వీడియోలో తండ్రీ కూతుర్ల బంధంపై సభ్య సమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఈ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ప్రణీత్ హనుమంతుపై సినీ సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కఠినంగా శిక్షించాలని కోరుతూ పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో ప్రణీత్ హనుమంతును పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు.
యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును పోలీసులు అరెస్టు చేసిన తర్వాత హైదరాబాద్ కు తరలించారు. యూట్యూబర్ ను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో ప్రణీత్ హనుమంతుకు కోర్టు 15 రోజుల రిమాండ్ ను విధించింది. ఆ తర్వాత అతడిని చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే సోషల్ మీడియా కీచకుడు అయిన ప్రణీత్ హనుమంతుపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ప్రణీత్‌పై 67B it యాక్ట్, ఫోక్సో యాక్ట్, 79, 294 BNSసెక్షన్స్ కింద కేసులు నమోదయ్యాయి. మళ్లీ ఎవరైనా ప్రణీత్ చేసిన తప్పు చేయాలంటేనే వణికిపోయేలా ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రణీత్ తో పాటు లైవ్ చాటింగ్ చేసిన మరో ముగ్గురిపై కేసులు నమోదయ్యాయి. ఏ1గా ప్రణీత్, ఏ2గా నాగేశ్వరరావు, ఏ3గా యువరాజు, ఏ4గా సాయి ఆదినారాయణపై పోలీసులు కేసు నమోదు చేశారు.